పరిగడుపున వెల్లుల్లిని తింటే ఈ వ్యాధి రాదు
ప్రతిరోజూ పరిగడుపున వెల్లుల్లిని తినడం అలవాటు చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. వెల్లుల్లిలో అల్లిసిన్ అనే సమ్మేళనమే కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. అంతేకాదు దీనిలో రక్తం గడ్డకట్టే లక్షణాలు కూడా ఉంటాయి.
- FB
- TW
- Linkdin
Follow Us
)
garlic
వెల్లుల్లిని క్రమం తప్పకుండా కూరల్లో వేస్తుంటాం. దీంతో కూరలు టేస్టీగా అవుతాయి. వెల్లుల్లిలో విటమిన్ సి, విటమిన్ కె, ఫోలేట్, మాంగనీస్, సెలీనియం, ఫైబర్, ఐరన్, కాల్షియం, భాస్వరం, పొటాషియంతో సహా ఎన్నో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. అనేక ఆరోగ్య ప్రయోజనాలతో నిండిన వెల్లుల్లి మన రోగనిరోధక శక్తిని పెంచడానికి, జీర్ణ సమస్యలను నివారించడానికి, కడుపు ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది.
Garlic
ప్రతిరోజూ ఉదయం పరగడుపున వెల్లుల్లిని తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ తగ్గుతుంది. వెల్లుల్లిలో అల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. దీనిలో కొలెస్ట్రాల్ ను తగ్గించే, రక్తం గడ్డకట్టే లక్షణాలు ఉంటాయి. ఉదయాన్నే పరగడుపున గోరువెచ్చని నీటిలో వెల్లుల్లి కలుపుకుని తాగితే అల్లిసిన్ ప్రయోజనాలను అందుతాయి. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.
ఇవి గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. వెల్లుల్లి అధిక రక్తపోటును తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. ఫలితంగా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. వెల్లుల్లి తుమ్ములు, జలుబు, దగ్గు లక్షణాల తీవ్రతను కూడా తగ్గిస్తుంది. ఇది మన రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. కాబట్టి వెల్లుల్లిని డైట్ లో చేర్చుకోవడం మంచి అలవాటు. వెల్లుల్లి శ్వాసకోశ సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. వెల్లుల్లిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ కాంపోనెంట్స్ దీనికి తోడ్పడతాయి. వెల్లుల్లి తినడం వల్ల కాలేయ ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది.
డయాబెటిస్ నియంత్రణకు, మెదడు ఆరోగ్యానికి కూడా వెల్లుల్లి ఎంతో మేలు చేస్తాయి. బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవడానికి, బరువు తగ్గడానికి వెల్లుల్లిని మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవచ్చని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. వెల్లుల్లి మన శరీరానికి అవసరం లేని కేలరీలను బర్న్ చేయడానికి కూడా సహాయపడుతుంది. వెల్లుల్లికి ఉన్న మరొక ప్రత్యేకత ఏంటంటే.. ఆకలిని అణచివేసే సామర్థ్యం. ఆకలిని తగ్గించి అతిగా తినడాన్నిఇది నివారిస్తుంది. ఇది బరువు తగ్గడానికి బాగా సహాయపడుతుంది. ఇందుకోసం పచ్చి వెల్లుల్లిని ఖాళీ కడుపుతో తినాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.