MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Health
  • ఖర్జూరాలను రోజూ తినాలనేది ఇందుకే..!

ఖర్జూరాలను రోజూ తినాలనేది ఇందుకే..!

మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారాలను ఖచ్చితంగా తినాలి. మనల్ని ఆరోగ్యంగా ఉంచే ఆహారాల్లో ఖర్జూరాలు ఒకటి. ఖర్జూరాలను తింటే మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఇవి మనకు చేసే మేలు గురించి తెలిస్తే రోజూ తినకుండా ఉండలేరు. 

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Nov 07 2023, 07:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

మనలో చాలా మంది ఖర్జూరాలను ఇష్టంగా తింటారు. కానీ అపుడప్పుడు మాత్రమే. కానీ వీటిని రెగ్యులర్ గా తినొచ్చు. ఎందుకంటే ఇవి మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ డ్రై ఫ్రూట్ లో విటమిన్ సి, బి విటమిన్లు, ఫైబర్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియంతో పాటుగా శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లతో పాటుగా ఎన్నో ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
dates

dates

ఖర్జూరాలు ఫ్రక్టోజ్, గ్లూకోజ్, సుక్రోజ్ కు సహజ వనరు. ఖర్జూరాల్లో కరగని, కరిగే ఫైబర్స్ మెండుగా ఉంటాయి. ఈ ఫైబర్ మన జీర్ణక్రియకు సహాయపడుతుంది. జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. మన రోజువారి ఆహారంలో ఖర్జూరాలను చేర్చడం వల్ల మన జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. మలబద్దకం వంటి సమస్యలు వచ్చే అవకాశమే ఉండదు. 

35

ఖర్జూరాల్లో మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఎముకలను బలంగా ఉంచడానికి చాలా అవసరం.  ఖర్జూరాలను రెగ్యులర్ గా తినడం వల్ల బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదం తగ్గుతుంది. అలాగే మీ మొత్తం ఎముకల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. 

45

హిమోగ్లోబిన్ స్థాయిలు తక్కువగా ఉన్నవారికి కూడా ఖర్జూరాలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి.  ఖర్జూరాలు పొటాషియానికి అద్భుతమైన వనరులు. పొటాషియం అనేది ఒక ఖనిజం. ఇది మన గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఈ పొటాషియం అధిక రక్తపోటును నియంత్రించడానికి సహాయపడుతుంది. రక్తపోటు స్థాయిలను స్థిరంగా ఉంచడానికి ఇది సహాయపడుతుంది. అలాగే స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడానికి కూడా ఖర్జూరాలు సహాయపడతాయి. అలాగే ఖర్జూరాల్లో ఉండే ఫైబర్స్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడతాయి.

55

ఖర్జూరాల్లో ఐరన్ కూడా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి అవసరం. మీ రోజువారి ఆహారంలో ఖర్జూరాలను చేర్చడం వల్ల మీ శరీరంలో ఇనుము లోపం ఉండదు. ఖర్జూరాల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉండటం వల్ల ఆక్సీకరణ ఒత్తిడి, మంట తగ్గిపోతాయి. ఖర్జూరాలను రెగ్యులర్ గా తినడం వల్ల మీ జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
ఆహారం
ఆరోగ్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
నీళ్లు తాగిన వెంటనే పరిగెత్తితే క‌డుపులో ఒక‌వైపు నొప్పి ఎందుకు వస్తుంది? దీనికి కార‌ణం ఏంటంటే?
Recommended image2
ఆల్క‌హాల్ తాగిన తర్వాత ట్యాబ్లెట్స్‌ వేసుకోవచ్చా? వైద్యులు ఏమంటున్నారంటే..
Recommended image3
Blood Pressure: బీపీ మిష‌న్ ఎలా ప‌నిచేస్తుంది.? దీని వెన‌కాల ఉన్న మెకానిజం ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved