MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • రోజుకో ఆపిల్ ను తిన్నా చాలు.. ఈ వ్యాధులు అసలే రావు

రోజుకో ఆపిల్ ను తిన్నా చాలు.. ఈ వ్యాధులు అసలే రావు

ఆపిల్ పండులో విటమిన్ ఎ, విటమన్ బి, విటమిన్ కె, విటమిన్ సి, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు పుష్కలంగా ఉంటాయి. అయితే ఆపిల్ పండును రోజూ తింటే ఎన్నో రోగాల ముప్పు తప్పుతుంది.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 11 2023, 02:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Image: Freepik

Image: Freepik

రోజుకో ఒక ఆపిల్ పండును తింటే హాస్పటల్ కు వెళ్లాల్సిన అవసరం లేదని చెప్తుంటారు ఆరోగ్య నిపుణులు. అవును మరి ఆపిల్ పండును రోజుకు ఒకటి తిన్నా ఎన్నో రోగాల ముప్పు తప్పుతుంది. ఆపిల్ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న పండు. దీనిలో ఉండే పెక్టిన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ పండులో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ కె, పొటాషియం, ఐరన్, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు పుష్కలంగా ఉంటాయి. రోజుకో ఆపిల్ పండును తినడం వల్ల ఎలాంటి రోగాల ముప్పు తప్పుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
 

27
Image: Getty Images

Image: Getty Images

జీర్ణక్రియ

ప్రస్తుత కాలంలో చాలా మంది అజీర్థి సమస్యతో బాధపడుతున్నారు. అయితే ఆపిల్స్  ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది మన జీర్ణక్రియకు సహాయపడుతుంది. రోజుకో ఆపిల్ పండును తింటే శరీరంలోని టాక్సిన్స్ తొలగిపోతాయి. దీంతో జీవక్రియలు మెరుగుపడతాయి. 
 

37
Image: Getty Images

Image: Getty Images

అధిక కొలెస్ట్రాల్ 

అధిక కొలెస్ట్రాల్ గుండెపోటు, స్ట్రోక్ తో సహా ఎన్నో ప్రమాదకరమైన రోగాలకు దారితీస్తుంది. మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం కొలెస్ట్రాల్ ను నియంత్రణలో ఉంచుకోవాల్సిందే. అయితే ఆపిల్ ను తింటే  ధమనుల్లో కొవ్వు పేరుకుపోయే అవకాశాలు తగ్గుతాయి. దీంతో మీ గుండె ఆరోగ్యంగా, సురక్షితంగా ఉంటుంది. 
 

47
Image: Getty Images

Image: Getty Images

మధుమేహులు

ఫైబర్ పుష్కలంగా ఉండే యాపిల్స్  డయాబెటీస్ పేషెంట్లకు ఎంతో మేలు చేస్తుంది. అందుకే మధుమేహులు ఆపిల్స్ ను ధైర్యంగా తినొచ్చు. ఆపిల్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే మీ రక్తంలో చక్కెర స్థాయిలు కూడా నియంత్రణలో ఉంటాయి. 

57
Image: Getty Images

Image: Getty Images

ఇమ్యూనిటీ పవర్

ఆపిల్స్ కూడా విటమిన్ సి ఎక్కువ మొత్తంలో ఉంటుంది. రోజుకు ఒక ఆపిల్ పండును తింటే మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 

ఎముకల ఆరోగ్యం

యాపిల్స్ పండ్లను తినడం వల్ల మీ ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. యాపిల్స్ లో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. అందుకే ప్రతిరోజూ యాపిల్స్ తినడం వల్ల మీ ఎముకలు, దంతాలు బలంగా ఉంటాయి. 
 

67

విటమిన్ ఎ

ప్రతిరోజూ ఒక ఆపిల్ పండును తినడం వల్ల మీ కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. ఈ పండ్లలో ఉండే విటమిన్ ఎ కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. 

వెయిట్ లాస్

ఫైబర్ ఎక్కువగా, కేలరీలు తక్కువగా ఉండే ఆపిల్ పండును తినడం వల్ల మీ ఆకలి తగ్గుతుంది. దీంతో మీరు సులువుగా బరువు తగ్గొచ్చు. 

77

ఊపిరితిత్తుల ఆరోగ్యం

ఆపిల్ పండును తింటే డీహైడ్రేషన్ వచ్చే సమస్య తగ్గుతుంది. అలాగే ఈ పండ్లు మన ఊపిరితిత్తుల ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. 

చర్మ ఆరోగ్యం

ఆపిల్ పండులో విటమిన్ సి, విటమిన్ ఎ, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇలాంటి పండును తినడం వల్ల మీ చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాదు ఈ పండు  వృద్ధాప్య లక్షణాలను కూడా కొంతవరకు నిరోధిస్తుంది. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Watermelon: పుచ్చకాయను ఫ్రిజ్‌లో పెట్టుకొని తినొచ్చా? తింటే ఏమవుతుంది?
Recommended image2
Sabja Water: ఎండాకాలంలో సబ్జా వాటర్ తాగితే బరువు తగ్గుతారా?
Recommended image3
Menstrual Health: పీరియడ్స్‌లో మలబద్ధకమా? ఈ టిప్స్ పాటిస్తే సమస్య దూరం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved