తామర గింజలలో దాగివున్న ఆరోగ్య రహస్యాలేంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
తామర గింజల (Lotus seeds) గురించి చాలామందికి సరైన అవగాహన లేదు. కానీ ఈ గింజలలో దాగిఉన్న ఆరోగ్యప్రయోజనాల గురించి తెలుసుకుంటే వీటిని తినకుండా ఉండలేరు.
తామర గింజలను సంప్రదాయ వైద్యంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ గింజలలో ఔషధగుణాలు (Medicinal properties) మెండుగా ఉంటాయి. కనుక ఈ గింజలను తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు బోలెడు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
తామర గింజలను ఫూల్ మాఖనా (Fool Makhana), ఫాక్స్ నట్స్ (Fox Nuts) అని కూడా పిలుస్తారు. ఈ గింజలను కూరల్లోనూ, సూపుల్లోనూ, స్నాక్స్ ఐటమ్స్ గా కూడా వాడుకోవచ్చు. వీటిని పచ్చిగానూ, వేయించుకుని, ఉడకబెట్టి కూడా తినవచ్చు. ఇలా శరీరానికి ఏదో ఒక విధంగా తామర గింజలను అందించడం ముఖ్యం. అప్పుడే ఈ గింజల ప్రయోజనాలను మనం పొందగలం.
ఈ గింజలలో శాచ్యురేటెడ్స్ ఫ్యాట్స్ (Saturated fats), మాంగనీస్, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి ఖనిజాలతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు (Antioxidants) వంటి ఇతర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని మెరుగు పరిచి అనేక అనారోగ్య సమస్యలకు దూరంగా ఉంచుతాయి. ఇవి శరీరంలో ఏర్పడే మలినాలను, హానికర టాక్సిన్లను బయటకు పంపించడంలో సహాయపడుతాయి.
అలాగే ఈ గింజలలో జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది విరోచనం సాఫీగా జరిగేలా చేసి మలబద్ధకం సమస్యలను (Constipation problem) కూడా నివారిస్తుంది. ఈ గింజల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మధుమేహం, గుండెజబ్బులు (Heart disease), క్యాన్సర్ కు దారితీసే ఫ్రీరాడికల్స్ ను నిరోధిస్తాయి.
ఈ గింజలలో సోడియం (Sodium) చాలా తక్కువ మోతాదులో ఉండి పొటాషియం (Potassium) ఎక్కువ మోతాదులో ఉంటుంది. కనుక ఇది బీపీని నియంత్రణలో ఉంచుతుంది. అందుకే బీపీ రోగులకు ఇది మంచి పౌష్టికాహారం. తామర గింజలలో క్యాలరీలు తక్కువ మోతాదులో ఉంటాయి. కనుక మధుమేహగ్రస్తులు ఈ గింజలను తీసుకోవచ్చు.
తామర గింజలు అధిక మోతాదులో పీచు పదార్ధాన్ని కలిగి ఉంటాయి. కనుక బరువు తగ్గాలనుకునే (Weight loss) వారు డైట్ లో తామర గింజలను చేర్చుకుంటే మంచి ఫలితం వుంటుంది. ఈ గింజలలో ఉండే పోషకాలు ఆకలిని పెంచి డయేరియాను నివారిస్తుంది. అంతేకాకుండా రక్తహీనత సమస్యను (Anemia problem) కూడా దూరం చేస్తాయి.
గర్భిణీలు, బాలింతలు తామర గింజలను తీసుకుంటే నీరసం ఉండదు. ఈ గింజలు అతిమూత్ర వ్యాధి సమస్యలను (Urinary tract infection problem) కూడా నివారిస్తాయి. ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలను తగ్గించి నిద్ర బాగా పట్టేలా చేస్తాయి. అలాగే కీళ్ల నొప్పులతో (Arthritis) బాధపడేవారు తామర గింజలను తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
స్త్రీ, పురుషులలో శృంగార సామర్థ్యాన్ని (Erotic potential) పెంచేందుకు మంచి ఔషధంగా ఈ గింజలు సహాయపడతాయి. కనుక తామర గింజలను తరచూ తీసుకుంటే ఆరోగ్యం మెరుగుపడి అనేక అనారోగ్య సమస్యలకు (Illness issues) దూరంగా ఉండవచ్చు.