మీకు మధుమేహం ఉందా.. మరి ఈ విషయం మీకు తెలుసా.. బ్రోకలీ ఇలా తింటే ఎన్ని ప్రయోజనాలో!
అత్యంత ఆరోగ్యవంతమైన వెజిటేబుల్ లలో బ్రోకలీ (Broccoli) కూడా ఒకటి. బ్రోకలీ చూడడానికి కాలీఫ్లవర్ లా కనిపిస్తుంది. ఇందులో అనేక పోషకతత్వాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మరి బ్రోకలీతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు (Health benefits) ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Broccoli
బ్రోకలీలో వివిధ రకాల ప్రొటీన్లతో (Proteins) పాటు విటమిన్ బి5, ఇ, సి లతో పాటు శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు, న్యూట్రీషియన్స్ ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందించి వివిధ రకాల అనారోగ్య సమస్యలకు (Illness issues) దూరంగా ఉంచుతాయి. కనుక బ్రోకలీని శరీరానికి ఏదో ఒక విధంగా అందించడం తప్పనిసరి.
Broccoli
జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది: బ్రోకలీ తీసుకుంటే జీర్ణవ్యవస్థ (Digestive system) మెరుగుపడుతుంది. అలాగే పేగులు పొట్టను శుభ్రపరుస్తుంది. అలాగే ఇందులో ఉండే కరిగే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరిచి ఉదర భాగాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాకుండా మలబద్దకం (Constipation) సమస్యలు కూడా తగ్గుతాయి.
Broccoli
రోగ నిరోధక శక్తి పెరుగుతుంది: బ్రోకలీలో అత్యంత శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. ఇవి శరీరానికి రోగ నిరోధక శక్తిని (Immunity) పెంచి వివిధ రకాల అనారోగ్య సమస్యలతో పోరాడే సామర్థ్యాన్ని పెంచుతాయి. దీంతో శరీరాన్ని ఆరోగ్యంగా (Healthy) ఉంచుతాయి.
Broccoli
జ్ఞాపక శక్తి పెరుగుతుంది: బ్రోకలీలో ఉండే వివిధ రకాల విటమిన్లు, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు మెదడు పనితీరును (Brain function) మెరుగుపరుస్తాయి. దీంతో మెదడు ఆరోగ్యంగా ఉండి మతిమరుపు సమస్యలకు దూరంగా ఉండవచ్చు. కనుక మతిమరుపు సమస్యలతో బాధపడేవారు బ్రోకలీనీ తీసుకుంటే జ్ఞాపకశక్తి (Memory) పెరుగుతుంది.
Broccoli
ఎముకల బలహీనతను తగ్గిస్తుంది: బ్రోకలీలో అధిక మొత్తంలో క్యాల్షియం (Calcium) ఉంటుంది. ఇది ఎముకలను బలోపేతం చేసి ఎముకల ఆరోగ్యాన్ని (Bone health) మెరుగుపరుస్తుంది. ఇది వయసు పైబడటంతో ఏర్పడే ఎముకల బలహీనతను తగ్గిస్తుంది. అలాగే కీళ్ల, మోకాళ్ల నొప్పులు వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.
Broccoli
మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది: మధుమేహంతో బాధపడేవారు బ్రోకలీను తీసుకోవడం మంచిది. బ్రోకలీనీ తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలను (Sugar levels) క్రమబద్దీకరిస్తుంది. దీంతో మధుమేహం (Diabetes) అదుపులో ఉంటుంది. అలాగే చక్కెర పదార్థాలు తినాలనే కోరిక కూడా తగ్గుతుంది.
Broccoli
క్యాన్సర్ ను నివారిస్తుంది: బ్రోకలీలో యాంటీ క్యాన్సర్ (Anti-cancer) లక్షణాలు ఉంటాయి. ఇవి శరీరంలో క్యాన్సర్ కణాల వ్యాప్తిని అడ్డుకుని శరీరానికి అవసరమయ్యే ఎంజైములకు రక్షణ కల్పిస్తుంది. దీంతో వివిధ రకాల క్యాన్సర్లకు (Cancer) దూరంగా ఉండవచ్చు. కనుక బ్రోకలీని ఆహారంలో భాగంగా చేసుకుందాం. క్యాన్సర్ కు దూరంగా ఉందాం.
Broccoli
చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది: బ్రోకలీలో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు (Antioxidants) డ్యామేజ్ అయిన చర్మాన్ని తిరిగి రిపేర్ చేస్తాయి. దీంతో చర్మం ఆరోగ్యంగా (Skin health) మారి మంచి నిగారింపును పొందుతుంది. అలాగే అన్ని రకాల చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి. అంతేకాకుండా చర్మ సౌందర్యం మరింత రెట్టింపవుతుంది.