Health Tips: స్వీట్స్ ఎక్కువగా తింటున్నారా.. అయితే ఈ సమస్యలు ఎదుర్కోవాల్సిందే!
Health Tips : మనలో చాలామంది స్వీట్స్ చూశారంటే నోరు కట్టుకోలేరు. అమాంతం నోట్లో వేసుకుంటారు. స్వీట్స్ ఎక్కువగా తినటం వల్ల వచ్చే ప్రమాదాలు ఏంటో ఇక్కడ చూద్దాం.
ఎక్కువ చక్కెర గాని తీపి పదార్థాలు గానీ తింటున్నారా? అయితే మొటిమలు రావడం పక్కా. మనలో చాలామందికి తీపి పదార్థాలు అంటే చాలా ఇష్టం. అవకాశం దొరికినప్పుడు అల్లా వాటిని రుచి చూడడానికి మన నోరు ఆగదు. చక్కెర లేక మిగిలిన తీపి పదార్థాలను కొన్ని మంది అయితే ప్రతిరోజూ తింటారు.
దీని వల్ల చాలా సమస్యలు వస్తాయి. మన ఆరోగ్యం పాడవుతుంది. మనకి సరైన ఆరోగ్యం కావాలంటే ఆకుకూరలు, చేపలు, క్యారెట్లు వంటి ఆరోగ్యమైన తిండి పదార్థాలను ఎంచుకోవాలి. తీపిని ఎంత తగ్గిస్తే అంత మంచిది. ఆరోగ్యం కోసం తీపిని దూరం పెట్టాలి.తరుచుగా స్వీట్స్ తినడం వల్ల ఆరోగ్యంపై చాలా ప్రభావం పడుతుందట.
ముఖ్యంగా మధుమేహం(డయాబెటీస్)వచ్చే ప్రమాదం ఉంది. అలాగే చిన్నప్పటి నుంచే స్వీట్స్ మరీ ఎక్కువగా తింటే స్కిన్ పై ముడతలు వస్తాయి. దీంతో చిన్న వయసులోనే పెద్దవారిలా కనిపించే అవకాశాలు ఉంటాయి.తీయని పదార్థాలు తినడం వల్ల మన చర్మానికి చాలా మటుకు మంచిది కాదు.
చాలా సమస్యలు వస్తాయి అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.మనసు బాగోలేనపుడు తీయగా వుండే కేకులు , పేస్ట్రీలు, చాకొలేట్ తింటాం కదా. కానీ అవి దీర్ఘకాలంలో డిప్రెషన్ లోకి నెట్టేస్తాయట.ముఖంలో వయసు ఛాయలు కన్పిస్తున్న చర్మం సాగిపోయి ముడతలు పడటానికి ప్రధాన కారణం తీపి పదార్ధాలే.
ఇవి చర్మం సాగే గుణాన్ని కోల్పోయేలా చేస్తాయి.వాపులు తలెత్తటానికీ, దంతాల ఆరోగ్యం పాడవటానికీ, అజీర్ణ సమస్యలకు కూడా ఎక్కువుగా తీపి తినటమే కారణం. అందుకే శుద్ధి చేసిన చక్కెరలు అంటే పంచదార ఉండే స్వీట్స్ కు కొంచెం దూరంగా ఉండటం మంచిది.
ఇవే కాకుండా ఇంకా మొటిమలు రావడం, మొఖం జిడ్డుగా ఉండడం, ముడతలు పడిపోవడం లాంటి ఎన్నో విషయాలకు కారణం అవుతాయి ఈ తీపి పదార్థాలు. కనుక వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. తీపి పదాలకు దూరంగా ఉండి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి.