సమ్మర్ స్పెషల్.. మట్టి కుండలోని నీళ్లు తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
ఆరోగ్యం పట్ల అందరిలోనూ అవగాహన పెరగడంతో చాలా మంది మట్టి పాత్రలు, మట్టికుండను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.

ముఖ్యంగా వేసవికాలంలో మట్టి కుండలను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. తక్కువ ఖర్చులో అందుబాటులో ఉండే మట్టి కుండను పేదవాడి ఫ్రిజ్ గా పిలుస్తారు. మట్టి కుండలో (Clay pot) నిల్వ చేసిన నీటిని తాగితే ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు (Health benefits) కలుగుతాయి. అదేలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
మట్టి కుండలలో నిల్వచేసిన నీరు అమృతప్రాయం అని మన పెద్దలు చెబుతుంటారు. పూర్వకాలంలో మట్టి కుండలను ఎక్కువగా ఉపయోగించేవారు. అందుకే వారు ఎటువంటి అనారోగ్య సమస్యలు (Illness issues) లేకుండా ఆరోగ్యంగా (Healthy) ఉండేవారు. సహజంగా ప్రకృతి నుంచి లభించే ఎర్రమట్టితో కుండలను తయారు చేస్తారు.
కనుక మట్టి కుండలో నిల్వ చేసిన నీటిని తాగితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ (Side effects) ఉండవు. మనం ఫ్రిజ్ లో నిల్వ చేసిన చల్లటి నీటితో పోలిస్తే
మట్టి కుండలో నిల్వ చేసిన నీరు చాలా శ్రేష్టమైనవి. మట్టి కుండలోని నీరు బయటి వాతావరణ శీతోష్ణస్థితులను బట్టి చల్లగా మారుతుంటాయి. మట్టి కుండ ఎటువంటి సాంకేతిక పరికరాలు లేని మంచి ప్యూరిఫైయర్ (Purifier) గా పనిచేస్తుంది.
ఇది నీటిలోని మలినాలను, బ్యాక్టీరియాలను, ఫంగస్ లను సహజంగా వడగట్టి శుద్ధమైన మంచి నీటిని మనకు అందిస్తుంది. కనుక మట్టి కుండలో నీటిని తీసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు. ఇది శరీరంలోని మెటబాలిజంను (Metabolism) రేటును పెంచి తిన్న ఆహారం తేలికగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. దీంతో జీర్ణప్రక్రియ మెరుగుపడి జీర్ణకోశ సమస్యలు (Gastrointestinal problems) తగ్గుతాయి. అలాగే శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా అడ్డుకుంటుంది.
మట్టిలో ఆల్కలీన్ స్వభావం (Alkaline nature) ఉంటుంది. ఇది నీటిలోని ఆమ్లత్వంపై పనిచేస్తుంది. దీంతో శరీరానికి అవసరమైన పీహెచ్ లెవల్స్ ను సమతుల్యం చేసి గ్యాస్ట్రిక్ సమస్యలను (Gastric problems) కూడా తగ్గిస్తుంది. మట్టి కుండలో నీరు మన దాహార్తిని తీర్చడమే కాకుండా శరీరానికి ఎన్నో ప్రయోజనాలను అందించి ఆరోగ్యంగా ఉంచుతుంది. మట్టి కుండలో నిల్వ చేసిన నీటిని శరీరం తొందరగా శోధించబడుతుంది.
అంతే కాకుండా మట్టి కుండలోని నీరు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. కనుక ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలను అందించే మట్టి కుండ నీటిని తాగడమే శ్రేయస్కరం. మట్టి కుండలోని నీటిని తాగితే గొంతు, శ్వాస సంబంధిత సమస్యలు (Respiratory problems) తగ్గుతాయి. అలాగే ముఖ్యంగా వేసవికాలంలో వడదెబ్బకు (Sunstroke) దూరంగా ఉండాలంటే మట్టికుండలోని నీటిని తాగడం మంచిది.
ఈ నీటిలో ఉండే మినరల్స్ (Minerals), ప్రోటీన్స్ (Proteins) శరీరానికి శక్తిని అందించి రోజంతా చురుగ్గా ఉండేందుకు సహాయపడుతాయి. అదే ఫ్రిజ్ నీటిని తాగితే శరీరానికి ఎటువంటి మినరల్స్, ప్రోటీన్స్ లభించవు. కనుక ఫ్రిజ్ నీటిని తాగితే శరీరం అనేక అనారోగ్య సమస్యలకు గురవుతుంది. కాబట్టి మట్టి కుండలోని నీటిని తాగండి.. ఆరోగ్యంగా ఉండండి..