ఎంతకీ బరువు తగ్గడం లేదా? అయితే వీటిని తినేయండి తగ్గుతారు
బరువు పెరగడమంత ఈజీగా తగ్గరన్న ముచ్చట అందరికీ తెలుసు. కానీ కొన్ని ఆహారాలను మీ రోజువారి ఫుడ్ లో చేర్చుకుంటే ఖచ్చితంగా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు.

weight loss
బరువు తగ్గాలనుకునే వాళ్లు రకరకాల డైట్ ప్లాన్స్ ను ట్రై చేస్తుంటారు. జీవనశైలి మారడం వల్ల ఊబకాయం సమస్య వస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు మొదట చేయాల్సిన ముఖ్యమైన పని ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం. ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారం బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కొవ్వు, కార్బోహైడ్రేట్లు, చక్కెర ఎక్కువగా ఉండే ఆహారం బరువు పెరిగేలా చేస్తుంది. అందుకే వీటిని ఎక్కువగా తినకూడదు. మీరు తినే ఆహారంలో కేలరీలు చాలా తక్కువగా ఉండాలి. బరువు తగ్గేవారు ఎలాంటి ఆహారాలను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం..
Leafy Vegetables
ఆకు కూరలు
ఆకు కూరలు మనకు ఎన్నో పోషకాలను అందిస్తాయి. కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండే బచ్చలికూర వంటి ఆకుకూరలు ఊబకాయాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. ఆకుకూరల్లో శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలు, ప్రోటీన్లు, ఫైబర్స్ కూడా ఉంటాయి. మీకు తెలుసా? ఆకుకూరల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు ఆకు కూరలను ఎంచక్కా తినొచ్చు.
తృణధాన్యాలు
తృణధాన్యాలైన ఓట్స్, బ్రౌన్ రైస్ వంటి తృణధాన్యాలలో కేతరీలు తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా వీటిలో ఫైబర్, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే వీటిని డైట్ లో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యంగా బరువు తగ్గొచ్చు.
Image: Getty
గుడ్లు
గుడ్లు మంచి పోషకాహారం. ఇది పోషకాల బాంఢాగారం. బరువు తగ్గాలనుకునే వారు అమైనో ఆమ్లాలు, విటమిన్ బి మొదలైనవి పుష్కలంగా ఉండే గుడ్లను కూడా ఆహారంలో చేర్చుకోవచ్చు. గుడ్లు ఎన్నో పోషక లోపాలను పోగొడుతాయి.
బెర్రీలు
అరకప్పు బ్లూ బెర్రీలు, స్ట్రాబెర్రీలు, కోరింద కాయల్లో 32 కేలరీలు మాత్రమే ఉంటాయి. వీటిలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇలాంటి బెర్రీలు బరువు తగ్గడానికి బాగా సహాయపడతాయి. ముఖ్యంగా బ్లూబెర్రీలు కొవ్వును కరిగించడానికి బాగా సహాయపడతాయి.
సిట్రస్ పండ్లు
సిట్రస్ పండ్లు మన ఇమ్యూనిటీ పవర్ ను బలోపేతం చేస్తాయి. నారింజ, నిమ్మకాయ వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. వీటిని మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల కూడా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు.
గింజలు
రోజూ గుప్పెడు గింజలను తింటే ఎన్నో రోగాలకు దూరంగా ఉండొచ్చు. అలాగే ఆరోగ్యంగా బరువు కూడా తగ్గొచ్చు. బాదం, వాల్ నట్స్ లో ఫైబర్, ప్రోటీన్, హెల్తీ ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారు వీటిని డైట్ లో చేర్చుకుంటే మంచి ప్రయోజనం పొందుతారు.