MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • బాదం పాలతో బోలెడు లాభాలు.. తాగకపోతే ఈ లాభాలను మిస్సైపోతారు మరి..!

బాదం పాలతో బోలెడు లాభాలు.. తాగకపోతే ఈ లాభాలను మిస్సైపోతారు మరి..!

 బాదం పాలలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ఇవి మన శరీరంలో పోషకాల లోపాలను పోగొడుతాయి. అలాగే ఎన్నో అనారోగ్య సమస్యల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. ఈ బాదం పాలను రెగ్యులర్ గా తాగడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసా? 

Shivaleela Rajamoni | Updated : Nov 04 2023, 07:15 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
19
Asianet Image

బాదం పప్పులు పోషకాలకు మంచి వనరు. ఈ పప్పుల్లో ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. బాదంలో విటమిన్ ఇ,  విటమిన్ బి, మెగ్నీషియం,  డైటరీ ఫైబర్, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. బాదం పప్పులను అలాగే తినే బదులుగా బాదం పాలను తయారుచేసుకుని తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి తెలుసా? 
 

29
Asianet Image

బాదం పాలను చాలా సులువుగా తయారుచేసుకోవచ్చు. ఇందుకోసం రాత్రంతా బాదం పప్పులను నానబెట్టాలి. ఉదయం వీటి తొక్క తీసేసి నీళ్లు పోసి బ్లెండర్ లో వేసి బాగా బీట్ చేయాలి. బాదం పాలు కొంచెం తీయగా కావడటానికి దీనిలో రెండు ఖర్జూరాలను వేయొచ్చు. మరి బాదం పాలను తాగడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
 

39
almond milk benefits

almond milk benefits

మలబద్దకం నుంచి ఉపశమనం

బాదం పాలలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా పుష్కలంగా ఉంటుంది.  ఇలాంటి పాలను రెగ్యులర్ గా తాగడం వల్ల మీ జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్దకం తగ్గుతుంది. అలాగే ఎన్నో జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. 

49
almond milk

almond milk

ఎముకల ఆరోగ్యం

బాదం పాలు మన ఎముకల ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ పాలలో ఎముకలు బలంగా, ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన కాల్షియం పుష్కలంగా ఉంటుంది. విటమిన్ డి పుష్కలంగా ఉండే బాదం పాలను తాగితే ఎముకల సమస్యలొచ్చే అవకాశం ఉండదు. 

59
Asianet Image

కొలెస్ట్రాల్ నియంత్రణ

ఆరోగ్యకరమైన కొవ్వు మెండుగా ఉండే బాదం పాలను రెగ్యులర్ గా తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీంతో మీకు గుండె జబ్బులొచ్చే ప్రమాదం తగ్గుతుంది. 
 

69
Asianet Image

డయాబెటీస్

బాదం పాలలో కార్బోహైడ్రేట్లు ఉండవు. అందేకాదు వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంంది. అందుకే మధుమేహులు ఎలాంటి భయం లేకుండా ఈ పాలను తాగొచ్చు. ఈ పాలు రక్తలో చక్కెర స్థాయిలను ఎంతమాత్రం పెంచవు. 

79
Asianet Image

ఇమ్యూనిటీ పవర్

బాదం పాలలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. వీటిని మీ రోజువారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల మీ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. దీంతో మీరు ఎన్నో అంటువ్యాదులు, ఇతర రోగాలకు దూరంగా ఉంటారు.

మెదడు ఆరోగ్యం

బాదం పాలు ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలకు అద్బుతమైన వనరు. ఈ పాలను మీ రోజువారి ఆహారంలో చేర్చడం వల్ల మీ మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. 
 

89
Asianet Image

బరువు తగ్గడానికి

బాదం పాలను తాగుతూ కూడా బరువు తగ్గొచ్చు. అవును ఒక కప్పు బాదం పాలలో 39 కేలరీలు మాత్రమే ఉంటాయి. ఈ పాలను తాగితే ఆకలి తగ్గుతుంది. అలాగే మీ కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. ఇది మీరు ఆరోగ్యంగా బరువు తగ్గడానికి బాగా సహాయపడుతుంది. 

99
Asianet Image

జుట్టు, చర్మ ఆరోగ్యం

రోజూ బాదం పాలను తాగడం వల్ల శరీరంలో విటమిన్ ఇ లెవెల్స్ పెరుగుతాయి. ఇది మీ చర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా సహాయపడతాయి.

Shivaleela Rajamoni
About the Author
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు. Read More...
ఆరోగ్యం
 
Recommended Stories
Top Stories