మంగు మచ్చలను తగ్గించే అద్భుతమైన ఇంటి చిట్కాలు.. అవేంటంటే?
వాతావరణ కాలుష్యం, ఎండలో ఎక్కువగా పనిచేయడం, శరీరంలో హార్మోన్ ల అసమతుల్యత వంటి కారణాలచేత ముఖంపై మంగు మచ్చలు (Dark spots) ఏర్పడతాయి. అవి తగ్గడానికి కొన్ని చిట్కాలను (Tips) ఇప్పుడు మనం తెలుసుకుందాం..

అలాగే కొన్ని రకాల మెడిసిన్ వాడకం, వంశ పారంపర్యం చేత కూడా ఈ చర్మ సమస్యలు (Skin problems) రావడానికి ముఖ్య కారణం. అయితే మన చర్మంలో మెలనిన్ (Melanin) అనే పదార్థం ఎక్కువగా ఉత్పత్తి కావడంతో చర్మంపై నల్లటి మచ్చలుగా మంగు మచ్చలు ఏర్పడతాయి. వీటి కారణంగా ముఖం అందవిహీనంగా కనిపిస్తుంది.
ఈ మచ్చలను తగ్గించుకోవడానికి బయట మార్కెట్లో అందుబాటులో ఉండే బ్యూటీ ప్రోడక్ట్స్ (Beauty product)s లకు అధిక మొత్తంలో ఖర్చు చేయకుండా ఇంటిలోనే సహజసిద్ధమైన రెమిడీస్ ను ప్రయత్నిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇవి చర్మంపై మంగు మచ్చలను తగ్గించడంతో పాటు అందమైన, కాంతివంతమైన చర్మసౌందర్యాన్ని (Skin beauty) అందిస్తాయి.
బంగాళదుంప, నిమ్మరసం: బంగాళదుంప రసం మంగు మచ్చలను తగ్గించే గుణాలను కలిగి ఉంటుంది. కనుక బంగాళాదుంప రసంలో (Potato juice) కొద్దిగా నిమ్మరసం (Lemon juice) కలిపి మచ్చలపై అప్లై చేసుకొని ఇరవై నిమిషాల తరువాత నీటితో శుభ్రపరచుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే మంగు మచ్చలు తగ్గడంతోపాటు కాంతివంతమైన చర్మ సౌందర్యం మీ సొంతం అవుతుంది.
బొప్పాయి గుజ్జు, నిమ్మరసం: బొప్పాయి గుజ్జులో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి చర్మంపై ఏర్పడిన మచ్చలను తగ్గించడానికి సహాయపడుతుంది. కనుక బొప్పాయి గుజ్జులో (Papaya pulp) కొంచెం నిమ్మరసం (Lemon juice) కలిపి మంగు మచ్చలపై అప్లై చేసుకొని పదిహేను నిమిషాల తరువాత శుభ్రపరుచుకుంటే మంచి ఫలితాన్ని పొందవచ్చు.
అలోవేరా: అలోవెరా చర్మ సౌందర్యాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది శరీరంలో పేరుకుపోయిన మృత కణాలను (Dead cells) తొలగించి కొత్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. కనుక మంగు మచ్చలను తగ్గించుకోవడం కోసం అలోవేరా గుజ్జును (Aloevera pulp) మచ్చలపై అప్లై చేసుకుంటే మంచి ప్రయోజనం కనిపిస్తుంది.
బాదం నూనె: బాదం నూనెలో (Almond oil) విటమిన్ ఎ, బి, ఇ లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి చర్మంపై పేరుకుపోయిన మృత కణాలను తొలగించి చర్మానికి కావలసిన పోషకాలను (Nutrients) అందించడానికి సహాయపడతాయి. రాత్రి పడుకునే ముందు బాదం నూనెను మచ్చలపై అప్లై చేసుకొని ఉదయాన్నే నీటితో శుభ్రం చేసుకుంటే మంగు మచ్చలు తగ్గుతాయి.
అలోవేరా జెల్, విటమిన్ ఇ క్యాప్సిల్: ఒక కప్పులో అలోవెరా జెల్ (Aloevera gel), విటమిన్ ఇ క్యాప్సిల్ (Vitamin E capsule) వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మంగు మచ్చలపై అప్లై చేసుకుని ఇరవై నిమిషాల తరువాత నీటితో శుభ్రపరుచుకుంటే మంగు మచ్చలు తగ్గడంతో పాటు మొటిమలు, నల్లటి వలయాలు వంటి చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి.