ఈ పదార్థాలు తప్పనిసరిగా తినండి.. లేకుంటే మీ జుట్టు తెల్లబడటం గ్యారెంటీ?
వాతావరణంలోని కాలుష్యం (Pollution), హెయిర్ ఉత్పత్తుల్లోని రసాయనాలు, తీసుకునే ఆహారంలోని పోషకాల లోపాలు (Nutritional deficiencies) ఇలా ఇతర కారణాలతో చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోంది.

ఈ సమస్యను తగ్గించుకోవడానికి జుట్టు సంరక్షణ పట్ల ప్రత్యేక శ్రద్ధ తప్పనిసరి. అప్పుడే జుట్టు తెల్లబడకుండా మంచి నిగారింపుతో ఉంటుంది. ఇప్పుడు మనం తీసుకోవలసిన ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం..
కాఫీ పౌడర్: రెండు కప్పుల నీటిలో ఐదు స్పూన్ ల కాఫీ పౌడర్ (Coffee powder) వేసి బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగించిన నీరు చల్లారిన తర్వాత వడకట్టుకోవాలి. ఈ నీటిని తలకు అప్లై చేసుకొని అరగంట తర్వాత తలస్నానం (Head bath) చేసుకోవాలి. ఇలా వారానికి కనీసం ఒకసారి చేస్తే జుట్టు మంచి నిగారింపు అంది తెల్లబడకుండా ఉంటుంది.
ఉసిరికాయ: నాలుగు ఉసిరికాయలను (Amla) చిన్న ముక్కలుగా కోసి కప్పు నీటిలో వేసి చిన్న మంట మీద మరిగించి కోవాలి. పది నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఉసిరికాయ నీరు చల్లారిన తరువాత స్ప్రే బాటిల్ లో నిల్వ చేసుకొని ఫ్రిజ్ లో ఉంచుకోవాలి. తలస్నానం చేసి ఆరిన తలకి ఉసిరికాయ నీటిని స్ప్రే చేసుకొని సున్నితంగా మర్దన (Massage) చేసుకోవాలి. ఇలా వారానికి కనీసం రెండుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
గుంటగలగరాకు: గుంటగలగరాకు జుట్టు తెల్లబడకుండా సహాయపడుతుంది. ఇందులో ఉండే బయో ఆక్టివ్ గుణాలు (Bioactive properties) మెలనిన్ (Melanin) ను పెంచుతాయి. ఈ ఆకు జుట్టుకు సహజసిద్ధమైన డైలా పనిచేస్తుంది. కనుక ఒక కప్పు నూనెకు సమాన పరిమాణంలో ఆకులు కలిపి వేడి చేసుకోవాలి. ఈ నూనెను వారానికి కనీసం రెండు సార్లు రాస్తే మంచి ఫలితం లభిస్తుంది.
విటమిన్లు: బి12, బి7, బి9, డి విటమిన్లు (Vitamins) ఎక్కువగా లభించే పాల పదార్థాలు, చేప, పాలకూర, రాజ్మా వంటి ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఇలా పోషకాలు అధికంగా ఉన్న ఆహార పదార్థాలను ఆహార జీవనశైలిలో తరచూ తీసుకుంటే జుట్టు ఆరోగ్యం (Hair healthy) మెరుగుపడటంతో పాటు జుట్టు నిగారింపు పెరుగుతుంది.
డ్రై ఫ్రూట్స్: డ్రై ఫ్రూట్స్ (Dry Fruits) లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు (Omega 3 fatty acids) పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు సహకరిస్తాయి. అలాగే ఇందులో రాగి ఎక్కువ పరిమాణంలో ఉంటుంది. ఇది శరీరంలో మెలనిన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది జుట్టు తెల్లబడకుండా చేసి జుట్టుకు మంచి నిగారింపును అందిస్తుంది.
గుడ్డు: గుడ్డు (Egg) పోషకాల గని. ఇందులో ఉండే ప్రొటీన్ (Protein) ఆరోగ్యపరంగా చాలా మేలు చేస్తుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో ఉత్తమమైన ఆహారం. కనుక తీసుకునే ఆహారంలో ప్రతిరోజు ఉడికించిన గుడ్డును తీసుకుంటే జుట్టుకు కావలసిన పోషకాలు పుష్కలంగా అందుతాయి. దీంతో తెల్లజుట్టు సమస్య దూరమై జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.