MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Life
  • Health
  • ఈస్ట్రోజన్ హార్మోన్.. మహిళలకు సమస్య తీసుకొచ్చే హార్మోన్ ఇదే!

ఈస్ట్రోజన్ హార్మోన్.. మహిళలకు సమస్య తీసుకొచ్చే హార్మోన్ ఇదే!

మహిళలకు అతి ముఖ్యమైన హార్మోన్ ఈస్ట్రోజన్ హార్మోన్ (Estrogen hormon). ఈ హార్మోన్ లోపం మహిళలలో ఏర్పడినప్పుడు వయసుతో సంబంధం లేకుండా అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. ఈ హార్మోన్ ఉత్పత్తి శరీరంలో తగ్గినప్పుడు కొన్ని లక్షణాలు (Features) మనకు కనిపిస్తాయి. ఆ లక్షణాలను బట్టి ఈస్ట్రోజన్ హార్మోన్ లోపంగా గుర్తించవచ్చు. మరి ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..  

2 Min read
Navya G
Published : Jul 20 2022, 04:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
Asianet Image

శరీరంలో ఈ హార్మోన్ల ఉత్పత్తి తగ్గడానికి ప్రధాన కారణం మానసిక ఒత్తిడి, పోషకాహార లోపం, అధిక బరువు, జీవనశైలిలోని మార్పులు ఇంకా ఇలా అనేక కారణాలు ఉన్నాయి. ఈ హార్మోన్ మహిళలలో లోపించినప్పుడు ముఖ్యంగా మొదట కనిపించే లక్షణం నెలసరిగా పీరియడ్స్ సరిగా రాకపోవడం. ఒకవేళ పీరియడ్స్ సక్రమంగా వచ్చిన అధిక రక్తస్రావం (Excessive bleeding), తక్కువ రక్తస్రావం (Less bleeding) జరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
 

25
Asianet Image

ఈ హార్మోన్ లోపం వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారిలోనూ కనిపిస్తుంది. పెళ్లయిన వారిలో ఈ హార్మోన్ లోపం (Hormone deficiency) తలెత్తినప్పుడు అండాలు సరిగా విడుదల కాకపోవడంతో సంతానలేమి సమస్యలు (Infertility problems) కలగవచ్చు. కనుక సంతానం కలగడం ఆలస్యం అవుతుంటే ఈ హార్మోన్ లోపంగా గుర్తించి వైద్యులను సంప్రదించడం మంచిది. ఈ మూడు ముఖ్యమైన సమస్యలతో పాటు యోని సమస్యలు కూడా ఏర్పడుతాయి.
 

35
Asianet Image

యోనికి (Vagina) రక్షణ వ్యవస్థగా పనిచేసే ఈస్ట్రోజన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గినప్పుడు యోనికి సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్య మహిళలను మరింత ఇబ్బంది పెడతాయి. ఈ సమస్య గురించి ఇతరులతో చర్చించడానికి కూడా సంకోచిస్తారు. యోని మార్గంలో ఏర్పాడే జిగురు ద్రవం తగ్గి యోని దగ్గర చర్మం పొడి బారుతుంది. అలాగే ఇన్ఫెక్షన్లు (Infections), దురద, మంట వంటి యోని సమస్యలు కలుగుతాయి.
 

45
Asianet Image

ఇలా యోని సమస్యల కారణంగా శృంగారంలో పాల్గొనడానికి ఆసక్తి చూపరు. అలాగే లైంగిక కూడ కోరికలు తగ్గుతాయి (Decreased sexual desire). ఈ సమస్యలతో పాటు రొమ్ములో గడ్డలు ఏర్పడడం, రొమ్ముకు సంబంధించిన క్యాన్సర్లు (Breast cancers) వంటి ఇతర సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా చర్మం పొడిబారి నిర్జీవంగా మారడం జరుగుతుంది. రోజులో ఎక్కువ మొత్తంలో నీరు తీసుకున్న చర్మ సమస్యలు ఏర్పడుతున్నాయి అంటే దీనికి ఈస్ట్రోజన్ హార్మోన్ లోపంగా భావించాలి.
 

55
Asianet Image

అలాగే మానసికంగా ఒత్తిడి, అలసట, నీరసం  వంటి సమస్యలు ఏర్పడతాయి. దీంతో మానసిక ప్రశాంతత తగ్గుతుంది (Calm down). అలాగే నిద్రలేమి (Insomnia) సమస్యలు ఏర్పడతాయి. పైన చెప్పిన లక్షణాలు కనిపిస్తే ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ లోపంగా గుర్తించాలి. ఈ సమస్యను తగ్గించుకునేందుకు సరైన జీవనశైలిని అనుసరిస్తూ మంచి పౌష్టికాహారాన్ని   తీసుకోవాలి. ఇందుకోసం తీసుకునే ఆహారంలో పండ్ల జ్యూసులు, మొలకలు, ఆకుకూరలు, సోయా చిక్కుడు గింజలను తీసుకుంటే ఈస్ట్రోజన్ హార్మోన్ ఉత్పత్తి త్వరగా పెరుగుతుంది.

Navya G
About the Author
Navya G
 
Recommended Stories
Top Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved