వేసవికాలంలో కీరదోసకాయ ఆరోగ్యానికి, అందానికి ఓ దివ్య వరం..!
వేసవి కాలంలో అధిక ఎండ తీవ్రత కారణంగా శరీరం మరింత నీరసించిపోతుంది. ఇలా నీరసించిన శరీరానికి కీరదోసకాయ మంచి ఔషధంగా (Good medicine) సహాయపడుతుంది.

కీరదోసకాయను (Cucumber) తీసుకుంటే ఆరోగ్యంతో పాటు చర్మసౌందర్యానికి కూడ కలిగే ప్రయోజనాలు అనేకం. ఇంకెందుకు ఆలస్యం కీరదోసకాయను తీసుకుంటే కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కీరదోసకాయను సలాడ్స్ రూపంలో ఎక్కువగా తీసుకుంటారు. కీరదోసకాయలో నీటి శాతం (Percentage of water) అధికంగా ఉంటుంది. కనుక వేసవి కాలంలో దీన్ని తీసుకుంటే శరీరం డీహైడ్రేషన్ (Dehydration) బారినపడకుండా ఉంటుంది. అలాగే శరీర వేడిని తగ్గించి శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది.
కీరదోసకాయలో విటమిన్ సి, కె లతోపాటు పొటాషియం, మెగ్నీషియం, పీచు పదార్థం అధికంగా ఉంటుంది. ఇవి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి. కీరదోసకాయలో అధిక మొత్తంలో ఉండే పీచు పదార్థం జీర్ణక్రియను (Digestion) మెరుగుపరుస్తుంది. అలాగే వ్యర్థాలను బయటకు పంపి పొట్ట, ప్రేగులను శుభ్రపరుస్తుంది.
ఇక దీంతో మలబద్దకం సమస్యలు కూడా దూరం అవుతాయి. దీంతో ఉదర సంబంధిత సమస్యలు (Abdominal problems) తగ్గి ఉదర ఆరోగ్యం మెరుగుపడుతుంది. కనుక కీర దోసకాయను తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. తరచూ కీరదోసకాయను తీసుకుంటే రక్తపోటు (Blood pressure) సమస్యలు కూడా తగ్గుతాయి. అలాగే గుండె సమస్యలు తగ్గి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ఇది శరీరంలో కొవ్వును కరిగించి బరువు తగ్గించడానికి కూడ సహాయపడుతుంది. కనుక బరువు తగ్గాలనుకునే వారు కీరదోసకాయను డైట్ లో చేర్చుకుంటే మంచి ఫలితం ఉంటుంది. కీరదోసకాయ యాంటీ క్యాన్సర్ (Anti-cancer) లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది శరీరంలోని క్యాన్సర్ కణాల (Cancer cells) వ్యాప్తిని అరికట్టి పలు రకాల క్యాన్సర్లను తగ్గిస్తుంది.
అలాగే ఇందులో ఉండే పోషకాలు శరీరంలో చక్కెర నిల్వలను తగ్గించి షుగర్‌ను అదుపులో ఉంచుతుంది. కనుక డయాబెటిస్ (Diabetes) ఉన్నవారు కీరదోసకాయను తినాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇందులోని ఔషద గుణాలు మానసిక ఒత్తిడిని తగ్గించి మనసును ప్రశాంతంగా ఉంచుతాయి. కళ్ల సమస్యలకు చక్కటి పరిష్కారం కీరదోసకాయ ముక్కలు.
cucumber
కీరదోసకాయ ముక్కలను కళ్లమీద పెట్టుకుంటే కంటికి చలువ కలుగుతుంది. అలాగే కళ్లు ఎర్రబడటం, దురద, మంట వంటి కంటి సమస్యలు (Eye problems) తగ్గుతాయి. కీరదోసకాయను తీసుకుంటే ఆరోగ్యంతో పాటు చర్మ సౌందర్యానికి (Skin beauty) కూడా అనేక ప్రయోజనాలు కలుగుతాయి. కీరదోసకాయను తింటే చర్మం మృదువుగా మారుతుంది.
దోసకాయ గుజ్జును ముఖానికి అప్లై చేసుకుని కొద్ది సమయం తరువాత నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకుంటే చర్మానికి మంచి నిగారింపును అందుతుంది. చర్మకణాలలో పేరుకుపోయిన మురికిని, మృతకణాలను (Dead cells) తొలగించి చర్మకణాలను శుభ్రపరుస్తుంది. అలాగే చర్మానికి కావాల్సిన తేమను అందించి చర్మాన్ని తాజాగా ఉంచుతుంది (Keeps skin fresh). చూసారా ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలందించే కీరదోసకాయను తినండి.. ఆరోగ్యంగా ఉండండి..