Gas Problem: అసలు కడుపులో గ్యాస్ ఎందుకు వస్తుంది.? వెంటనే తగ్గాలంటే ఏం చేయాలి?
మారిన జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పులు, పెరిగిన ఒత్తిడి ఇలా కారణం ఏదైనా ఇటీవల గ్యాస్ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. అయితే ఈ సమస్యకు పరిష్కారమే లేదా అంటే కచ్చితంగా ఉంది.

అసలు గ్యాస్ అంటే ఏంటి.?
గ్యాస్ సమస్యను వైద్య పరిభాషలో యాసిడ్ పెక్టిక్ డిజార్డర్‌గా చెబుతుంటారు. కడుపులో యాసిడ్ పరిణామం పెరగడం వల్ల ఈ సమస్య వస్తుంది. ఈ కారణంగా తీసుకునే ఆహారం సరిగ్గా జీర్ణమవ్వదు. ఎప్పుడైతే ఆహారం సరిగా జీర్ణం కాదో కడుపులో గ్యాస్ తయారవడం ప్రారంభమవుతుంది.
KNOW
కేవలం కడుపులోనే కాదు
ఈ గ్యాస్ ప్రభావం కేవలం కడుపులో ఉంటుందని అంతా అనుకుంటాం. కానీ కాలం గడిసే కొద్దీ పొట్టతో పాటు పేగుల్లో కూడా గ్యాస్ పేరుకుపోతుంది. దీంతో తీవ్రమైన కడుపు నొప్పి వస్తుంది. ఎంజైమ్స్ సరిగ్గా లేకపోయినా గ్యాస్ పెరుగుతుంది.
మానసిక ఒత్తిడి
సాధారణంగా తీసుకునే ఆహారంలో తేడాలు ఉంటే జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయని అంతా అనుకుంటాం. కానీ మానసిక ఆరోగ్యం కూడా జీర్ణాశయంపై పడుతుంది. మానసిక ఒత్తిడితో బాధపడేవారిలో గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే గ్యాస్ సమస్యతో బాధపడేవారు యోగా, మెడిటేషన్ వంటి వాటిని జీవితంలో ఓ భాగం చేసుకోవాలి.
ఎలాంటి ఆహారం తీసుకోవాలి.?
గ్యాస్ సంబంధిత సమస్యలతో బాధపడేవారు తీసుకునే ఆహారం విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు వహించాలి. ముఖ్యంగా పులుపు, కారం, మాసాలలను పూర్తిగా తగ్గించాలి. టీ, కాఫీలతో పాటు మద్యానికి దూరంగా ఉండాలి. స్మోకింగ్ అలవాటు ఉన్న వారు పూర్తిగా మానేయాలి. అదే విధంగా కచ్చితంగా సరిపడ నిద్ర ఉండేలా చూసుకోవాలి. మజ్జిగతో పాటు ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఫుడ్‌ను తీసుకోవాలి.
పూర్తి వీడియో ఇక్కడ చూడండి..
(ఇక్కడ డాక్టర్ గొపరాజు సమరం గారు తెలిపిన వైద్య సమాచారం, అభిప్రాయాలు, ఆయన వైద్య అనుభవం, ప్రజారోగ్య రంగంలో చేసిన సేవల ఆధారంగా అందించాము. దీనిని కేవలం ప్రాథమిక సమాచారంగానే భావించాలి. ఇది వైద్యుల సలహాకు బదులుగా భావించకండి. దయచేసి మీ ఆరోగ్య పరిస్థితులకు సరైన నిర్ధారణ, చికిత్స కోసం అర్హత గల వైద్యులను సంప్రదించండి.)