బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారా? అయితే ఈ పండ్లను మాత్రం అస్సలు తినకండి
బరువు తగ్గడానికి, ఆరోగ్యానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలను ఖచ్చితంగా తీసుకోవాలి. ముఖ్యంగా కొన్ని పండ్లు బరువు తగ్గేందుకు సహాయపడతాయి. కానీ బరువు తగ్గాలంటే కొన్ని పండ్లకు దూరంగా ఉండాలంటున్నారు నిపుణులు.

స్థూలకాయం, అధిక బరువు నేటి తరం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యలు. మారిన జీవనశైలి, వ్యాయామం, సరైన ఆహారం తీసుకోకపోవడే ఇందుకు కారణం. బరువు తగ్గడానికి, ఆరోగ్యానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలను పొందడానికి పండ్లను ఖచ్చితంగా తినాలి. అయితే బరువు తగ్గేందుకు కొన్ని పండ్లు ఎంతో సహాయపడతాయి. కానీ బరువు తగ్గాలనుకునేవారు కొన్ని పండ్లకు దూరంగా ఉండాలి. ఎందుకంటే మరీ తీయగా లేదా కేలరీలు ఎక్కువగా ఉండే పండ్లు బరువును పెంచుతాయి. బరువు తగ్గాలనుకునేవారు ఎలాంటి పండ్లను తినకూడదంటే..?
ద్రాక్షపండ్లు
బరువు తగ్గాలనుకునేవారు తినకూడని పండ్లలో ద్రాక్షపండ్లు ఫస్ట్ ప్లేస్ లో ఉంటాయి. ఎందుకంటే ఈ పండ్లలో 70 శాతం కేలరీలు ఉంటాయి. కేలరీలు ఎక్కువగా ఉన్నందున బరువు తగ్గాలనుకునేవారికి ద్రాక్ష తినడం మంచిది కాదు. ఇవి మీ బరువును మరింత పెంచుతాయి.
మామిడి పండ్లు
బరువు తగ్గాలనుకుంటే మామిడి పండ్లను కూడా అతిగా తినకూడదు. వీటిని అతిగా తింటే మీరు ఇంతకూడా బరువు తగ్గరు. ఎందుకంటే వీటిలో కేలరీలు ఉంటాయి. షుగర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది.
పైనాపిల్
పైనాపిల్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ పైనాపిల్ బరువు తగ్గడానికి సహాయపడే వాటిలో ఒకటి కాదు. ఎందుకంటే ఈ పండ్లలో చక్కెర కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మీ బరువును మరింత పెంచుతుంది.
banana
అరటిపండ్లు
వెయిట్ లాస్ కావాలనుకుంటున్నవారు అరటిపండ్లను కూడా తినకూడదు. ఎందుకంటే అరటిపండ్లలో కేలరీలు, సహజ చక్కెరలు ఎక్కువగా ఉంటాయి. అరటిపండులో సుమారు 150 కేలరీలు ఉంటాయి. అంటే సుమారు 37.5 గ్రాముల కార్బోహైడ్రేట్లు అన్న మాట. కాబట్టి రోజుకు 2-3 అరటిపండ్లు తింటే బరువు పెరిగే అవకాశం ఉంది. వీటిని మితంగా తీసుకోవడం కూడా ఆరోగ్యానికి మంచిది.
Avocado
అవొకాడో
అవొకాడో అధిక కేలరీల పండ్లలో ఒకటి. 100 గ్రాముల అవొకాడోలో 160 కేలరీలు ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు అవోకాడోలను ఎక్కువగా తీసుకోకూడదు. వీటిని అతిగా తింటే బరువు పెరిగే అవకాశముంది.