MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • టీ, కాఫీలతో మాత్రలు వేసుకుంటారా? ఏమౌతుందో తెలుసా?

టీ, కాఫీలతో మాత్రలు వేసుకుంటారా? ఏమౌతుందో తెలుసా?

మెడిసిన్స్ ను సరిగ్గా వేసుకోకపోతే అవి సరైన ఫలితాలను ఇవ్వవంటారు డాక్టర్లు. అయితే చాలా మంది మాత్రలను టీ లేదా కాఫీలతో వేసుకుంటుంటారు. కానీ ఇలా వేసుకుంటే ఏమౌతుందో తెలుసా?  

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Aug 16 2024, 09:55 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

చాలా మందికి ఉదయాన్నే టీ, కాఫీ తాగే అలవాటు ఉంటుంది. కాఫీ ఒక భేదిమందుగా పనిచేస్తుందని ఎన్నో అధ్యయనాలు వెల్లడించాయి. కాఫీ మన కడుపును శుభ్రపరచడానికి కూడా సహాయపడుతుంది. అయితే చాలామంది మెడిసిన్స్ ను కూడా టీ, కాఫీలతో పాటుగా తీసుకుంటుంటారు. మీకు తెలుసా? టీ, కాఫీల్లో కెఫిన్, నికోటిన్, థియోబ్రోమైన్ తో పాటుగా 5 ఆల్కలాయిడ్లు ఉంటాయి. ఇవి మెడిసిన్స్ ప్రభావాలను తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఇవి శోషణను కూడా నివారిస్తాయి. అందుకే టీ, కాఫీలతో ఏయే మెడిసిన్స్ ను తీసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

26

యాంటీ బయాటిక్స్

చాలా మంది యాంటీ బయోటిక్స్ ను తీసుకుంటుంటారు. అయితే వీళ్లు పక్కాగా టీ లేదా కాఫీతోనే వీటిని వేసుకుంటుంటారు. కానీ టీ, కాఫీలో లక్షణాలు యాంటీ బయాటిక్స్ ప్రభావాన్ని తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇలా మందులను తీసుకోవడం వల్ల సంక్రమణ ప్రమాదం పెరుగుతుంది. 

36

Analgesic

ఇబుప్రోఫెన్, నాప్రోక్సెన్ వంటి కొన్ని రకాల నొప్పి నివారణా మాత్రలను కూడా టీ లేదా కాఫీలతో తీసుకూడదు. ఎందుకంటే ఈ మందులను వీటితో తీసుకుంటే కడుపులో పుండ్లు ఏర్పడతాయి. అలాగే కడుపు  చికాకు కలుగుతుంది. 
 

46

థైరాయిడ్ మందులు

థైరాయిడ్ మందులను కూడా టీ, కాఫీలతో తీసుకోకూడదు. ఎందుకంటే దీనివల్ల హైపోథైరాయిడిజం మందుల ప్రభావం తగ్గుతుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కాఫీ థైరాయిడ్ మందుల శోషణను సగానికి పైగా తగ్గిస్తుంది.

56

ఉబ్బసం మందులు

ఆస్తమా మెడిసిన్స్ ను కూడా టీ, కాఫీలతో పొరపాటున కూడా తీసుకోకూడదు. ఎందుకంటే టీ, కాఫీలో ఉండే కెఫిన్ లో బ్రోన్కైటిస్ ఉంటుంది. ఇది ఈ మందుల ప్రభావాన్ని తగ్గిస్తుంది. అలాగే తలనొప్పి, కడుపు నొప్పి, చికాకు, చంచలత వంటి సమస్యలను కలిగిస్తుంది.
 

66

డయాబెటిస్ మందులు

డయాబెటిస్ పేషెంట్లు కూడా తమ మందులను టీ, కాఫీలతో తీసుకోకూడదు. ఇది మీ శరీరంపై చెడు ప్రభావాన్ని కలిగిస్తుంది. కాఫీ,టీలో ఉండే చక్కెర, పాల వల్ల ఇలా జరుగుతుంది. దీనివల్ల మీ రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి. ఇది మెడిసిన్స్ ప్రభావాన్ని కూడా బాగా తగ్గిస్తుంది. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Neem Leaves: రోజూ గుప్పెడు వేపాకులు తింటే శరీరంలో జరిగే 5 మార్పులు ఇవే!
Recommended image2
Summer Skin Care: మండే ఎండల్లోనూ మెరిసే చర్మం.. ఇదొక్కటి చేస్తే చాలు
Recommended image3
Periods: హెవీ బ్లీడింగ్‌తో విసిగిపోయారా? ఈ చిట్కాలు మీ కోసమే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved