Health Tips: చేపలు తిన్న తర్వాత పాల పదార్థాలు తీసుకోకూడదా.. లేదంటే అంతే సంగతా?
Health Tips: చేపలు తిన్న తర్వాత పాలు తాగకూడదని అలాగే పాలు తాగిన తర్వాత చేపలు తినకూడదని చిన్నప్పటినుంచి మన పెద్దలు చెబుతూ ఉంటే వింటూ వచ్చాం. అయితే అందులో నిజా నిజాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పాలు తాగిన వెంటనే చేపలు తినటం వలన ప్రయోజనం ఇవ్వటానికి బదులుగా ఒక పాయిజన్ లాగా పని చేస్తుందని మన పెద్దలు చెబుతూ ఉంటారు. ఈ విషయం గురించి ఆయుర్వేదం ఏం చెబుతుందో చూద్దాం. ఆయుర్వేదం ప్రకారం చేపలు తిన్న వెంటనే మీరు పాలు తీసుకున్నట్లయితే కొందరిలో ల్యూకోడెర్మా అనే అనారోగ్య స్థితి రావచ్చని చెబుతున్నారు.
ల్యూకోడెర్మ అంటే చర్మంపై తెల్లని ప్యాచెస్ లాగా కనిపిస్తుంది. అయితే ఇది అందరిలోనూ అన్నిసార్లు కనిపించదు. కొన్నిసార్లు చేపలు అసిడిక్ స్వభావాన్ని కలిగి ఉంటాయి, పాలు ఆల్కలైన్ స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఈ క్రమంలో రెండింటినీ కలిపి తీసుకుంటే గ్యాస్టిక్ సమస్యలు వస్తాయి.
కనుక రెండిటిని కలిపి తీసుకోకపోవటమే ఉత్తమని చెబుతుంటారు ఆయుర్వేద నిపుణులు. అయితే ఇది శాస్త్రబద్ధంగా నిరూపించబడలేదు అంటున్నారు ఇంగ్లీష్ డాక్టర్లు. చర్మపు మచ్చలకు పాలు లేదా చేపలతో సంబంధం లేదు.
ఇది ఆటో యూనియన్ వ్యాధి అంటే రోగనిరోధక వ్యవస్థ మెలీనియం తో పోరాడే ప్రతిరోధకాలను ఉత్పత్తి చేస్తుంది. యాంటీబాడీ లు దాడి చేసిన చోటల్లా చర్మంపై మచ్చలు కనిపిస్తాయి. అంతేకానీ చేపలను పాలతో కలిపి తీసుకుంటే చర్మంపై మచ్చలు రావని ఇంగ్లీష్ వైద్యులు చెబుతున్నారు.
చేపలు, పాల ఉత్పత్తులలో అధిక ప్రోటీన్లు ఉంటాయి. రెండింటిని కలిపి తీసుకుంటే జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు. దీనివల్ల గ్యాస్, డయేరియా తదితరులు సమస్యలు వస్తాయేమో కానీ చర్మానికి సంబంధించిన మచ్చలు లాంటివి రావు అని ఆహార నిపుణులు సైతం చేస్తున్నారు.
కొన్ని కొన్ని ఆహార పదార్థాల మిశ్రమం కొందరి శరీరానికి పడదు ఎలర్జీలకి దారితీస్తుంది. అది ఆయా శరీరతత్వాల మీద ఆధారపడి ఉంటుంది. అంతే తప్పితే ఈ కాంబినేషన్లో తింటే చర్మ సమస్యలు వస్తాయి, చనిపోతాము అనేది మాత్రం పెద్ద అపోహ మాత్రమే.