పెళ్లికి ముందే డయాబెటిస్ ఉంటే పెళ్లి తర్వాత ఈ ఇబ్బందులు తప్పవా?
ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లకు అనుగుణంగా చిన్న వయసులోనే ఎంతోమంది ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇలా పదిమందిలో ఏడు మంది బాధపడే అనారోగ్య సమస్యలలో డయాబెటిస్ ఒకటి. రోజురోజుకు డయాబెటిస్ సమస్యతో బాధపడే వారి సంఖ్య అధికమవుతుంది.అయితే ప్రస్తుత కాలంలో అతి చిన్న వయసులోనే డయాబెటిస్ బాధపడుతున్నారు. అయితే పెళ్లి కాని వారు డయాబెటిస్ బారిన పడితే ఈ సమస్యలు తప్పవని నిపుణులు చెబుతున్నారు.

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు వారి ఆహార విషయంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నారు తద్వారా చిన్నవయసులోనే డయాబెటిస్ వ్యాధి బారిన పడుతున్నారు.అయితే పెళ్లికి ముందే డయాబెటిస్ వచ్చినవారికి పెళ్లయిన తర్వాత కొన్ని విషయాలలో సమస్యలు తప్పవని నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే పెళ్లికి ముందే డయాబెటిస్ తో బాధపడేవారు డాక్టర్ ను కలిసి వారి సూచనలను పాటించడం వల్ల వివాహం తర్వాత కూడా ప్రశాంతమైన జీవితాన్ని అనుభవించవచ్చు లేకపోతే కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి ఆ సమస్యలు ఏంటి అనే విషయానికి వస్తే...
పెళ్లికి ముందు డయాబెటిస్ సమస్యలతో బాధపడేవారు పెళ్లయిన తర్వాత శృంగార జీవితంలో కాస్త ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మన శరీరంలో చక్కెర నిల్వలు ఎక్కువైనప్పుడు నరాలలో రక్తప్రసరణ తగ్గిపోతుంది. తద్వారా తొందరగా అంగస్తంభన లేకపోవడం, శీఘ్రస్కలనం లాంటి సమస్యలు వస్తాయి. మహిళలలో కూడా చర్మం పొడిబారిపోయి శృంగార సమయంలో ఎంతో ఇబ్బందిని ఎదుర్కొంటారు.
ఇక మహిళలలో కూడా పెళ్లికి ముందు డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నట్లయితే పెళ్లి తరువాత శరీరంలో చక్కెర స్థాయిలో అధికమవడం వల్ల ఫాలోఫియాన్ ట్యూబులలో ఇన్ఫెక్షన్ కారణంగా అడ్డంకులు ఏర్పడి రుతుక్రమం సక్రమంగా రాకపోవడం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. తద్వారా గర్భధారణ కూడా సమస్యగా మారుతుంది. ఇక మగవారిలో కూడా శుక్రకణాల ఉత్పత్తి తగ్గడం ఉత్పత్తి అయిన కణాలు కూడా బలహీనంగా కావడం వల్ల సంతానం కలిగే అవకాశాలు కూడా పూర్తిగా తగ్గిపోతాయి.
మన శరీరంలో చక్కెర స్థాయిలో ఎక్కువైన లేదా తక్కువైన దాని ప్రభావం రక్తప్రసరణ పై పడుతుంది.ముఖ్యంగా మెదుడుకు గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళాల పై ప్రభావం అధికంగా పడటం వల్ల చాలామంది తొందరగా ఉద్వేగానికి గురవడం అధిక మానసిక ఒత్తిడికి గురవడం జరుగుతుంది.ఈ క్రమంలోనే పెళ్లికి ముందే డయాబెటిస్ ఉన్నవారు డాక్టర్ ని సంప్రదించి వారి సలహాలు సూచనలు పాటించడం వల్ల ఈ సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు.