MalayalamNewsableKannadaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Life
  • Health
  • గుమ్మడి కాయ జ్యూస్ సర్వరోగ నివారిణి.. ఎన్ని లాభాలో తెలుసా?

గుమ్మడి కాయ జ్యూస్ సర్వరోగ నివారిణి.. ఎన్ని లాభాలో తెలుసా?

భారతీయ సాంప్రదాయ వంటకాలలో గుమ్మడికాయకు మంచి స్థానం ఉంది. గుమ్మడికాయలో (Pumpkin) అద్భుతమైన ఔషధ గుణాలు (Medicinal properties) ఉన్నాయి.  

2 Min read
Navya G
Published : May 03 2022, 03:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
110
Asianet Image

అయితే గుమ్మడికాయను గృహప్రవేశాలలో, కొత్త వాహనాలకు దిష్టి తీయడానికి ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే గుమ్మడికాయ వంటలకు, దిష్టి తీయడానికే కాదండోయ్ ఆరోగ్యానికి కూడా మంచి ఫలితాలను అందిస్తుంది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
 

210
Asianet Image

గుమ్మడికాయలో విటమిన్ బి1, బి2, బి6, సి, డి,  బీటా కెరోటిన్స్ (Beta carotenes) పుష్కలంగా ఉంటాయి. అంతే కాకుండా ఇందులో ఐరన్, క్యాల్షియం, కాపర్, పొటాషియం, జింక్ వంటి పోషకాలు (Nutrients) మెండుగా ఉంటాయి. కనుక కూల్ డ్రింక్స్ వంటి రసాయన శీతల పానీయాలకు బదులుగా గుమ్మడికాయతో జ్యూస్ చేసుకుని తీసుకుంటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు బోలెడు.
 

310
Asianet Image

జీర్ణక్రియ మెరుగుపడుతుంది: గుమ్మడికాయ జ్యూస్ లో డైటరీ ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది.  ఇది జీర్ణక్రియ (Digestion) సాఫీగా జరిగేలా చేస్తుంది. అలాగే ఇందులో ఉండే పోషకాలు మలబద్దక సమస్యలను (Constipation problems) కూడా నివారిస్తాయి.
 

410
Asianet Image

వ్యాధి నిరోధక శక్తి పెంచుతుంది: గుమ్మడికాయలో విటమిన్ సి, మినిరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి వ్యాధి నిరోధక శక్తిని (Immunity) పెంచిని శరీరానికి హాని చేసే వివిధ ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యాన్ని పెంచుతాయి. దీంతో అనేక అనారోగ్య సమస్యలకు (Illness issues) దూరంగా ఉండవచ్చు.
 

510
Asianet Image

శరీర వేడిని తగ్గిస్తుంది: గుమ్మడికాయ జ్యూస్ లో శరీరాన్ని చల్లబరిచే గుణాలు పుష్కలంగా ఉంటాయి. కనుక గుమ్మడికాయ జ్యూస్ (Pumpkin Juice) ను తీసుకుంటే శరీర వేడి తగ్గిపోయి చల్లదనం అందుతుంది. దీంతో డీహైడ్రేషన్ (Dehydration) సమస్యలకు దూరంగా ఉండవచ్చు.
 

610
Asianet Image

నిద్రలేమి సమస్యలు తగ్గుతాయి: నిద్రలేమి సమస్యతో (Insomnia) బాధపడేవారు గుమ్మడి జ్యూస్ లో తేనె (Honey) కలుపుకుని తాగితే నిద్ర బాగా పడుతుంది. అలాగే ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి.
 

710
Asianet Image

గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది: గుమ్మడికాయలో పీచు, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి అధిక రక్తపోటు (High blood pressure) సమస్యలను నివారించి గుండె ఆరోగ్యాన్ని (Heart health) మెరుగుపరుస్తాయి. కనుక ప్రతి రోజు గుమ్మడి జ్యూస్ ను తీసుకోవడం మంచిది.
 

810
Asianet Image

కాలేయ ఆరోగ్యం మెరుగుపడుతుంది: గుమ్మడికాయలో యాంటీ ఆక్సిడెంట్స్ (Antioxidants), విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి కాలేయ పనితీరును మెరుగుపరుస్తాయి. దీంతో కాలేయ ఆరోగ్యం (Liver health) మెరుగుపడుతుంది.
 

910
Asianet Image

సంతాన సాఫల్యతను పెంచుతుంది: గుమ్మడి జ్యూస్ ను తీసుకుంటే ఇందులో ఉండే ఐరన్   హార్మోన్ల అసమతుల్యత (Hormonal imbalance) సమస్యలను తగ్గిస్తుంది. దీంతో సంతాన ప్రాప్తిని (Fertility) పొందగలరు. కనుక తల్లి కావాలనుకునే స్త్రీలు గుమ్మడి జ్యూస్ ను తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
 

1010
Asianet Image

అలాగే ఈ జ్యూస్ తీసుకుంటే ఫైల్స్ (Files), కిడ్నీలో స్టోన్స్, కంటి, చర్మ, జుట్టు, మార్నింగ్ సిక్నెస్ (Morning Sickness) వంటి సమస్యలు తగ్గుతాయి. కనుక ప్రతిరోజూ డైట్లో గుమ్మడి జ్యూస్ ను చేర్చుకుంటే మరిన్ని ఇతర ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Navya G
About the Author
Navya G
 
Recommended Stories
Top Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved