Health Tips: వర్షంలో తడిచాక ఇలా చేయండి.. ఇన్ఫెక్షన్ లను దూరం నెట్టండి?
Health Tips: వర్షాకాలంలో ఎంత తప్పించుకుందామనుకున్నా వర్షంలో తడవక తప్పదు అలాంటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇన్ఫెక్షన్ రాకుండా అడ్డుకోవచ్చు అవేంటో చూద్దాం.
మొత్తానికి ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న వర్షాకాలం వచ్చేసింది. వర్షం రావడం ఆనందమే కానీ అది తీసుకువచ్చే ఇన్ఫెక్షన్ లే కొంచెం ఇబ్బందిని కల్పిస్తాయి. ఎంత వద్దనుకున్నా ఒక్కొక్కసారి వర్షంలో తడిచుకోవడం జరుగుతుంది. అప్పుడు వద్దన్నా ఈ ఇన్ఫెక్షన్లు మన వెంట పడతాయి.
అయితే కొన్ని చిట్కాలని పాటించడం వలన ఎలాంటి ఇన్ఫెక్షన్ లు దరిచేరకుండా వర్షాన్ని ఎంజాయ్ చేయవచ్చంటున్నారు అంటున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం. వర్షంలో ఎంత వద్దనుకున్నా అప్పుడప్పుడు తడిచి పోవాల్సి వస్తుంది.
అప్పుడు ఇంటికి వచ్చిన వెంటనే కచ్చితంగా తల స్నానం చేయడం వలన దగ్గు జలుబు రాకుండా నివారించవచ్చు. అలాగే స్నానం చేసేటప్పుడు అందులో కొద్దిగా నిమ్మరసం కలిపి స్నానం చేస్తే మంచిది దీనివల్ల శరీరంపై ఉండే బ్యాక్టీరియా వైరస్ లో నశిస్తాయి.
అలాగే వర్షంలో తడిచి ఇంటికి వచ్చిన తరువాత వెంటనే చంటి పిల్లల్ని గాని మరి ఎవరిని గాని తాగకండి. లేదంటే మీతో పాటు ఆ ఇన్ఫెక్షన్ వాళ్లకి కూడా అంటించిన వారు అవుతారు కాబట్టి జాగ్రత్తగా పడండి. వర్షంలో తడిచినపుడు గ్రీన్ టీ లేకపోతే డికాషన్ తాగాలి.
అల్లం, మిరియాల ను నీటిలో వేసి మరిగించి అందులో కొద్దిగా తేనె, తులసి ఆకుల రసం, నిమ్మరసం కలిపి తాగాలి. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. వర్షంలో తడిచినవారు రెండు మూడు రోజులు వరకు హెర్బల్ టీ లను తాగటం వలన ఇమ్యూనిటీ పెరగడంతో ఇన్ఫెక్షన్లు దగ్గరికి రావు.
ఆహారంలో కూడా మిరియాలు నిమ్మరసం వంటివి ఎక్కువగా చేర్చుకోవడం వలన కూడా ఇన్ఫెక్షన్ లని దరిచేరకుండా చేయవచ్చు. కాబట్టి మీరు ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే వర్షంలో తడిసిన కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది.