సమ్మర్ లో టీ, కాఫీలకు బదులుగా ఇవి తీసుకుంటే బెస్ట్.. ఆరోగ్యానికి ఎంతో మేలు!
వేసవి కాలంలో అధిక ఎండ తీవ్రత కారణంగా శరీరం నీరసించి (Frustrated) అనేక అనారోగ్య సమస్యలకు (Illness issues) గురవుతుంది.

అందుకే శరీరానికి శక్తిని అందించి వేసవి సమస్యల నుంచి ఉపశమనం కలిగించి ఆరోగ్యానికి మేలు చేసే కొన్ని పానీయాలను తీసుకోవడం మంచిది. అప్పుడే మెరుగైన ఆరోగ్యాన్ని పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ పానీయాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
వేసవి కాలంలో ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. కనుక టీ, కాఫీలకు బదులుగా ఆరోగ్యకరమైన పానీయాలను (Healthy drinks) శరీరానికి అందించడం ముఖ్యం. దీంతో శరీరానికి కావలసిన పోషకాలు అంది అనేక అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు. ఈ పానీయాలను వేసవికాలంలో తీసుకుంటే రోజంతా హుషారుగా (Wisely) ఉండడంతోపాటు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది .
అల్లం, తేనె, నిమ్మరసం: అల్లం (Ginger) మరిగించిన నీటిలో కొద్దిగా నిమ్మరసం (Lemon juice), తేనె (Honey) కలుపుకుని ఉదయాన్నే తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ఇందులో ఉండే ఔషధ గుణాలు తలనొప్పి, ఒళ్లు నొప్పులు, రక్తపోటు వంటి ఇతర సమస్యలు కూడా తగ్గుతాయి. కనుక ఈ పానీయాన్ని తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.
పుదీనా ఆకులు, నిమ్మరసం: అధిక ఎండ కారణంగా శరీరం అలసటకు గురవుతుంది. ఈ సమస్యలను తగ్గించుకోవడానికి రాత్రంతా నీళ్ళలో నానబెట్టిన పుదీనా ఆకుల (Mint leaves) నీటికి కొద్దిగా నిమ్మరసం (Lemon juice) కలుపుకుని తాగితే మంచిది. ఈ పానీయాన్ని తీసుకుంటే ఒత్తిడి సమస్యలు తగ్గడంతో పాటు చర్మానికి కూడా అనేక ప్రయోజనాలు కలుగుతాయి.
జీలకర్ర: వేసవి కాలంలోని అధిక ఉష్ణోగ్రతల కారణంగా చాలామంది నిద్రలేమి సమస్యను (Insomnia problem) ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య నుంచి ఉపశమనం కోసం జీలకర్ర (Cumin) వేసి మరిగించిన నీటిని తాగితే మంచిది. దీంతో నిద్ర బాగా పడుతుంది. అలాగే చర్మం నుంచి వ్యర్థాలు బయటకు తొలగిపోయి చర్మం శుభ్రపడుతుంది. దీంతో చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
కీరదోసకాయ: వేసవికాలంలో కీరదోసకాయను (Cucumber) తీసుకోవడంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. సన్నగా తరిగిన కీరదోసకాయ ముక్కలను నీళ్లలో వేసి రాత్రంతా ఉంచి ఉదయాన్నే ఆ నీటిని తీసుకుంటే ఎంతో మంచిది. ఈ నీళ్లు రోజంతా హుషారుగా ఉండేందుకు సహాయపడుతాయి. అలాగే బరువు తగ్గాలనుకునే (Weight loss) వారికి మంచి ఫలితాలను అందిస్తాయి.
సోంపు నీళ్లు: వేసవికాలంలో ఆహారం ఎక్కువగా తీసుకోలేం. ఒకవేళ తీసుకున్నా జీర్ణించుకోలేం. దీంతో పొట్ట ఉబ్బరంగా (Flatulence) ఉంటుంది. ఈ సమస్యను తగ్గించడానికి సోంపు నీళ్లు (Anise water) చక్కటి పరిష్కారం. సోంపు గింజలను నీళ్లలో వేసి బాగా మరిగించి ఆ నీటిని తాగితే పొట్ట ఉబ్బరం సమస్యలు తగ్గుతాయి. అలాగే నెలసరి సమస్యలు కూడ తగ్గుతాయి.