రాత్రి పడుకునే ముందు ఏం చేయాలో తెలుసా?
మనలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండేందుకు ఎన్నో చేస్తుంటారు. అయితే రాత్రి పడుకునే ముందు కొన్ని పనులు చేస్తే మీ ఆరోగ్యానికి ఏ డోకా ఉండదు. వ్యాధులు కూడా రావు.
sleep
బిజీ లైఫ్ స్టైల్ వల్ల చాలా మంది రాత్రిపూట చాలా లేట్ గా తినడం అలవాటు చేసుకున్నారు. మరికొంతమంది అర్ధరాత్రిళ్లు ఆల్కహాల్ తాగుతుంటారు. కొంతమంది అర్థరాత్రి వరకు అస్సలు నిద్రపోరు. ఫోన్లు ల్యాప్ టాప్ లు చూస్తూ టైం పాస్ చేస్తుంటారు. కానీ ఇవన్నీ మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఈ అలవాటు మన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. మీరు ఆరోగ్యంగా ఉండేందుకు రాత్రిపూట ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
డిన్నర్ తర్వాత వాకింగ్
డిన్నర్ తర్వాత వాకింగ్ చేయడం మంచి అలవాటు. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే రాత్రి తిన్న తర్వాత జస్ట్ 15 నిమిషాలు నడవండి. దీనివల్ల మీరు తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. అలాగే మీకు బాగా నిద్రపడుతుంది. మీ రక్తంలో చక్కెర స్థాయిలు కూడా నియంత్రణలో ఉంటాయి. అందుకే ఈ రోజు నుంచి తిన్న తర్వాత నడవడం అలవాటు చేసుకోండి.
మేకప్ రిమూవ్
రోజంతా మేకప్ వేసుకున్నా.. అది రిమూవ్ చేయకుండా పడుకోవడం మంచిది కాదు. ఎందుకంటే మీరు వాడే బ్యూటీ ప్రొడక్ట్స్ లో చాలా వరకు కెమికల్స్ ఉంటాయి. ఇవి చర్మాన్ని దెబ్బతీస్తాయి. వీటివల్ల మొటిమలు, బొబ్బలు అవుతాయి. అందుకే కొంతమంది చిన్న వయసులోనే ముసలి వాళ్లలా కనిపిస్తారు. అందుకే రాత్రిపూట మేకప్ రిమూవ్ చేసిన తర్వాతే పడుకోండి.
పండ్లు తినండి
రాత్రిపూట కొన్ని పండ్లను తనడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. దానిమ్మ, ఆపిల్, అరటిపండ్లను రాత్రి పూట తినొచ్చు. కానీ, చెర్రీలు, నారింజ, పుచ్చకాయలను తినకూడదు. ఎందుకంటే ఈ పండ్లను తింటే గ్యాస్ సమస్యలు వస్తాయి.
వాటర్
మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే నీళ్లను పుష్కలంగా తాగాలి. అందుకే రాత్రిపూట నీళ్లను మెండుగా తాగండి. నీళ్లు మన శరీరాన్ని శుభ్రపరుస్తాయి. అలాగే రాత్రిపూట టీ, కాఫీ, కార్బోనేటేడ్ శీతల పానీయాలను తాగడం మానుకోండి. ఇవి మీ ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి.
మొబైల్, ల్యాప్ టాప్ వాడొద్దు
రాత్రి పడుకునే ముందు టీవీ, మొబైల్, ల్యాప్ టాప్ చూడటం వల్ల కంటి ఆరోగ్యం దెబ్బతింటుంది. అలాగే శరీరం కూడా అనారోగ్యం పాలవుతుంది. ఎందుకంటే వీటి నుంచి వెలువడే కిరణాలు స్లీప్ హార్మోన్ ను సరిగా విడుదల చేయకుండా నిద్రలేమి సమస్యలకు కారణమవుతాయి.
foot massage
పాదాల మసాజ్
మీకు నిద్రలేమి సమస్య ఉన్నట్టైతే రాత్రి పడుకునే ముందు మీ పాదాలను సున్నితంగా మసాజ్ చేయండి. దీనివల్ల మీ శరీరంలో రక్త ప్రసరణ పెరుగుతుంది. అలాగే ఒత్తిడి తగ్గుతుంది. ముఖ్యంగా ఇది మడమలు పగలకుండా కాపాడుతుంది.
పళ్లు తోముకోవడం మర్చిపోకండి
ఉదయాన్నే పళ్లు తోముకోవడంతో పాటుగా రాత్రిపూట తిన్న తర్వాత కూడా మీరు పళ్లను ఖచ్చితంగా తోముకోవాలి. ఎందుకంటే ఇది మీ నోటిని శుభ్రపరుస్తుంది. మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.