చక్కెర ఎక్కువ తింటే కిడ్నీ స్టోన్స్ వస్తయా?
ఒక కొత్త అధ్యయనం ప్రకారం.. చక్కెర మూత్రపిండాల్లో రాళ్లు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. మీకు కిడ్నీ స్టోన్స్ రాకూడదంటే మీరు రోజూ తీసుకునే చక్కెర పరిమాణాన్ని తగ్గించాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

షుగర్ మన ఆరోగ్యానికి హానికరమన్న ముచ్చట దాదాపుగా అందరికీ తెలుసు. కానీ షుగర్ తో చేసిన తీపి పదార్థాలను తినకుండా ఉండనివారు చాలా మందే ఉన్నారు. మీకు తెలుసా? సాధారణంగా చక్కెరను 'వైట్ పాయిజన్' అని కూడా అంటారు. ఎందుకంటే ఇది మన ఆరోగ్యాన్నే కాదు చర్మ ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. ఎన్నో ప్రమాదకరమైన రోగాల బారిన పడేస్తుంది.
ముఖ్యంగా ప్రాసెస్ చేసిన ఆహారాలు, పానీయాల రూపంలో ఎక్కువ మొత్తంలో చక్కెరను తీసుకోవడం వల్ల విపరీతంగా బరువు పెరిగిపోతారు. అలాగే డయాబెటీస్, గుండె జబ్బులు కూడా వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఒక కొత్త అధ్యయనం ప్రకారం.. చక్కెర మూత్రపిండాల్లో రాళ్లు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకే మీరు ప్రతిరోజూ తీసుకునే చక్కెర పరిమాణాన్ని తగ్గించేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అధ్యయనం ప్రకారం.. మూత్రపిండాల్లో రాళ్లకు చక్కెర చాలా ముఖ్యమైన ప్రమాద కారకాలలో ఒకటి.
ఈ అధ్యయనం ఫ్రాంటియర్స్ ఇన్ న్యూట్రిషన్ లో ప్రచురితమైంది. యూఎస్ నేషనల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఎగ్జామినేషన్ సర్వే ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. 2007 నుంచి 2018 మధ్య 28,303 మంది పెద్దలపై ఈ అధ్యయనం నిర్వహించారు. చక్కెర మొత్తాన్ని పరిమితం చేయడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా నిరోధించడానికి సహాయపడుతుందని ఫలితాలు సూచిస్తున్నాయి.
Image: Freepik
చక్కెర ఎక్కువగా ఉన్న ఆహారం మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి అవసరమయ్యే భాగాల మొత్తాన్ని పెంచుతుంది. వీటిలో ఆక్సలేట్, కాల్షియం వంటి మూత్రంలోని కొన్ని పదార్థాలు ఉంటాయి. ఈ పదార్థాలు మూత్రపిండాలు లేదా మూత్ర నాళంలో రాళ్లు ఏర్పడటానికి కారణమవుతాయి. అని ప్రిటికిన్ లాంగివిటీ సెంటర్ లోని డైటీషియన్ కారా బెర్న్స్టీన్ చెప్పారు.
Image: Getty Images
పండ్లు తినడం వల్ల మొత్తం చక్కెర స్థాయిలు తగ్గడమే కాకుండా, వ్యాధితో పోరాడే యాంటీఆక్సిడెంట్లు శరీరానికి చేరడానికి సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. మనలో చాలా మంది సోడా, జ్యూసులు వంటి పానీయాలను ఇష్టంగా రోజూ తాగుతుంటారు. కానీ ఈ పానీయాలలో ఫ్రక్టోజ్ ఉంటుంది. ఫ్రక్టోజ్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల లెప్టిన్ నిరోధకత ఏర్పడుతుంది.
Image: Getty Images
స్వీట్స్ ఎక్కువగా తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంది. దీనివల్ల ఇన్సులిన్ స్థాయిలు విపరీతంగా పెరుగుతాయి. అలాగే రక్తపోటు, హృదయ స్పందన రేటు కూడా పెరుగుతుందని అధ్యయనం తెలిపింది.