ఇది తింటే చాలు... వ్యాధులు అన్ని మాయం.. గోంగూరతో ఎన్ని రకాల ప్రయోజనాలో తెలుసా?
తెలుగువారు ఎక్కువగా ఉపయోగించే ఆకుకూరలలో గోంగూర (Gongura) ఒకటి. గోంగూరలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. గోంగూరతో అనేక రకాల వంటలను చేసుకుంటారు. ఇవి నోటికి రుచిని అందించడంతో పాటు శరీరానికి అనేక పోషకాలను అందించి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇప్పుడు మనం గోంగూరను తీసుకుంటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల (Health benefits) గురించి తెలుసుకుందాం..

తెలుగువారు ఎక్కువగా ఉపయోగించే ఆకుకూరలలో గోంగూర (Gongura) ఒకటి. గోంగూరలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. గోంగూరతో అనేక రకాల వంటలను చేసుకుంటారు. ఇవి నోటికి రుచిని అందించడంతో పాటు శరీరానికి అనేక పోషకాలను అందించి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇప్పుడు మనం గోంగూరను తీసుకుంటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల (Health benefits) గురించి తెలుసుకుందాం..
గోంగూరలో ఎ, బి1, బి2, బి9 విటమిన్లతో పాటు విటమిన్ సి కూడా ఉంటుంది. వీటితో పాటు క్యాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, ఐరన్ వంటి ఇతర ఖనిజాలు (Minerals) కూడా ఉంటాయి. అంతేకాకుండా యాంటీఆక్సిడెంట్స్ మరెన్నో పోషక పదార్థాలు (Nutrients) ఉంటాయి. ఇవి శరీరానికి అందించే ఆరోగ్య ప్రయోజనాలు అనేకం.
రక్తసరఫరాను మెరుగుపరుస్తుంది: గోంగూరలో పొటాషియం (Potassium) సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరంలోని రక్త సరఫరాను (Blood supply) మెరుగుపరిచి శరీరంలోని అన్ని అవయవాలకు రక్త ప్రసరణ బాగా జరిగేలా చేసి గుండె పోటు, రక్తపోటు వంటి సమస్యల నుంచి కాపాడుతుంది.
అధిక బరువును తగ్గిస్తుంది: గోంగూరలో ఉండే పోషకాలు చెడు కొలెస్ట్రాల్ను (Bad cholesterol) తగ్గించి అధిక బరువును తగ్గిస్తాయి (Reduce weight). అలాగే ఇందులో ఉండే పీచు పదార్థాలు జీర్ణక్రియను మెరుగుపరచి మలబద్దకం, ఊబకాయం వంటి సమస్యలను తగ్గించి శరీరంలో కొవ్వు శాతాన్ని తగ్గిస్తుంది.
మధుమేహగ్రస్తులకు మంచిది: మధుమేహగ్రస్తులకు గోంగూర ఔషధంగా సహాయపడుతుంది. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను (Sugar levels) తగ్గిస్తుంది. అలాగే శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను పెంచి మధుమేహం (Diabetes) నుంచి కాపాడుతుంది. కనుక మధుమేహగ్రస్తులు గోంగూరను తీసుకోవడం మంచిది.
వ్యాధుల నుంచి కాపాడుతుంది: గోంగూరలో ఉండే పోలిక్ యాసిడ్ (Folic acid) గుండె, కిడ్నీ సమస్యలను తగ్గించడానికి సాయపడుతుంది. అంతే కాకుండా కొన్ని దీర్ఘకాలిక వ్యాధులను (Diseases) నయం చేయడానికి కూడా గోంగూర సహాయపడుతుంది. కనుక తరచుగా గోంగూరను తీసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు.
క్యాన్సర్ ను తగ్గిస్తుంది: గోంగూరలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు (Antioxidants) క్యాన్సర్ (Cancer) ను తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఇవి శరీరంలో క్యాన్సర్ కణాల వ్యాప్తిని అడ్డుకొని క్యాన్సర్ నుంచి దూరంగా ఉంచుతుంది. గోంగూర క్యాన్సర్ కు విరుగుడుగా సహాయపడుతుంది.
జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది: గోంగూర ఆకులను మెత్తగా పేస్ట్ చేసి ఈ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేసుకుంటే జుట్టు రాలే సమస్యలు (Hair Raleigh Problems) తగ్గుతాయి. అంతేకాకుండా గోంగూరలో ఉండే ఔషధ గుణాలు (Medicinal properties) జుట్టు ఒత్తుగా పెరగడానికి సహాయపడుతాయి.
కంటిచూపును మెరుగు పరుస్తుంది: గోంగూరలో విటమిన్ ఎ (Vitamin A) సమృద్ధిగా ఉంటుంది. కనుక గోంగూరను తరచూ తీసుకుంటే కంటి సమస్యలు (Eye problems) తగ్గడంతో పాటు కంటి చూపు మెరుగుపడుతుంది. అంతేకాకుండా వయసు పెరగడంతో వచ్చే దృష్టి లోపాన్ని తగ్గిస్తుంది.
వీటితోపాటు గోంగూరలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు నిద్రలేమి (Insomnia), జలుబు, దగ్గు, ఎముకల సమస్యలను (Bone problems) తగ్గించడానికి సహాయపడుతాయి. కనుక తరచుగా గోంగూరను తీసుకోవడం మంచిదని వైద్యులు చెబుతున్నారు.