Health Tips: బ్లూటీ చేసే అద్భుతాలు.. లాభాలు తెలిస్తే తాగకుండా వదిలిపెట్టరు!
Health Tips: ఒత్తిడి ఆందోళనలతో బాధపడే వారికి బ్లూ టీ అద్భుతమైన మెడిసిన్ లాగా పనిచేస్తుంది. ఇంతకీ బ్లూ టీ అంటే ఏమనుకుంటున్నారా.. శంఖంపూలతో చేసే హెర్బల్ టీ. ఇది చేకూర్చే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుంటే అస్సలు వదిలిపెట్టరు అవేంటో చూద్దాం.

కోన్ ఫ్లవర్ లేదా శంఖం పూలు అనబడే పూల నుంచి బ్లూ టీ తయారు చేస్తారు. ఆగ్నేయ ఆసియా దేశాల్లో ఈ టీ బాగా ప్రాచుర్యం పొందింది. అక్కడ దీనిని భోజనం చేసిన తర్వాత తాగుతారు. ఇందులో కెఫీన్ ఉండదు. వీటి యొక్క అందమైన నీలం రంగు ఆకర్షించడమే కాకుండా యాంటీ ఆక్సిడెంట్ - రిచ్ టీ.
ఆయుర్వేద వైద్యంలో కూడా బాగా ప్రాచుర్యం పొందింది. అనేక వ్యాధుల చికిత్సకు దీనిని ఔషధంగా ఉపయోగిస్తారు. బ్లూ టీ ఆంటీ పైరేటిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. నొప్పి నివారణి మాత్రల వలే పని చేస్తుంది. బ్లూ టీ లోని ఆంథో సైనిన్లు రక్తంలో చక్కెర స్థాయిలని నియంత్రించడంలో సహాయపడతాయి.
ముదురు నీలం రంగు ఎక్కువగా డెల్ఫినిడిన్ కారణంగా ఉంటుంది. ఇది టీ లో కనిపించే వివిధ ఆంథో సైనిన్ల వల్ల వస్తుంది. దీనివలన గుండె సమస్యలు, మధుమేహం కొన్ని రకాల క్యాన్సర్ వ్యాధులకు చెక్ పెట్టడంలో అద్భుతంగా పనిచేస్తుంది.
ఈ టీ తాగడం వలన వాంతులు, వికారం నుంచి ఉపశమనం పొందవచ్చును. అలాగే ఈ టీ లో ఉండే యాంటీ గ్లైసటీన్ ప్రాపర్టీస్ వలన చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ముడతలు రాకుండా యవ్వనంగా ఉంటుంది. ఈ టీ లో ఉండే యాంథో సైనిన్ కారణంగా జుట్టు రాలడం సమస్య తగ్గుతుంది.
అలాగే షుగర్ పేషెంట్లకి రెగ్యులర్ టీ కాకుండా బ్లూ టీ తాగితే మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు. ఇందులో కెఫెన్ ఉండదు కాబట్టి రోజుకి రెండుసార్లు అయినా కూడా హ్యాపీగా ఈ టీ ని తాగవచ్చు. ఈ టీ తాగితే బరువు తగ్గుతారని అధ్యయనాల్లో తేలింది. డిప్రెషన్, యాంగ్సిటీగా అనిపించినప్పుడు బ్లూ టీ తాగితే వెంటనే మూడ్ చేంజ్ అయి యాక్టివ్ గా అవుతారట.
యాంటీ యాక్సిడెంట్లు బ్లూ టీ లో ఎక్కువగా ఉంటాయి. ఇవి మనలోని రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. సాధారణంగా నీలం రంగులో ఉండే బ్లూ టీ కి నిమ్మరసం కలపగానే గులాబీ రంగులోకి మారుతుంది. వేడిగా గాని చల్లగా గాని ఈ టీ ని తీసుకోవచ్చు. ఈ టీ ని తేనెతో కలిపి తీసుకోవడం వలన మరిన్ని ప్రయోజనాలు ఉంటాయి.