మెడ భాగం నల్లగా ఉందా.. అయితే మీ కోసమే ఈ అద్భుతమైన చిట్కాలు!
చాలామంది ముఖంపై చూపించే శ్రద్ధ మెడపై చూపించరు. ముఖం అందంగా ఉంటే చాలు అనుకుంటారు. కానీ మెడ నల్లగా, అపరిశుభ్రంగా (Unclean) ఉంటుంది.

ముఖం అందంగా కనిపించడానికి మెడ భాగం అందంగా, శుభ్రంగా ఉండడం కూడా ముఖ్యమే. కనుక నల్లగా మారిన మెడ భాగాన్ని తెల్లగా మార్చే అద్భుతమైన సహజసిద్ధమైన రెమడీస్ (Remedies) ను ఇంటిలోనే ప్రయత్నిస్తే మంచి ఫలితం ఉంటుందని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
మెడ నలుపును తగ్గించడం కోసం బ్యూటీ పార్లర్ ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మెడ సౌందర్యం (Neck beauty) కోసం బ్యూటీ ప్రొడక్ట్స్ (Beauty Products) ల కోసం అధిక మొత్తంలో డబ్బు వృధా చేయవలసిన అవసరం కూడా లేదు. ఇంటిలోనే తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉండే పదార్థాలతో చేసుకునే రెమిడీస్ మంచి ఫలితాలను అందిస్తాయి.
ఆరెంజ్ తొక్క పౌడర్, రోజ్ వాటర్: ఒక కప్పు తీసుకొని అందులో సగం స్పూన్ ఆరెంజ్ తొక్క పౌడర్, ఒక టీ స్పూన్ రోజ్ వాటర్ వేసి బాగా కలుపుకుని ఆ మిశ్రమాన్ని మెడకు అప్లై చేసుకోవాలి. ఇరవై నిమిషాల తరువాత చల్లటి నీటితో మెడ భాగాన్ని శుభ్రపరుచుకోవాలి. ఇలా తరచూ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
బాదం నూనె, గ్రీన్ టీ ప్యాక్: ఒక కప్పు తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ బాదం నూనె (Almond oil), ఒక టీ స్పూన్ గ్రీన్ టీ (Green tea) వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మెడకు అప్లై చేసుకోవాలి. అరగంట తరువాత గోరువెచ్చటి నీటితో మెడ భాగాన్ని శుభ్రపరుచుకోవాలి. ఇలా వారానికి కనీసం రెండు మూడు సార్లు చేస్తే మెడ నలుపు తగ్గుతుంది.
బియ్యపిండి, తేనె: ఒక టీ స్పూన్ బియ్యపిండికి (Rice flour) రెండు టీ స్పూన్ ల తేనె (Honey) కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మెడకు అప్లై చేసుకుని బాగా ఆరనివ్వాలి. ఇరవై నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో మెడను శుభ్రపరుచుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే మెడ భాగంలోని చర్మం శుభ్రపడి తాజాగా ఉంటుంది. దీంతో మెడ నలుపు తగ్గుతుంది.
నిమ్మరసం: నిమ్మరసంలో (Lemon juice) సహజ సిద్ధమైన బ్లీచింగ్ ఏజెంట్ లక్షణాలు (Bleaching agent properties) పుష్కలంగా ఉంటాయి. ఇవి మెడ నలుపును తగ్గించడానికి సహాయపడుతాయి. నిమ్మరసానికి కొద్దిగా నీళ్లను జోడించి మెడకు అప్లై చేసుకోవాలి. ఇరవై నిమిషాల తరువాత నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా తరచూ చేస్తే మెడ తెల్లగా మారుతుంది.
బంగాళదుంప: బంగాళదుంపలో (Potato) చర్మ సౌందర్యాన్ని పెంచే గుణాలు పుష్కలంగా ఉంటాయి. బంగాళదుంపలను కట్ చేసి మెడ నల్లగా ఉన్న ప్రదేశంలో సున్నితంగా మర్దన చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా ప్రతిరోజూ చేస్తే మెడ భాగంలో పేరుకుపోయిన మృత కణాలు (Dead cells) తొలగిపోయి అక్కడి చర్మం శుభ్రపడి తెల్లగా మారుతుంది.