- Home
- Automobile
- Cars
- MG Comet EV: రూ. 30 వేల జీతమున్న చాలు.. ఈ బుజ్జి ఈవీ కారు సొంతం చేసుకోవచ్చు. EMI ఎంతంటే
MG Comet EV: రూ. 30 వేల జీతమున్న చాలు.. ఈ బుజ్జి ఈవీ కారు సొంతం చేసుకోవచ్చు. EMI ఎంతంటే
ప్రస్తుతం ఈవీ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. అయితే ఈవీ కార్లు అనగానే ఎక్కువ ధరలు అనుకుంటాం. కానీ తక్కువ ధరలో అందుబాటులో ఉన్న ఒక బెస్ట్ కారు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఎంజీ కామెట్ ఈవీ
భారత మార్కెట్‌లో తక్కువ బడ్జెట్‌లో మంచి ఎలక్ట్రిక్ కారును కొనాలనుకునే వారికి MG కామెట్ EV బెస్ట్ ఛాయిస్‌గా చెప్పొచ్చు. ఈ కారులో మరిన్ని భద్రతా ఫీచర్లు, ఆధునిక టెక్నాలజీని అప్డేట్ చేశారు. ఈ కారు బేస్ వేరియంట్ ధర రూ. 7 లక్షల నుంచి ప్రారంభమవుతోంది. ఇంతకీ కారులో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం.
MG కామెట్ EV ధర, ఫైనాన్స్ ప్లాన్ వివరాలు
ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.7.00 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. అయితే ఆన్ రోడ్ ధర రూ. 7.30 లక్షల నుంచి రూ. 8 లక్షల వరకు ఉంది. ఆన్ రోడ్ ప్రైజ్ అనేది నగరానికి నగరానికి మారుతుంది. ఇక ఈ కారును సొంతం చేసుకోవాలంటే రూ. లక్ష డౌన్ పేమెంట్ చెల్లిస్తే సరిపోతుంది. మిగతా రూ. 6.30 లక్షలు లోన్ రూపంలో తీసుకోవచ్చు. ఇందుకు 9.8 శాతం వడ్డీ పడుతుంది. ఒకవేళ మీరు 5 సంవత్సరాల వ్యవధికి లోన్ తీసుకుంటే నెలకు రూ. 13,400 ఈఎమ్ఐ చెల్లిస్తే సరిపోతుంది. ఈ లెక్కల ప్రకారం మీరు మొత్తం 5 సంవత్సరాల్లో చెల్లించాల్సిన మొత్తం సుమారు రూ. 8 లక్షలు అవుతుంది.
ఫీచర్లు ఎలా ఉన్నాయంటే.?
MG కామెట్ EV, ప్రధానంగా నగరాల్లో ట్రాఫిక్ మధ్య డ్రైవింగ్‌కి అనుకూలంగా ఉండేలా రూపొందించారు. దీని కాంపాక్ట్ డిజైన్‌తో పాటు, స్మూత్ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్, తక్కువ మెంటెనెన్స్ ఖర్చులు దీన్ని మరింత ఆకర్షణీయంగా చేస్తాయి.
ముఖ్యమైన ఫీచర్లు
బాటరీ సామర్థ్యం: 17.3 kWh లిథియం అయాన్ బ్యాటరీ
రేంజ్: ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 230 కి.మీ వరకు ప్రయాణం
మోటార్ పవర్: 41.4 PS (30 kW), 110 Nm టార్క్
ఛార్జింగ్ టైం: 0–100% ఛార్జ్ అయ్యేందుకు సుమారు 7 గంటలు (AC నార్మల్ ఛార్జింగ్)
డ్రైవింగ్ మోడ్‌లు: Eco, Normal, Sport మోడ్‌లు అందుబాటులో ఉన్నాయి
భద్రతా ఫీచర్లు
కొత్త MG కామెట్ EVలో భద్రతకు కూడా పెద్ద పీట వేశారు. ముఖ్యంగా ఇందులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, రియర్ పార్కింగ్ కెమెరా & సెన్సార్‌లు, ABS + EBD సిస్టమ్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, రివర్స్ అసిస్టెంట్ సిస్టమ్, పవర్ ఫోల్డింగ్ ORVMs, LED DRLs & LED టెయిల్ ల్యాంప్స్‌తో పాటు డ్యూయల్ 10.25-ఇంచ్ స్క్రీన్‌లు (ఇన్ఫోటైన్‌మెంట్ & డ్రైవర్ డిస్‌ప్లే), వాయిస్ కమాండ్స్ సపోర్ట్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్‌ప్లే, వర్చువల్ అసిస్టెంట్, ఇంటర్నెట్-కనెక్టెడ్ కార్ టెక్నాలజీ (i-Smart), ఐకానిక్ బాక్స్ డిజైన్స్, స్టైలిష్ ఇంటీరియర్స్ వంటి అధునాతన ఫీచర్లను అందించారు.