అంజీరలను నానబెట్టుకుని తింటే ఈ అనారోగ్య సమస్యలన్నీ మటుమాయం..!
అంజీరల్లో మన శరీరానికి అవసరమైన ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని డ్రైగా తినేవారు చాలా మందే ఉన్నారు. అయితే ఈ డ్రై పండ్లను నానబెట్టి తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
figs
అంజీర లేదా అత్తి పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. పండిన అత్తి పండ్లు, ఎండిన అత్తిపండ్లు సమానమైన పోషకాలను కలిగి ఉంటాయి. అంజీరలు యాంటీ ఆక్సిడెంట్లకు మంచి వనరు. వీటిలో ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఈ పండ్లలో మెగ్నీషియం, కాల్షియం, రాగి, పొటాషియం, విటమిన్ కె వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. అంజీరలను నానబెట్టి తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయంటున్నారు నిపుణులు.
Figs
అంజీర పండ్లను రెగ్యులర్ గా తినడం వల్ల చర్మం కూడా అందంగా, ఆరోగ్యం ఉంటుంది. అంజీర పండ్లను నానబెట్టి తినడం వల్ల మీ చర్మం కాంతివంతంగా మెరిసిపోతుంది. ఉన్న చర్మ సమస్యలు కూడా తగ్గిపోతాయి. నానబెట్టిన అంజీర పండ్లను తింటే చర్మంపై ముడతలు పడకుండా, యవ్వనంగా ఉంటుంది. ఈ పండ్లలో ఉండే విటమిన్ ఎ, విటమిన్ ఇ, జింక్ వృద్ధాప్య సంకేతాలను నెమ్మదింపజేస్తాయి. అలాగే మొటిమలు, మచ్చలు ఏర్పడకుండా కాపాడుతాయి.
Image: Freepik
అత్తిపండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి మన చర్మాన్ని సూర్యరశ్మి నుంచి కాపాడుతాయి. ఈ పండ్లలో ఉండే ఐరన్ మన నెత్తిమీద రక్త ప్రసరణను పెంచడానికి సహాయపడుతుంది. దీంతో జుట్టు రాలే అవకాశం తగ్గుతుంది. అలాగే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. నానబెట్టిన అంజీరలో ఉండే కాల్షియం, మెగ్నీషియం మన ఎముకలను, గోళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. నానబెట్టిన అంజీర పండ్లను తినడం వల్ల ఇంకా ఎలాంటి ప్రయోజనాలున్నాయంటే?
1. అంజీరల్లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంఉంటుంది. కాబట్టి ఈ పండ్లను తింటే మలబద్దకం సమస్య తగ్గిపోతుంది. అలాగే జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. గట్ ఆరోగ్యంగా ఉంటుంది.
2. అంజీర పండ్లలో సోడియం తక్కువగా ఉండి.. పొటాషియం పుష్కలంగా ఉంటుంది. అందుకే ఇవి రక్తపోటును తగ్గించడానికి ప్రయోజనకరంగా ఉంటాయి.
3. అంజీరలు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి కూడా సహాయపడతాయి. అలాగే ఈ పండ్లు కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయి.
4. ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇలాంటి పండ్లను తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
5.అంజీరలో ఉండే క్యాల్షియం, ఫాస్పరస్ లు మన ఎముకలను బలంగా ఉంచుతాయి.
6. అంజీర పండ్లలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఈ పండును తింటే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంటాయి.
7. ఉదయాన్నే పరగడుపున నానబెట్టిన అత్తి పండ్లను తింటే మీరు సులువుగా బరువు తగ్గుతారు. అలాగే మలబద్దకం సమస్య నుంచి కూడా బయటపడతారు.