మీ గుండె సేఫ్ గా ఉండాలంటే.. జిమ్ లో ఈ తప్పులు చేయకండి
మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల నేడు ఎంతో మంది లేనిపోని రోగాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా గుండె జబ్బులు. జిమ్ లో కసరత్తులు చేస్తూ ఉన్నపాటుగా కుప్పకూలిన ఘటనలు లేకపోలేదు. అందుకే జిమ్ లో గుండెపోటు రాకూడదంటే కొన్ని జాగ్రత్తలను తీసుకోవాల్సిందే.
heart attack
ప్రస్తుత కాలంలో గుండెజబ్బుల బారిన పడుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. పెద్దలు, మధ్యవయస్కులే కాకుండా యువత, చిన్న పిల్లలు కూడా దీనిబారిన పడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది గుండెపోటుతో చనిపోతున్నారని సర్వేలు వెల్లడిస్తున్నాయి. కొంత కాలంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్ కేసులు బాగా నమోదవుతున్నాయి. ఇలాంటి వీడియోలు తరచూ సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంటాయి. అందులో గుండెపోటుతో చాలా మంది అకస్మాత్తుగా మరణిస్తున్నారు. ముఖ్యంగా వర్కవుట్ల సమయంలో గుండెపోటు కేసులు కొన్నేళ్లుగా వేగంగా పెరుగుతున్నాయి.
Gym
ఇలాంటి పరిస్థితి రావొద్దంటే కొన్ని జాగ్రత్తలను తప్పక తీసుకోవాల్సిందేనంటున్నారు నిపుణులు. ముఖ్యంగా మీరు జిమ్ లవర్ అయితే.. మీ శరీరాన్ని ఫిట్ గా ఉంచడానికి జిమ్ కు వెళుతున్నట్టైతే మీరు కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే మీ గుండె పదిలంగా ఉంటుంది. మరి జిమ్ చేసేటప్పుడు ఎలాంటి విషయాలను గుర్తించుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు
ప్రస్తుత కాలంలో చాలా మంది ఆరోగ్యం పట్ల ఎంతో కేర్ ఫుల్ గా ఉంటున్నారు. ఆరోగ్యంగా ఉండేందుకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొంతమంది శరీరాన్ని నిర్మించుకోవడానికి జిమ్ చేస్తే.. ఇంకొంతమంది ఫిట్ గా ఉండటానికి జిమ్ లో కసరత్తులు చేస్తుంటారు. అయితే మీరు జిమ్ కు వెళ్ళేటప్పుడు రెగ్యులర్ మెడికల్ చెకప్ లు చేయించుకోండి. ఇలా చేయడం వల్ల మీకు ఎలాంటి సమస్య పొంచి ఉన్నా సకాలంలో గుర్తించొచ్చు.
మీ ఆరోగ్య పరిస్థితి
మీరు జిమ్ కు వెళ్లాలనుకుంటే.. మీ ఆరోగ్యం ఎలా ఉందో పూర్తిగా తెలుసుకోండి. మీ ఆరోగ్యం గురించి సరైన సమాచారంతో గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం లేదా రక్తపోటు వంటి సమస్యలను ముందుగానే గుర్తించొచ్చు.
Image: Getty
భారీ వ్యాయామాలు వద్దు
సాధారణంగా చాలా మంది జిమ్ కు వెళ్లిన వెంటనే భారీ, హెవీ వర్కౌట్స్ చేస్తుంటారు. కానీ ఇది అస్సలు మంచి పద్దతి కాదు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల గుండె, మీ రక్తపోటుపై చెడు ప్రభావం పడుతుంది. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే నెమ్మదిగా కదలండి. అలాగే జిమ్ కు వెళ్లిన వెంటనే హెవీ వర్కౌట్స్ ను చేయకండి. మీ అవసరాలకు అనుగుణంగా వ్యాయామాన్ని ఎంచుకోండి.
ఆరోగ్యకరమైన ఆహారం
ఆరోగ్యంగా ఉండటానికి వ్యాయామం మాత్రమే కాదు.. ఆరోగ్యకరమైన ఆహారం కూడా చాలా అవసరం. అందుకే సప్లిమెంట్లకు బదులుగా ప్రోటీన్ సహజ వనరులైన ఆహారాలను తినండి. అలాగే గుండెకు మేలు చేసే ఆహారాలను మీ రోజువారి ఆహారంలో చేర్చండి. వేయించిన, చక్కెర, తయారుగా ఉన్న ఆహారాలను తినడం మానుకోండి.
heart
హైడ్రేటెడ్ గా ఉండండి
మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన శరీరం పూర్తిగా హైడ్రేట్ గా ఉండాలి. మీకు తెలుసా? నిర్జలీకరణం మన గుండెపై ఒత్తిడిని కలిగిస్తుంది. అలాగే ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.