క్యాబేజీని తీసుకుంటే కలిగే సూపర్ హెల్త్ బెనిఫిట్స్ ఏమిటంటే!?
క్యాబేజీలో (Cabbage) అనేక పోషకాలు ఉంటాయి. క్యాబేజీని వంటలలో, సలాడ్స్ లో ఉపయోగిస్తారు. క్యాబేజీలో అనేక రకాలు ఉన్నాయి. ఇందులో రెడ్ క్యాబేజీ, గ్రీన్ క్యాబేజీ చాలా ముఖ్యమైనవి. వీటిని తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇప్పుడు క్యాబేజీని తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాల (Health benefits) గురించి తెలుసుకుందాం..

క్యాబేజీలో ఐరన్, పొటాషియం (Potassium), విటమిన్ సి, ఫ్లేవనాయిడ్స్, బీటా కెరోటిన్, ఫైబర్ వంటి ఇతర ఖనిజాలు (Minerals) పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. వీటి కారణంగా క్యాబేజీ అనేక వ్యాధులను నయంచేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
క్యాబేజీని తీసుకుంటే ఆరోగ్యంతోపాటు (Health) చర్మ సౌందర్యం (Skin Beauty) కూడా మెరుగుపడుతుంది. కనుక క్యాబేజీని ఏదో ఒక రూపంలో శరీరానికి అందించడం ముఖ్యం. క్యాబేజీని పచ్చిగా తీసుకున్న ఆరోగ్యానికి మంచిదే.
జీర్ణ సమస్యలు తగ్గుతాయి: క్యాబేజీలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను (Digestion) సక్రమంగా పనిచేయడానికి సహాయపడుతుంది. అలాగే మలవిసర్జన సాఫీగా జరిగి మలబద్దకం సమస్యలు (Constipation problems) తగ్గుతాయి.
ఉదర భాగాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది: క్యాబేజీ రసంలో గ్లూటమిన్ అనే కంటెంట్ లో యాంటీ అల్సర్ (Anti-ulcer) గుణాలను కలిగి ఉంటాయి. ఇది కడుపులో మంట, నొప్పి వంటి సమస్యలను తగ్గించి ఉదర భాగాన్ని ఆరోగ్యంగా (Abdominal health) ఉంచుతుంది.
కంటి ఆరోగ్యానికి మంచిది: క్యాబేజీలో బీటా కెరోటిన్ (Beta carotene) పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి లోపల ఏర్పడే మచ్చలను నివారించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా కంటి శుక్లాలు రాకుండా కాపాడి కంటి ఆరోగ్యాన్ని (Eye health) మెరుగుపరుస్తుంది.
క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది: క్యాబేజీలో ఉండే ఫ్లేవనాయిడ్స్ (Flavonoids) శరీరంలోని క్యాన్సర్ కణాల వ్యాప్తిని అడ్డుకుంటాయి. కనుక క్యాబేజిని డైట్ లో చేర్చుకుంటే క్యాన్సర్ (Cancer) రాకుండా కాపాడుతుంది.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది: క్యాబేజీలో ఉండే విటమిన్ సి (Vitamin C) శరీరానికి వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని పెంచి రోగనిరోధక వ్యవస్థను (Immune system) బలోపేతం చేస్తుంది. అంతేకాకుండా ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడుతుంది.
వృద్ధాప్య ఛాయలు తగ్గిస్తుంది: క్యాబేజీలో యాంటీఆక్సిడెంట్లు (Antioxidants) సమృద్ధిగా ఉంటాయి. ఇవి వృద్ధాప్య ఛాయలకు దారితీసే ఫ్రీరాడికల్స్ నుంచి చర్మాన్ని రక్షిస్తాయి. కనుక తరచూ క్యాబేజీని తీసుకుంటే వృద్ధాప్య ఛాయలు (Aging shades) తగ్గి యవ్వనంగా కనిపిస్తారు.
ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది: ఇన్ఫెక్షన్ల కారణంగా ఏర్పడే దగ్గు, గొంతు నొప్పి, జ్వరం వంటి సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. క్యాబేజీ ఆకుల రసాన్ని (Juice of cabbage leaves) తాగితే దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు. వాతావరణం మార్పుల కారణంగా ఏర్పడే ఇన్ఫెక్షన్లు (Infections) తగ్గుతాయి.
బరువు తగ్గుతారు: బరువు తగ్గాలనుకునేవారు క్యాబేజీని ఆహారంలో భాగంగా చేసుకోవడం మంచిది. ఇందులో ఉండే తక్కువ కేలరీలు (Low calories) అధిక బరువును తగ్గించడానికి సహాయపడుతాయి.