MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • మధుమేహులూ.. వర్షాకాలంలో ఇలా చేస్తే మీ పాదాలు సేఫ్..!

మధుమేహులూ.. వర్షాకాలంలో ఇలా చేస్తే మీ పాదాలు సేఫ్..!

మధుమేహులు వర్షాకాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సింపుల్ చిట్కాలను పాటిస్తే వర్షాకాలంలో పాదాలకు సంబంధించిన అంటువ్యాధులు, డయాబెటిస్ తో సంబంధం ఉన్న ఇతర సమస్యల ప్రమాదాన్ని తగ్గించొచ్చు. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 13 2023, 04:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

వర్షాకాలం మధుమేహ వ్యాధిగ్రస్తులను ఎన్నో అనారోగ్య సమస్యల బారిన పడేస్తుంది. ఎందుకంటే తేమతో కూడిన వాతావరణం పాదాలకు సంబంధించిన అంటువ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. అయితే కొన్ని సింపుల్ చిట్కాలతో వర్షాకాలంలో పాదాలను ఆరోగ్యంగా, సురక్షితంగా ఉంచుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

సరైన బూట్లు 

డయాబెటీస్ పేషెంట్లు పాదాల సంరక్షణ విషయానికొస్తే వారు సరైన బూట్లనే వేసుకోవాలి. ముఖ్యంగా సరిగ్గా సరిపోయే బూట్లునే ధరించాలి. అలాగే అవి వెడల్పుగా ఉండాలి. దీంతో మీ కాలి వేళ్లు ఇరుకుగా ఉండవు. కాన్వాస్ లేదా లెదర్ వంటి శ్వాసించే పదార్థాలతో చేసిన బూట్లు ధరించడం కూడా చాలా ముఖ్యం. ఫ్లిప్-ఫ్లాప్స్ లేదా చెప్పులను ధరించడం మానుకోండి. ఎందుకంటే ఇవి మీ పాదాలను సురక్షితంగా ఉంచవు. 

36

మీ పాదాలను క్రమం తప్పకుండా చెక్ చేయండి

ఎర్రగా, వాపు, నొప్పి, గాయం లేదా బొబ్బలు వంటివి మీ పాదాలపై అయ్యే అవకాశం ఉంది. అందుకే మీ పాదాలను క్రమం తప్పకుండా చెక్ చేయండి. ఈ లక్షణాలలో దేనినైనా గమనించినట్టైతే వెంటనే హాస్పటల్ కు వెళ్లండి. ఈ సీజన్ లో మీ పాదాలను శుభ్రంగా, పొడిగా ఉంచడం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే తేమ చర్మంపై బ్యాక్టీరియా పెరగడానికి కారణమవుతుంది. ఇది సంక్రమణకు దారితీస్తుంది. ప్రతిరోజూ మీ పాదాలను గోరువెచ్చని నీరు, తేలికపాటి సబ్బుతో కడగండి. తర్వాత వీటిని బాగా ఎండబెట్టి, అవసరమైతే మాయిశ్చరైజర్ ను అప్లై చేయండి.
 

46

చెప్పులు లేకుండా నడవడం మానుకోండి

వర్షాకాలంలో చెప్పులు లేకుండా నడవడం అంత మంచిది కాదు. ఎందుకంటే నేల తడిగా, జారుడుగా ఉంటుంది. ఇది మీరు జారిపోయే, పడిపోయే ప్రమాదాన్ని పెంచుతుంది. మురికిగా ఉన్నచోట హానికరమైన బ్యాక్టీరియా ఉంటుంది. ఇది మీ సంక్రమణ ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకే మీ ఇంటి వెలుపల ఉన్నప్పుడు కూడా బూట్లను ధరించండి. 
 

 

56

క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి

డయాబెటీస్ పేషెంట్లు పాదాల సంరక్షణలో వ్యాయామం కూడా ఒక ముఖ్యమైన భాగం. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల పాదాలలో రక్త ప్రసరణను మెరుగుపడుతుంది. ఇది సంక్రమణ, పుండ్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అందుకే వాకింగ్, ఈత లేదా సైక్లింగ్ వంటి తక్కువ ప్రభావ వ్యాయామాలు డయాబెటిస్ ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటాయి.
 

66

మీ రక్తంలో చక్కెర స్థాయిలను చెక్ చేయండి

రక్తంలో ఎక్కువ చక్కెర స్థాయిలు పాదాలలో రక్త ప్రసరణను తగ్గిస్తాయి. ఇది పాదాలలో తిమ్మిరి, జలదరింపు వంటి అనుభూతికి దారితీస్తుంది. అందుకే మీ రక్తంలో చక్కెర స్థాయిలను క్రమం తప్పకుండా చెక్ చేయండి. దీంతో ఏవైనా హెచ్చుతగ్గులను ముందుగానే గుర్తించి అందుకు చికిత్స తీసుకోవచ్చు. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Mangoes: అతిగా మామిడి పండ్లు తింటే లావవుతారా?
Recommended image2
Mangoes: మామిడి పండ్లు తింటే ఒంట్లో వేడి చేస్తుందా? ఎక్కువ తింటే ఏమవుతుంది?
Recommended image3
Sugar: శరీరంలో చక్కెర మోతాదు పెరిగితే పేగుల్లో జరిగేది ఇదే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved