కూల్ డ్రింక్స్ తాగుతున్నారా.. అయితే జాగ్రత్త.. మీ ఆరోగ్యం ప్రమాదంలో ఉన్నట్టే!
కూల్ డ్రింక్స్ (Cool Drinks) చల్ల చల్లగా తియ్యగా తాగుతుంటే భలే మజా వస్తుంది. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరు కూల్ డ్రింక్స్ ఇష్టపడుతుంటారు.

Cool Drinks
ముఖ్యంగా ఎండాకాలంలో మరింత ఎక్కువగా తాగడానికి ఇష్టపడుతుంటారు చాలామంది. అయితే ఇలా ఎక్కువగా కూల్ డ్రింక్స్ తీసుకుంటే ఆరోగ్యానికి ముప్పు. ఇందులో ఉండే అధిక మొత్తంలోని హానికర రసాయనాలు (Harmful chemicals) ఆరోగ్యాన్ని దెబ్బతీసి అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి ఆ అనారోగ్య సమస్యలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Cool Drinks
వేసవి కాలంలో ఎండ తీవ్రత (Intensity of sun) ఎక్కువగా ఉండడంతో శరీరాన్ని డీహైడ్రేట్ (Dehydrate) బారీ నుంచి కాపాడుకోవడానికి చాలా మంది కూల్ డ్రింక్స్ ను తాగడానికి ఇష్టపడుతుంటారు. అయితే వీటిని ఎప్పుడో ఒకసారి తాగితే పర్వాలేదు కానీ.. ఎక్కువ సార్లు కూల్ డ్రింక్స్ తాగితే శరీరం మరింత డీహైడ్రేట్ కు గురవుతుంది.
Cool Drinks
ఎందుకంటే ఇందులో అధిక మొత్తంలో సోడా, షుగర్ కంటెంట్స్ ఉంటాయి. ఇవి శరీరంలోని నీటి స్థాయులను తగ్గిస్తాయి. దీంతో దాహం తీరకపొగ మరింత అతిదాహం (Thirst) ఏర్పడుతుంది. అలాగే ఈ పానీయాలలో ఉండే అధిక మొత్తంలోని చక్కెర స్థాయిలు శరీరంలో కొవ్వు స్థాయిలని (Fat levels) ఒక్కసారిగా పెంచి శరీర బరువును అమాంతం పెంచుతాయి.
Cool Drinks
దీంతో ఊబకాయం (Obesity) సమస్యలు ఏర్పడతాయి. అలాగే ఈ చల్లని పానీయాలలో అధిక మొత్తంలో కెఫిన్ ఉంటుంది. ఇది శరీరంలో డోపమైన్ అనే కెమికల్ ఉత్పత్తిని పెంచి రక్తపోటును ఊహించని రీతిలో ఒక్కసారిగా పెంచుతుంది. అలాగే ఇది గుండె పనితీరును మందగించి గుండె సమస్యలకు (Heart problems) దారితీస్తుంది.
Cool Drinks
డయాబెటిస్ ఉన్నవారు ఈ పానీయాలను అధిక మొత్తంలో తీసుకుంటే వారి ప్రాణానికి మరింత ముప్పు. ఎందుకంటే ఇందులో అధిక మొత్తంలో క్యాలరీలు, షుగర్ కంటెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలోకి చేరి రక్తంలో చక్కెర స్థాయిలను (Sugar levels) ఒక్కసారిగా పెంచుతాయి. కనుక డయాబెటిస్ (Diabetes) ఉన్నవారు కూల్ డ్రింక్స్ కు దూరంగా ఉండటమే మంచిదని వైద్యులు చెబుతున్నారు.
Cool Drinks
ఈ పానీయాలలో ఫాస్ఫారిక్ ఆసిడ్ (Phosphoric acid) ఉంటుంది. ఇది శరీరంలోని కాల్షియం స్థాయిలను పూర్తిగా తగ్గిస్తుంది. దీంతో ఎముకలు బలహీనపడి ఎముకల ఆరోగ్యం దెబ్బతింటుంది (Impairs bone health). కనుక గర్భిణీ స్త్రీలు సాధ్యమైనంత వరకూ ఈ పానీయాలకు దూరంగా ఉండడమే మంచిది. అప్పుడే కడుపులోని బిడ్డ ఆరోగ్యం కూడా బాగుంటుంది.
Cool Drinks
ఈ పానీయాలలో ఉండే హానికర కెమికల్స్ గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలను రెట్టింపు చేసి జీర్ణశక్తిని తగ్గిస్తాయి (Reduce digestion). అలాగే ఈ పానీయాలలో ఉండే పాస్ఫారిక్, కార్బోనిక్ ఆమ్లాలు నోటిలో ఆమ్ల స్థాయిలను పెంచి దంతక్షయానికి (Tooth decay) దారితీస్తాయి. అలాగే నోటిలో చెడు బ్యాక్టీరియా వృద్ధి చెంది నోటి దుర్వాసన సమస్యలు కలుగుతాయి. అంతే కాకుండా నోటి ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తాయి. కనుక కూల్ డ్రింక్స్ కు సాధ్యమైనంత వరకూ దూరంగా ఉండడమే మంచిది.