పొడి కంటి వ్యాధి.. ఇది ఎందుకు వస్తుంది.. దీన్ని ఎలా తగ్గించుకోవాలంటే?
కన్నీళ్లు సరిపడా లేకపోవడం లేదా అవి చాలా త్వరగా ఆవిరైపోవడం వల్ల డ్రై ఐ డిసీజ్ వస్తుంది. ఈ వ్యాధిని పూర్తిగా నయం చేసుకోవచ్చు.

కన్నీళ్లు తగినంతగా ఉత్పత్తి కాకపోవడం వల్ల కళ్లు పొడిబారుతాయి. మన కళ్ల తడిగా ఉండటానికి కన్నీళ్లు తగినంతగా ఉత్పత్తి కాకపోతే లేదా అవి చాలా త్వరగా ఆవిరైపోతే డ్రై ఐ డిసీజ్ సమస్య వస్తుంది. కన్నీళ్లు తక్కువగా ఉత్పత్తి కావడానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. కానీ పొడి కళ్లు మీకు అసౌకర్యాన్ని కలిగిస్తాయి. ఎందుకంటే మీ కళ్లలో ఏదో చిక్కుకున్నట్టుగా అనిపిస్తుంది. అది బయటకు రాదు.
ఎయిర్ కండిషనర్ ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉన్నప్పుడు, కంప్యూటర్ స్క్రీన్ ను ఎక్కువసేపు చూడటం, ఫోన్ ను ఎక్కువ సేపు ఉపయోగించడం వంటి వివిధ కారణాల వల్ల కళ్లు పొడిబారుతాయి. అయినప్పటికీ.. ఇది ప్రమాదకరమైన సమస్య ఏం కాదు. దీనిని చికిత్సతతో తగ్గించుకోవచ్చు. 50 ఏండ్లు పైబడిన వారిలో, మహిళల్లో, కంటి సమస్యలు ఉన్నవారిలో, తగినంత విటమిన్ ఎ లభించనివారికి ఈ సమస్య ఎక్కువగా వస్తుంది.
డ్రై ఐ డిసీజ్ లక్షణాలు
ఎక్కువ వెలుతురును చూడలేకపోవడం
కళ్లు ఎర్రబారడం
కాంటాక్ట్ లెన్సులు ధరించడంలో ఇబ్బంది
కళ్ల మంట
బర్నింగ్
దురద
కళ్ల నుంచి నీరు కారడం
డ్రై ఐస్ డిసీజ్ ప్రమాద కారకాలు
అనారోగ్య సమస్యలు: ఎన్నో రకాల నాడీ సమస్యలు, కంటి సమస్యలు, స్వయం ప్రతిరక్షక వ్యాధులు, ఎండోక్రైన్ సమస్యలు డ్రై ఐస్ డిసీజ్ ప్రమాదాన్ని పెంచుతాయి.
మందులు: డిప్రెషన్, అలెర్జీలు, రక్తపోటు, గ్లాకోమా, రుతువిరతి చికిత్సకు సూచించిన మందులు కూడా డ్రై ఐస్ డిసీజ్ సమస్యను కలిగిస్తాయి.
శస్త్రచికిత్సలు: లాసిక్, కంటిశుక్లం శస్త్రచికిత్స, కార్నియాపై శస్త్రచికిత్స వంటి కొన్ని కంటి శస్త్రచికిత్సలు కళ్లు పొడిబారే ప్రమాదాన్ని పెంచుతాయి.
వాతావరణం: వాతావరణం, అలెర్జీలు, స్మోకింగ్ అలవాట్లు కూడా కళ్లు పొడిబారే ప్రమాదాన్ని పెంచుతాయి.
చికిత్స
మీ కళ్లు తరచుగా పొడిబారినా, దీని లక్షణాలు ఎక్కువ సేపు ఉన్నా వెంటనే హాస్పటల్ కు వెళ్లడమే మంచిది. అయితే కొన్ని ఇంటి చిట్కాలతో కూడా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. ఎలాగంటే?
మీ కళ్లకు కొంత విశ్రాంతినివ్వండి
మీ కళ్ళపై వెచ్చని కంప్రెస్ లను ఉంచండి.
పర్యావరణ ట్రిగ్గర్లను నివారించండి
విటమిన్ ఎ ఎక్కువగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తినడం