MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
  • Home
  • Life
  • Health
  • మీకు ఈ సమస్యలున్నాయా? కిడ్నీ బీన్స్ ను తినండి తగ్గిపోతయ్..

మీకు ఈ సమస్యలున్నాయా? కిడ్నీ బీన్స్ ను తినండి తగ్గిపోతయ్..

కిడ్నీ బీన్స్ ను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి చాలా తక్కువ మందికే తెలుసు. నిజమేంటంటే ఇవి మన గుండెను ఆరోగ్యంగా ఉంచడం నుంచి బరువును తగ్గించడం వరకు మనకు ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 03 2023, 03:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

కిడ్నీ బీన్స్ ను శాస్త్రీయంగా ఫేసోలస్ వల్గారిస్ అని అంటారు. ఇవి మూత్రపిండాల ఆకారంలో ఉండే చిక్కుళ్లు. వీటిని ఎన్నో ఏండ్ల నుంచి ఉపయోగిస్తున్నారు. వీటిలో మనల్ని ఆరోగ్యంగా ఉంచే ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే వీటిని ఎన్నో వంటకాల్లో ఉపయోగిస్తారు. అసలు కిడ్నీ బీన్స్ ను తింటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

గుండె ఆరోగ్యం

కిడ్నీ బీన్స్ లో గుండెను ఆరోగ్యంగా ఉంచే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ బీన్స్ లో కరిగే ఫైబర్  పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తక్కువగా ఉంటే ధమనులలో ఫలకం ఏర్పడకుండా ఉంటుంది. ఇది గుండెపోటు, స్ట్రోక్ తో సహా హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కిడ్నీ బీన్స్ లో ఫ్లేవనాయిడ్లు, ఆంథోసైనిన్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్త నాళాలలో ఆక్సీకరణ ఒత్తిడి, మంటను తగ్గిస్తాయి. కిడ్నీ బీన్స్ లో ఉండేడ పొటాషియం రక్తపోటును నియంత్రించడానికి సహాయపడుతుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. 
 

36
kidney beans

kidney beans


రక్తంలో చక్కెర స్థిరీకరన 

రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల ఎన్నో ఆనారోగ్య సమస్యలు వస్తాయి. కిడ్నీ బీన్స్ లో మధుమేహులకు మేలు చేసే ఎన్నో పోషకాలు ఉంటాయి. కిడ్నీ బీన్స్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఈ చిక్కుళ్లు గ్లూకోజ్ శోషణను మందగించడానికి సహాయపడతాయి. వీటిని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి. కిడ్నీ బీన్స్ లో ఉన్న సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు స్థిరమైన శక్తికి సహాయపడతాయి. ఇవి డయాబెటిస్ ఉన్నవారికి ఎంతో సహాయపడుతుంది. వీటిని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్ లో ఉంటాయి. 
 

46


వెయిట్ మేనేజ్మెంట్

కిడ్నీ బీన్స్  బరువు తగ్గేందుకు కూడా ఎంతో సహాయపడతాయి. ఈ చిక్కుళ్లు ప్రోటీన్, ఫైబర్ కు అద్భుతమైన మూలం. ఈ రెండూ కడుపును తొందరగా నింపుతాయి. అలాగే ప్రోటీన్ బరువు తగ్గేటప్పుడు కండర ద్రవ్యరాశిని కాపాడటానికి సహాయపడుతుంది. అలాగే జీర్ణం కావడానికి ఎక్కువ శక్తి అవసరం. ఇవి శరీర జీవక్రియను పెంచుతుంది. కిడ్నీ బీన్స్ లోని కరిగే ఫైబర్ జీర్ణవ్యవస్థలోని నీటిని గ్రహిస్తుంది. అలాగే జీర్ణక్రియను మందగించే జెల్ లాంటి పదార్థాన్ని ఏర్పరుస్తుంది. ఈ ప్రభావం ఆకలిని తగ్గించడానికి, అతిగా తినడాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. 
 

56
<p>kidney beans</p>

<p>kidney beans</p>

జీర్ణ ఆరోగ్యం

కిడ్నీ బీన్స్ జీర్ణశయాంతర ఆరోగ్యానికి కూడా మంచి మేలు చేస్తుంది. ఈ చిక్కుళ్లలో ఎక్కువగా ఉండే ఫైబర్ కంటెంట్  ప్రేగు కదలికలను ప్రోత్సహించడానికి సహాయపడుతుంది. అలాగే మలబద్దకాన్ని నివారిస్తుంది.  ఈ ఫైబర్ ప్రీబయోటిక్ గా పనిచేస్తుంది. ప్రయోజనకరమైన గట్ బ్యాక్టీరియాకు మంచి పోషణను కూడా అందిస్తుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం కూడా చేస్తుంది.
 

66


పోషకాల మంచి మూలం

కిడ్నీ బీన్స్ పోషకాలకు మంచి వనరు. ఇవి మొక్కల ఆధారిత ప్రోటీన్ కు అద్భుతమైన మూలం. శాకాహారులకు ఇవి ప్రయోజనకరంగా ఉంటాయి. కిడ్నీ బీన్స్ లో విటమిన్లు, ఫోలేట్, ఇనుము, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలోని ఫోలేట్ కణాల విభజనకు అవసరమవుతుంది. ఆరోగ్యకరమైన నాడీ వ్యవస్థకు కూడా మద్దతునిస్తుంది. అయితే శరీరమంతా ఆక్సిజన్ ను తీసుకెళ్లడంలో ఇనుము కీలక పాత్ర పోషిస్తుంది. దీనిలోని మెగ్నీషియం కండరాలు, నరాల పనితీరుకు మద్దతునిస్తుంది. 
 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image2
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image3
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved