నల్ల ఉప్పును తీసుకుంటే అలాంటి సమస్యలన్నీ మాయం.. అవి ఏంటంటే?
హిమాలయాల్లోని ఉప్పు గనుల నుంచి తవ్వితీసిన నల్ల ఉప్పులో (Black salt) అనేక ఔషధ గుణాలు ఉన్నాయి.అందుకే ఈ ఉప్పును పూర్వం నుంచి ఆయుర్వేద వైద్యంలో ఔషధంగా ఉపయోగిస్తున్నారు. సాధారణ ఉప్పు కంటే ఈ ఉప్పును తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు (Health benefits) కలుగుతాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Black salt
నల్ల ఉప్పును హిమాలయన్ బ్లాక్ సాల్ట్ (Himalayan Black Salt), సులేమాణి నమక్, కాలా నమక్ ఇలా వివిధ రకాలుగా పిలుస్తారు. ఈ నల్ల ఉప్పు ప్రత్యేకమైన రుచి, వాసన కలిగి ఉండి ఆహారపదార్థాలకు మంచి రుచి, వాసనను అందిస్తుంది. సాధారణ ఉప్పుతో పోలిస్తే ఈ ఉప్పులో సోడియం శాతం (Percentage of sodium) తక్కువగా ఉంటుంది.
Black salt
నల్ల ఉప్పులో క్యాల్షియం (Calcium), మెగ్నీషియం (Magnesium), పొటాషియం వంటి ఇతర మూలకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. అందుకే ఈ ఉప్పును తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆయుర్వేద వైద్యులు అంటున్నారు. ఈ ఉప్పును నిత్యం వాడితే ఆరోగ్యానికే కాదు చర్మానికి, జుట్టుకు కూడా అనేక ప్రయోజనాలు కలుగుతాయి.
Black salt
అజీర్తి సమస్యలు తగ్గుతాయి: నల్ల ఉప్పులో ఉండే పోషకాలు పొట్టలో విటమిన్ల శోషణను పెంచడంతోపాటు జీర్ణక్రియను (Digestion) కూడా మెరుగుపరుస్తాయి. అలాగే అజీర్తి సమస్యలు (Indigestion problems) కూడా తగ్గుతాయి. కనుక నల్ల ఉప్పును తగిన మోతాదులో ఉపయోగించడం ఆరోగ్యానికి మంచిది.
Black salt
చర్మ సమస్యలు తగ్గుతాయి: నల్ల ఉప్పును తీసుకుంటే ఆరోగ్యానికే (Health) కాదు చర్మానికి, జుట్టుకు కూడా మంచి ఫలితం ఉంటుంది. నల్ల ఉప్పు కలిపిన నీళ్లతో స్నానం చేస్తే చర్మ సమస్యలు (Skin problems) తగ్గుతాయి. అందుకే నల్ల ఉప్పును జుట్టుకు, చర్మానికి మంచిదని సబ్బులూ, టూత్ పేస్ట్ ల తయారీలోనూ వాడుతుంటారు.
Black salt
ఉదర సమస్యలు తగ్గుతాయి: కడుపులో గ్యాస్ పెరిగి తేపుల్లాంటివి ఇబ్బంది పెడుతుంటే చిటికెడు నల్ల ఉప్పును నీళ్ళల్లో కలిపి తాగితే మంచి ఫలితం ఉంటుంది. దీంతో ఉదర సంబంధిత సమస్యలు (Abdominal problems) తగ్గుముఖం పడతాయి. అలాగే కాలేయంలో పైత్యరసం ఉత్పత్తిని పెంచి గుండెల్లో మంట (Heartburn), నొప్పి రాకుండా కాపాడుతుంది.
Black salt
బరువు తగ్గుతారు: నల్ల ఉప్పు శరీర బరువును తగ్గించే గుణాన్ని కూడా కలిగి ఉంటుంది. కనుక గోరువెచ్చని నీళ్లలో (Lukewarm water) నిమ్మరసం (Lemon juice), కొద్దిగా నల్ల ఉప్పు (Black salt) వేసి పరగడుపున తాగితే బరువు తగ్గే అవకాశం ఉంటుందని ఆయుర్వేద వైద్యులు అంటున్నారు. కనుక బరువు తగ్గాలనుకునేవారు నల్ల ఉప్పును తీసుకుంటే తగిన ఫలితం ఉంటుంది.
Black salt
అలాగే ఈ ఉప్పును తీసుకుంటే కండరాల సంకోచం (Muscle contraction), నొప్పి, వాపు, మధుమేహ (Diabetes) నివారణకు కూడా ఇది సహాయపడుతుంది. అయితే రోజుకు ఆరు గ్రాములు ఉప్పును కన్నా ఎక్కువ వాడొద్దు. అదే బీపీ ఉన్నవారైతే 3.75 గ్రాములు కన్నా తక్కువే వాడాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మూత్రపిండాల సమస్యలు, బీపీ, గుండె సమస్యలు ఉన్న వారు ఏ రకమైనప్పటికీ ఉప్పు వాడకాన్ని మొత్తంమీద తగ్గించడమే మంచిది.