ఈ ఆహార పదార్థాలను తిన్న తరువాత నీళ్లు అస్సలు తాగకూడదు.. తాగితే ఏం జరుగుతుందంటే?
నీరు (Water) మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు చాలా ముఖ్యం. నీరు శరీరాన్ని డీహైడ్రేట్ బారినుంచి కాపాడి హైడ్రేట్ గా ఉంచుతుంది.

అలాగే జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపి శరీరాన్ని శుభ్రంగా ఉంచుతుంది. ఇలా నీటిని తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు (Health benefits) బోలెడు. అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలను తిన్న తరువాత నీళ్లు త్రాగడం ఆరోగ్యానికి మంచిదికాదని వైద్యులు అంటున్నారు. ఎందుకో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
నీరు శరీరంలోని అనేక అనారోగ్య సమస్యలకు (Illness issues) చక్కటి పరిష్కారం. అయితే నీళ్లను అన్ని సమయాలలో శరీరానికి అందించడం మంచిదికాదని వైద్యులు అంటున్నారు. ఎందుకంటే కొన్ని ఆహార పదార్థాలను తిన్న తరువాత నీటిని తాగితే ఆరోగ్యానికి ప్రమాదం. శరీరంలోని జీవక్రియల (Metabolism) పనితీరు మందగిస్తుంది. దీంతో నీటిని తీసుకుంటే కలిగే ఉత్తమమైన ఫలితాలను పొందలేరు.
పండ్లు: పండ్లను (Fruits) తిన్న తరువాత నీళ్లు తాగకూడదు. పండ్లలో అధిక మొత్తంలో నీటి శాతం ఉంటుంది. అలాగే మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలతో (Nutrients) పాటు చక్కెర స్థాయిలు, సిట్రిక్ యాసిడ్ లు ఉంటాయి. కనుక పండ్లు తిన్న తరువాత సుమారు 45 నిమిషాల వరకు నీరు తాగకూడదు.
వేడి, చల్లని పానీయాలు: టీ, కాఫీ, శీతల పానీయాలు ఇలా వేడి, చల్లని ఏ పానీయం తాగిన తరువాత వెంటనే నీటిని అస్సలు తాగకూడదు. ఇలా తీసుకుంటే జీర్ణవ్యవస్థ (Digestive system) మందగిస్తుంది. దీంతో కడుపులో ఆమ్లత్వ సమస్యలకు (Acidity problems) దారితీస్తుంది. ఇది ఉదర ఆరోగ్యానికి మంచిది కాదు.
వేరుశెనగలు: వేరుశెనగలు (Peanuts) తిన్న తరువాత చాలా మంది నీళ్లు తాగుతుంటారు. కానీ ఇలా తాగకూడదు. ఎందుకంటే నీరు, వేరుశెనగలు ఒకదానికొకటి విరుద్ధం. కనుక వేరుశెనగలు తిన్న వెంటనే నీళ్లు తాగితే దగ్గు, గొంతునొప్పి (Sore throat) వంటి సమస్యలు ఏర్పడతాయి.
ఐస్ క్రీమ్స్: ఐస్ క్రీమ్స్ (Ice creams) తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు. ఇలా చేస్తే దంత సమస్యలతో (Dental problems) పాటు చిగుర్లు బలహీనంగా మారుతాయి. ఇది గొంతునొప్పి సమస్యకు కూడా దారితీస్తుంది. ఒకవేళ ఐస్ క్రీమ్స్ తిన్న తరువాత నీరు తాగాలనుకుంటే 15 నిమిషాల తరువాత తాగవచ్చు.
తీపి పదార్థాలు: చాలామంది తీపి పదార్థాలను (Sweet ingredients) తిన్న తరువాత నీరు ఎక్కువగా తాగుతుంటారు. అయితే ఇది మంచిది కాదు. ఇలా నీరు తాగితే శరీరంలో చక్కెర పరిమాణం ఒక్కసారిగా పెరుగుతుంది. ఇది టైప్ 2 డయాబెటిస్ (Type 2 diabetes) కు దారితీస్తుంది.
భోజన సమయంలో: చాలామంది భోజనం చేసే సమయంలో (At meal time) ఎక్కువ నీటిని తీసుకుంటారు. కానీ ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. ఇలా చేస్తే జీర్ణప్రక్రియ మందగిస్తుంది. తిన్న ఆహారం సరిగా జీర్ణం కాదు. ఊబకాయం (Obesity) వచ్చే అవకాశం ఉంటుంది.
అలాగే చాలా వేగంగా పరిగెత్తి ఒక్కసారిగా నీరు తాగకూడదు. ఇలా చేస్తే గుండె ఆరోగ్యానికి ప్రమాదం (Risk to heart health) ఉంటుంది. కనుక ఐదు నిమిషాలు శరీరానికి విశ్రాంతిని (Relax) అందించి తరువాత నీళ్లు తాగాలి.