మీకు కాలిన గాయాలు, బొబ్బల మచ్చలు ఉన్నాయా అయితే ఇలా చేయండి..!
వంటింట్లో మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఆయిల్ చిట్లడం, కుక్కర్ ఆవిరి తగలడం, వేడి కడాయి తగలడం ఇలా అనేక కారణాలతో చర్మంపై కాలిన గాయాలు ఏర్పడుతాయి. ఇలా కాలిన గాయాలు బొబ్బలుగా ఏర్పడి మరింత ఇబ్బంది కలిగిస్తాయి. కాలిన గాయాలు నయం అయినా తరువాత కూడా వాటి తాలూకు మచ్చలు అలాగే ఉండి చర్మం అందవిహీనంగా కనిపిస్తుంది.

ఈ కాలిన గాయాలను, బొబ్బలను తగ్గించడానికి ఇంటి చిట్కాలను ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇవి కాలిన గాయాలను, బొబ్బలను నయం చేసి చర్మంపై వాటి తాలూకు మచ్చలను తగ్గించడానికి ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. అయితే కాలిన గాయాలు (Burns) చాలా తీవ్రంగా ఉంటే డాక్టర్ ను సంప్రదించడం అవసరం. అయితే ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ ద్వారా కాలిన గాయాలను, బొబ్బలను ఏవిధంగా ఇంటి చిట్కాలను (Home tips) ఉపయోగించి నయం చేసుకోవచ్చో తెలుసుకుందాం..
టూత్ పేస్ట్: కాలిన గాయాలను తొందరగా తగ్గించడానికి టూత్ పేస్ట్ చక్కగా సహాయపడుతుంది. అయితే కాలిన వెంటనే గాయం మీద టూత్ పేస్ట్ (Toothpaste) ను అప్లై చేసుకోరాదు. ముందుగా కాలిన గాయాలని నీటితో శుభ్రపరిచి తరువాత మెత్తని పొడి బట్టతో గాయాన్ని తుడవాలి. ఇలా డ్రై గా మారిన తరువాత కాలిన గాయం మీద టూత్ పేస్ట్ ను అప్లై చేయాలి. ఇలా చేస్తే కాలిన గాయాలు తొందరగా నయమవుతాయి. అయితే పుదీనా ఫ్లేవర్ కలిగిన వైట్ కలర్ టూత్ పేస్ట్ (Mint Flavor White Color Toothpaste) ను గాయాలకు వాడడం మంచిది.
తేనె: కాలిన గాయాలను వాటి తాలూకు మచ్చలను తగ్గించడానికి తేనేలోని (Honey) యాంటీ సెప్టిక్ గుణాలు (Antiseptic properties) చక్కగా సహాయపడతాయి. ఇవి కాలిన గాయాల కారణంగా ఏర్పడే మంటలను తగ్గించే గుణాలు కలిగి ఉంటాయి. తేనే గాయాలను తగ్గించే సహజసిద్ధమైన రెమిడీ.
ఐస్ ప్యాక్: కాలిన గాయాలకు ఎఫెక్టివ్ హోం రెడీగా ఐస్ ప్యాక్ (Ice pack) సహాయపడుతుంది. అయితే ఐస్ ను నేరుగా గాయాలమీద మర్దన చేయరాదు. ఇందుకోసం ఐస్ ప్యాక్ ను ఉపయోగించడం మంచిది. ఐస్ ప్యాక్ రక్తప్రసరణను (Blood circulation) మెరుగుపరిచి గాయాన్ని తొందరగా నయం చేస్తుంది. ఒకవేళ ఐస్ ప్యాక్ అందుబాటులో లేకుంటే ఐస్ ను నేరుగా గాయానికి అప్లై చేయకుండా గాయం చుట్టూ అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
కలబంద: కలబందలో (Aloe vera) ఉండే పోషకాలు చర్మ మంటను నయం చేయగల శక్తిని కలిగి ఉంటాయి. ఇవి స్కిన్ బర్న్ (Skin burn) నుంచి చాలా తొందరగా ఉపశమనాన్ని కలిగిస్తాయి. కాలిన గాయాలమీద అలోవెరా జెల్ ను అప్లై చేస్తే చర్మం మంటను తగ్గించి చర్మానికి చల్లదనాన్ని అందిస్తుంది. గాయాలను తొందరగా నయం చేయడానికి వాటి తాలూకు మచ్చలను తగ్గించడానికి మంచి ఎఫెక్ట్ రెడీగా కలబంద సహాయపడుతుంది.
పసుపు: అందరికి వంటింటిలో అందుబాటులో ఉండే పసుపు (Turmeric) యాంటీ ఆక్సిడెంట్స్ (Antioxidants) లను పుష్కలంగా కలిగి ఉంటుంది. ఇవి కాలిన గాయాల నుంచి విముక్తి కలగడానికి చక్కగా సాయపడతాయి. కాలిన వెంటనే పసుపును అప్లై చేయరాదు. మొదట గాయాన్ని నీటితో శుభ్రపరిచి తరువాత మెత్తని పొడి బట్టతో గాయాన్ని తుడవాలి. ఇలా డ్రై గా మారిన తరువాత పసుపును అప్లై చేయాలి. ఇలా చేస్తే కాలిన గాయాలు, బొబ్బల నుంచి విముక్తి కలుగుతుంది.