MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • 40 ఏండ్ల తర్వాత ఈ కంటి సమస్యలొస్తయ్ జాగ్రత్త..

40 ఏండ్ల తర్వాత ఈ కంటి సమస్యలొస్తయ్ జాగ్రత్త..

40 ఏండ్ల వయస్సు తర్వాత మీ కంటి చూపు తగ్గొచ్చు. అలాగే మీకు కంటి సమస్యలు కూడా ఎక్కువవుతుంటాయి.  ఈ వయసు వచ్చిన తర్వాత ఎలాంటి కంటి సమస్యలు వస్తాయో తెలుసా?   

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 19 2023, 10:38 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

వయసు పెరుగుతున్న కొద్దీ.. హార్మోన్ల నుంచి మీ అవయవాల వరకు ప్రతిదీ మారుతుంది. ఈ వయసులో మీ కళ్లను చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రిస్బియోపియా, కంటిశుక్లం,  వయస్సు-సంబంధిత మాక్యులర్ క్షీణత వంటి కొన్ని కంటి సమస్యల ప్రమాదం ఒక నిర్దిష్ట వయస్సు తర్వాత పెరుగుతుంది. అంతేకాకుండా ల్యాప్ టాప్ ల ముందు ఎక్కువ సేపు ఉండటం, ఇతర జీవనశైలి కారకాలు కంటి వ్యాధులను కలిగిస్తాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
eyes health

eyes health

40 ఏండ్లు వచ్చిన తర్వాత మీ కళ్లకు ఏమవుతుంది?

వయసు పెరుగుతున్న కొద్దీ ఎక్కడ లేని సమస్యలు వస్తాయి. ఈ వయసులో  మీ కంటి చూపు మునపటిలా ఉండకపోవచ్చు. 40 ఏండ్లు దాటిన తర్వాత కంటిచూపు తగ్గుతుంది. అలాగే ఎన్నో దృష్టి సంబంధిత సమస్యలను ఎదుర్కోవచ్చు. కాబట్టి 40 సంవత్సరాల తర్వాత కంటి ఆరోగ్యం గురించి? మీరు బాధపడే సాధారణ సమస్యల గురించి తెలుసుకోవడం చాలా మంచిది. అసలు  40 దాటిన తర్వాత ఎలాంటి కంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..

36

ప్రెస్బియోపియా

40 సంవత్సరాల వయస్సు తర్వాత వచ్చే అత్యంత సాధారణ సమస్యల్లో ప్రిస్బియోపియా ఒకటి. 40 సంవత్సరాల తర్వాత మన సమీప దృష్టి స్థానం తగ్గుతుంది. అలాగే సమీప వస్తువులను చూసే మన కంటి సామర్థ్యం కూడా నెమ్మదిగా బలహీనపడుతుంది. ఈ సమస్య సాధారణంగా మీ కళ్లలో ఉన్న లెన్స్ వృద్ధాప్యం వల్ల వస్తుంది. దీనివల్ల ఫోకస్ పాయింట్ మరింత దూరమవుతుంది. ఇది క్రమంగా మరింత అధ్వాన్నంగా మారుతుంది. అలాగే చివరికి పుస్తకాలు చదవడం, ల్యాప్ టాప్ లో పనిచేయడం, ఫోన్లను ఉపయోగించడం వంటి సమీప వస్తువులను ఉపయోగించడానికి మీకు అద్దాలు అవసరమవుతాయి. ఇది కేవలం వృద్ధాప్యానికి సంకేతం మాత్రమే. కళ్ల ఒత్తిడి, తలనొప్పి వంటి సమస్యలు పెరగకుండా ఉండేందుకు కళ్లజోడును ఉపయోగించాలని నిపుణులు చెబుతున్నారు. 
 

46
red eyes

red eyes

పొడి కళ్లు

పొడి కళ్ల వల్ల మీ కళ్లు ఎప్పుడూ తడిలేకుండా ఉంటాయి. దీనివల్ల చిరాకు కలుగుతుంది. ఈ సమస్య వల్ల మీ కళ్లు ఎర్రగా ఉంటాయి. దురద లేదా మండుతున్న అనుభూతి కలుగుతుంది. దీనివల్ల మీ దృష్టి తాత్కాలికంగా అస్పష్టంగా మారొచ్చు. అలాగే ఎక్కువ వెళుతురును చూడలేకపోతారు. ఈ సమస్య వల్ల కొంతమందికి కంటి అలసట, కాంటాక్ట్ లెన్సులు ధరించినప్పుడు అసౌకర్యం కలుగుతుంది. కాలుష్యం, స్క్రీన్ టైమ్ కారణంగా ఈ సమస్య రోజు రోజుకు పెరుగుతుంది. 
 

56
eyes

eyes

క్రమబద్ధమైన ఆరోగ్య సమస్యలు

దైహిక అనేది కేవలం ఒక అవయవానికి వ్యతిరేకంగా మొత్తం శరీరాన్ని ప్రభావితం చేసే సమస్యను సూచిస్తుంది. ఉదాహరణకు.. అధిక రక్తపోటు లేదా ఇన్ఫ్లుఎంజా (ఫ్లూ) వంటి దైహిక అనారోగ్యాలు వంటి దైహిక వల్ల మొత్తం శరీరం ప్రభావితమవుతుంది. మీకు 40 ఏండ్లు వచ్చిన తర్వాత డయాబెటిస్, రక్తపోటు, థైరాయిడ్ వంటి కొన్ని సమస్యలు వస్తాయి. ఈ క్రమబద్ధమైన వ్యాధులు కంటిశుక్లం, గ్లాకోమా, పొడి కళ్లు వంటి కంటి సమస్యల ప్రమాదాన్ని పెంచుతాయి.
 

66

రెటీనా

ఈ వయస్సులో.. వయస్సు-సంబంధిత మాక్యులర్ క్షీణత, రెటీనా సన్నబడటం వంటి సమస్యల అవకాశాలు పెరుగుతాయి. 

ఫైనల్ గా..

వృద్ధాప్యం అనివార్యమైనప్పటికీ.. మీ చర్మం, శరీరాన్ని మాత్రమే కాకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. మీకు 40 ఏండ్లు వచ్చిన తర్వాత మీ కళ్లను జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే మీ దృష్టి క్షీణించొచ్చు. రెటీనా వృద్ధాప్యం, కంటిశుక్లం, గ్లాకోమా, పొడి కళ్లు వంటి ఎన్నో కంటి సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వ్యాధులు రాకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలి. మీ కంటి ఆరోగ్యాన్ని బట్టి మీరు ప్రతి 6 నుంచి 8 నెలలకు కంటి పరీక్షలు చేయించుకోవాలి. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
 
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Drinking Water Before Brushing: ఉదయం బ్రష్‌ చేయకుండా నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా?
Recommended image2
ఎప్పుడూ ఒక‌వైపే న‌మిలి తింటున్నారా.? ఏం జ‌రుగుతుందో తెలిస్తే వెంట‌నే ఆపేస్తారు
Recommended image3
ట్యాబ్లెట్స్ కంటే ఇంజ‌క్ష‌న్‌తో త్వ‌ర‌గా రిలీఫ్ ఎందుకు వ‌స్తుంది? వెనుకున్న సైన్స్ ఏంటంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved