కాబోయే వధువుకు చర్మ సౌందర్యాన్ని పెంచే ఫేస్ ప్యాక్.. ఎలా వెయ్యాలంటే?
కాబోయే వధువు పెళ్లిలో అందరికంటే అందంగా ఉండాలని అందరి చూపు ఆమె మీదే ఉండాలని భావిస్తుంది. ఆమె చర్మసౌందర్యం (Skin beauty) మిలమిల మెరిసిపోతూ కాంతివంతంగా ఉండాలని అనుకుంటుంది. దానికోసం అనేక బ్యూటీ ప్రొడక్ట్స్ ను వాడుతుంటారు. కానీ ఇవి తాత్కాలిక మెరుపును అందించడంతోపాటు చర్మ సౌందర్యాన్ని దెబ్బతీస్తాయి. కనుక ఇంటిలోనే తయారు చేసుకునే సహజసిద్దమైన ఫేస్ ప్యాక్ (Face pack) లను ట్రై చేయడం మంచిదని సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఇప్పుడు ఈ ఆర్టికల్ ద్వారా కాబోయే వధువు చర్మ సౌందర్యాన్ని పెంచే ఫేస్ ప్యాక్ ల గురించి తెలుసుకుందాం..

మిల్క్ పౌడర్ అబ్టాన్: పొడి చర్మ సమస్యలు ఉన్నవారు ఈ ఫేస్ ప్యాక్ ను ట్రై చేయండి. ఇందుకోసం ఒక కప్పులో మిల్క్ పౌడర్ (Milk powder), శనగ పిండి (Besan), బాదం పొడిని (Almond powder) ఒక్కొక్కటీ రెండు టేబుల్ స్పూన్ లు తీసుకోవాలి. ఇందులోనే చిటికెడు పసుపు (Turmeric), ఒక టేబుల్ స్పూన్ పాల మీగడ (Milk cream), కొద్దిగా నిమ్మరసం (Lemon juice), కొన్ని చుక్కలు రోజ్ వాటర్ (Rose water), కొన్ని ఆలివ్ ఆయిల్ (Alive oil) డ్రాప్స్ ను వేసి బాగా కలపాలి.
ఇలా తయారుచేసుకున్న ఫేస్ ప్యాక్ మిశ్రమాన్ని చేతి వేళ్లతో ముఖానికి రాస్తూ సున్నితంగా మసాజ్ (Massage) చేసుకోవాలి. అరగంట తరువాత గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ ను వారానికి కనీసం రెండు సార్లు అప్లై చేసుకుంటే అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం అవుతుంది. ఇది పొడిబారిన చర్మానికి (Dry skin) తగినంత తేమను అందించి చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది.
గంధంతో బ్యూటీ ప్యాక్: వేసవికాలంలో సూర్యరశ్మి కారణంగా దెబ్బతిన్న చర్మసౌందర్యాన్ని తిరిగి ప్రకాశవంతంగా మార్చడానికి ఈ ఫేస్ ప్యాక్ సహాయపడుతుంది. ఇందుకోసం ఒక కప్పులో గంధం పొడి (Sandalwood powder), శనగపిండి (Besan), చిటికెడు పసుపు (Turmeric), రోజ్ వాటర్ (Rose water), పచ్చి పాలను (Milk) వేసి మెత్తని పేస్ట్ లా తయారు చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని ముఖానికి (Face), శరీరానికి (Body) అప్లై చేసుకోవాలి. అర గంట తర్వాత నీటితో శుభ్రపరుచుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ ఎండ కారణంగా దెబ్బతిన్న చర్మ సౌందర్యాన్ని పెంచడానికి సహాయపడుతుంది. చర్మాన్ని ఆరోగ్యంగా కాంతివంతంగా ఉంచుతుంది.
శనగపిండి, గోధుమ పొట్టు బ్యూటీ ప్యాక్: ఒక కప్పులో శనగ పిండి (Besan), గోధుమ పొట్టు (Brown husk), పెరుగు (Curd), చిటికెడు పసుపు (Turmeric) వేసి మెత్తని పేస్ట్ లా తయారు చేసుకుని పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మొదట శరీరానికి నువ్వుల నూనెతో (Sesame oil) మర్దన చేసుకోవాలి.
తరువాత ముందుగా కలిపి పెట్టుకున్న పేస్ట్ ను అప్లై చేసుకోవాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో (Water) శరీరాన్ని శుభ్రపరుచుకోవాలి. ఈ విధంగా ఫేస్ ప్యాక్ ను కనీసం వారానికి రెండు సార్లు అయినా అప్లై చేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ కాంతివంతమైన చర్మ సౌందర్యాన్ని మనకు అందిస్తుంది. అన్ని చర్మ సమస్యలను (Skin problems) తగ్గించి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.