బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గాలంటే.. ఉదయం పరిగడుపున వీటిని తాగండి
డయాబెటీస్ తో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది చనిపోతున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం అనుకున్నంత సులువైతే కాదు. క్రమశిక్షణతో కూడిన జీవన శైలి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.

diabetes
రక్తంలో చక్కెర స్థాయిలు విపరీతంగా పెరిగే పరిస్థితినే డయాబెటీస్ అంటారు. ప్యాంక్రియాస్ తగినంత ఇన్సులిన్ ను ఉత్పత్తి చేయకపోవడం లేదా శరీరంలోని కణాలు ఉత్పత్తి చేసే ఇన్సులిన్ కు సరిగ్గా స్పందించకపోవడం వల్ల డయాబెటిస్ వస్తుంది.
diabetes
డయాబెటిస్ ను నియంత్రణలో ఉంచుకోకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. 2019 నాటికి ప్రపంచవ్యాప్తంగా 463 మిలియన్ల మందికి డయాబెటిస్ ఉందని అంచనా వేయబడింది. ఈ డయాబెటీస్ పురుషులు, మహిళలకు సమానంగా వస్తుంది. డయాబెటిస్ ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ఏడవ ప్రధాన కారణం. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం సులభమైన పని కాదన్న సంగతి చాలా మందికి తెలుసు.
ఆహారం, కొన్ని జీవన శైలి మార్పులతో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి డయాబెటిస్ ఉన్నవారు ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగాల్సిన కొన్ని పానీయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
మెంతి వాటర్
మెంతులు సహజంగా ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి. దీనిలో కరిగే ఫైబర్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపర్చడానికి, కార్బోహైడ్రేట్లను గ్రహించడానికి, రక్తంలో గ్లూకోజ్ ను నియంత్రించడానికి సహాయపడతాయి. కొలెస్ట్రాల్, రక్తపోటును తగ్గించడానికి మెంతులు ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. ఉదయం పరిగడుపున మెంతి వాటర్ ను తాగితే మీ రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
ఉసిరికాయ, కలబంద రసం
ఉసిరి, కలబంద శక్తివంతమైన కలయిక. ఇది ఇన్సులిన్ స్రావాన్ని పెంచి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది. ఉసిరికాయలో యాంటీ డయాబెటిస్ గుణాలున్నాయి. ఇది రక్తంలో గ్లూకోజ్ జీవక్రియను పెంచడానికి కూడా సహాయపడుతుంది. బరువు తగ్గడానికి సహాయపడటమే కాకుండా కలబంద జెల్ రక్తంలో చక్కెర స్థాయిలను త్వరగా నియంత్రించడానికి సహాయపడుతుంది.
chia seeds
చియా గింజల నీరు
ఫైబర్, ప్రోటీన్, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉండే చియా విత్తనాల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది బ్లడ్ షుగర్ లెవెల్ పెరగకుండా నివారిస్తుంది. ఒక టేబుల్ స్పూన్ చియా విత్తనాలను ఒక బాటిల్ నీటిలో కలపండి. తర్వాత ఇందులో కొద్దిగా నిమ్మరసాన్ని కలపండి. డయాబెటిస్ ఉన్నవారు ప్రతిరోజూ ఉదయం ఈ నీటిని తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.