MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • అన్నం తిన్న తర్వాత లవంగాలను తింటే ఎంత మంచిదో తెలుసా?

అన్నం తిన్న తర్వాత లవంగాలను తింటే ఎంత మంచిదో తెలుసా?

లవంగాలను మరిగించిన నీటిని తాగడం వల్ల గ్యాస్ ట్రబుల్ సమస్య తొందరగా తగ్గిపోతుంది. ముఖ్యంగా అన్నం తిన్నతర్వాత లవంగా నమలడం వల్ల ఎసిడిటీ తగ్గుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. 

1 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 07 2023, 12:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

లవంగాలు ప్రతి వంటింట్లో ఉపయోగించే సాధారణ మసాలా దినుసు. లవంగాల్లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి దగ్గు, జ్వరం, కఫాన్ని తగ్గిస్తాయి. లవంగాలు వైరస్ లు, బ్యాక్టీరియా, వివిధ రకాల శిలీంధ్రాలు మొదలైన వాటికి వ్యతిరేకంగా పనిచేస్తాయి. లవంగాలను మరిగించిన నీటిని తాగితే గ్యాస్ ట్రబుల్ తొందరగా తగ్గుతుంది. భోజనం తర్వాత మీ నోట్లో లవంగాలను వేసుకుని నమలడం వల్ల ఎసిడిటీని తగ్గిపోతుందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

లవంగాలు బీటా కెరోటిన్ కు అద్భుతమైన మూలం. కెరోటిన్ వర్ణద్రవ్యాలు విటమిన్ ఎగా మారొచ్చు. ఇది కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ముఖ్యమైన పోషకం. లవంగాలలో బహుళ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి సయాటికా వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. ఈ సమ్మేళనాలలో యూజెనాల్ చాలా ముఖ్యమైనదని నిపుణులు చెబుతున్నారు.

35

యూజెనాల్ శరీరంలో తాపజనక ప్రతిస్పందనను తగ్గిస్తుంది. అలాగే సయాటికా వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని, వాటి లక్షణాలను నిర్వహించడానికి సహాయపడుతుందని తేలింది. చర్మ ఇన్ఫెక్షన్లు, అలెర్జీలను తగ్గించడమే కాకుండా లవంగాలు శరీరంలోని విషాన్ని కూడా బయటకు పంపుతాయి. 
 

45

లవంగాలు కూడా బరువు తగ్గడానికి సహాయపడతాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. లవంగాలు మన జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అలాగే  ఆరోగ్యంగా బరువు తగ్గడానికి సహాయపడతాయి. లవంగాలు కాలెయ పనితీరును మెరుగుపర్చడానికి కూడా సహాయపడతాయి. లవంగాలలో ఉండే యూజెనాల్ కాలేయ సిరోసిస్, కొవ్వు కాలేయ వ్యాధి లక్షణాలను తగ్గించడానికి సహాయపడుతుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. లవంగాలు కాలేయం పనితీరును కూడా మెరుగుపరుస్తుంది.

55

ప్రతిరోజూ ఖాళీ కడుపుతో లవంగాలు తినడం వల్ల ఎన్నో వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. అలాగే దంత ఆరోగ్యం కూడా బాగుంటుంది. లవంగాలు జీర్ణక్రియను కూడా బలంగా ఉంచుతాయి. ప్రతిరోజూ లవంగాలతో మరిగించిన నీటిని తాగడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Chicken Biryani: 30 నిమిషాల్లో ఘుమఘుమలాడే పొట్లం బిర్యానీ.. ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..
Recommended image2
Jaggery: బెల్లం ఎలా తింటున్నారు..? ఇలా తింటేనే ప్రయోజనం ఉంటుంది
Recommended image3
Barley Water: ఉదయాన్నే బార్లీ తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved