Health Tips: నిద్రలేమితో బాధపడుతున్నారా.. అయితే బ్రిటన్ ఫార్ములా పాటించాల్సిందే!
Health Tips: చాలామందికి ఒత్తిడి కారణంగానో, మరే ఇతర కారణాలవల్ల అయినా అర్ధరాత్రిళ్ళు నిద్ర సరిగా పట్టదు. అయితే ఈ బ్రిటన్ ఫార్ములా పాటిస్తే చక్కని నిద్ర మన సొంతమవుతుంది అంటున్నారు నిపుణులు. అది ఎలాగో చూద్దాం.
చాలామంది నిద్రలేమితో బాధపడుతూ ఉంటారు. అందుకు అనారోగ్యం కారణము కావచ్చు, ఒత్తిడి కారణం కావచ్చు లేదంటే సరైన ఆహార విధానం లేకపోవటం కూడా కారణం కావచ్చు. ఏది అయినప్పటికీ నిద్రలేమి అనేది దీర్ఘకాలంలో అనేక వ్యాధులకి దారితీస్తుంది కాబట్టి మంచి నిద్ర కోసం తగినన్ని జాగ్రత్తలు తీసుకోవడం.
మంచి నిద్ర కోసం బ్రిటన్ ఫార్ములా బాగా పనిచేస్తుంది అంటున్నారు నిపుణులు అది ఏంటో చూద్దాం. పడుకోవడానికి పది గంటల ముందే కూల్ డ్రింకులు, కాఫీలు వంటివి మానేయాలి. కుదరకపోతే వీలైనంతవరకు తగ్గించాలి. రాత్రి పది గంటలకి పడుకుంటాం అనుకుంటే..
మధ్యాహ్నం 12 గంటల తర్వాత టీలు కాఫీలు తాగకూడదు. మంచి నిద్రకు సంబంధించిన బ్రిటన్ ఫార్ములా ఇది. అలాగే నిద్రించడానికి ఒక గంట ముందు మీ గాడ్జెట్స్ అన్ని తీసి పక్కన పెట్టేయాలి. అలాగే పడుకోవడానికి రెండు గంటలు ముందే అన్ని పనులు పూర్తి చేసుకోవడం మంచిది.
దీనివల్ల మెదడుకు విశ్రాంతి లభిస్తుంది. ఫలితంగా మస్తిష్కంలో నడిచే వివిధ విషయాలు పక్కకి పోతాయి. ఫలితంగా పడుకునే ముందు ఎలాంటి ఆలోచనలు రావు. దీనివలన టెన్షన్ తగ్గి మంచి నిద్రకు అవకాశం దొరుకుతుంది. అలాగే నిద్రపోయే ముందు పసుపు కలిపిన గోరువెచ్చని పాలు తాగటం వలన మంచి నిద్ర వస్తుంది.
అలాగే మంచి నిద్ర కోసం మీరు రాత్రి భోజనం తర్వాత కనీసం రెండు గంటల తర్వాత పడుకోవాలి. తిన్న వెంటనే పడుకోవడం వల్ల గ్యాస్ సమస్యలు ప్రారంభమవుతాయి తత్ఫలితంగా నిద్రకి భంగం కలుగుతుంది. పడుకునే ముందు పదిసార్లు శ్వాస తీసుకుని వదిలేయండి.
ఇలా కనీసం ఐదు సార్లు చేయండి. మీ దృష్టిని మీ శ్వాసపై కేంద్రీకరించండి. ఈ సమయంలో మీ మనసులో ఎలాంటి ఆలోచనలు రాకుండా కేవలం శ్వాస మీద మాత్రమే దృష్టి పెట్టడం వలన మెదడుకి విశ్రాంతి లభించి మంచి నిద్రకి అవకాశం ఉంటుంది.