ఆరోగ్యానికి వెల్లుల్లి టీ.. ఇది ఎన్ని సమస్యలను తగ్గిస్తుందో..!
వెల్లుల్లిలో ఎన్నో ఔషద గుణాలుంటాయి. ఇది చెడు కొలెస్ట్రాల్ ను కరిగించడం నుంచి వెయిట్ లాస్ వరకు వరకు ఎన్నో సమస్యలను తగ్గిస్తుంది. అయితే ప్రతిరోజూ వెల్లుల్లి టీని తాగడం అలవాటు చేసుకుంటే

వెల్లుల్లి ప్రతి వంటగదిలో ఉంటుంది. వెల్లుల్లిని దాదాపుగా అన్ని కూరల్లో వేస్తారు. నిజానికి వెల్లుల్లిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. ఇది మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బెల్లీ ఫ్యాట్ ను కరిగిస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచడంతో పాటుగా ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. వెల్లుల్లిలో విటమిన్ సి, విటమిన్ కె, ఫోలేట్, మాంగనీస్, సెలీనియం, ఫైబర్స్, ఐరన్, కాల్షియం, భాస్వరం, రాగి, పొటాషియంతో పాటుగా ఎన్నో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.
వెల్లుల్లిలోని అన్ని రకాల ప్రయోజనాలను పొందడానికి మీరు వెల్లుల్లి టీని తయారుచేసుకుని తాగొచ్చు. ఇందుకోసం మూడు లేదా నాలుగు వెల్లుల్లి రెబ్బలను కోసి మూడు కప్పుల నీటిలో కలపండి. వీటిని కొద్ది సేపు మరగబెట్టండి. దీనిలో పంచదార కలపడానికి బదులు తేనె కలుపుకుని తాగితే మంచిది. అవసరమైతే కొద్దిగా నిమ్మరసం లేదా అల్లం కలిపి తాగితే రుచి బాగుంటుంది. వెల్లుల్లి టీని తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటంటే..
<p>garlic tea</p>
బ్లడ్ షుగర్ లెవెల్స్
వెల్లుల్లి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. అందుకే మధుమేహులు ఈ వెల్లుల్లి టీని ఎలాంటి భయం లేకుండా రోజూ తాగొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
రోగనిరోధక శక్తి
వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు ఉంటాయి. అందుకే వెల్లుల్లి బ్యాక్టీరియా, వైరస్ లు, ఇతర వ్యాధికారక క్రిములతో పోరాడటానికి రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. అంతేకాదు విటమిన్ సి పుష్కంగా ఉండే వెల్లుల్లి మీ ఇమ్యూనిటీ పవర్ ను బలపరుస్తుంది.
అధిక రక్తపోటు
వెల్లుల్లి అధిక రక్తపోటును నియంత్రించడానికి కూడా సహాయపడుతుంది. అంతేకాదు ఇది మీ శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎంతో సహాయపడతాయి.
<p>garlic tea</p>
ఊపిరితిత్తుల ఆరోగ్యం
ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడటానికి కూడా వెల్లుల్లి టీ ప్రయోజనకరంగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే వెల్లుల్లి టీని ప్రతిరోజూ తాగడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది.