రంగురంగుల నెయిల్ పాలిష్ లను ఉపయోగిస్తుంటారా? ఈ విషయం తెలిస్తే ఇకనుంచి వీటిని వాడనే వాడరు..!
ఆడవారికి మొహందీ, నెయిల్ పాలిష్ లు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదేమో. ఏరోజుకారోజు డ్రెస్సుకు మ్యాచ్ అయ్యే నెయిల్ పాలిష్ లు వాడేవారిని చూసే ఉంటారు. దీన్ని బట్టే తెలుసుకోవచ్చు ఆడవారికి నెయిల్ పాలిష్ పిచ్చి ఎలా ఉంటుందో. ఇది మీ గోర్లను అందంగా కనిపించేలా చేసినా.. ఆరోగ్యాన్ని మాత్రం చాలా అంటే చాలా దెబ్బతీస్తుంది తెలుసా?
Nail polish
నూటిలో ఏ ఒక్కరికో, ఇద్దరికో నెయిల్ పాలిష్ అంటే ఇష్టం ఉండదు. కానీ మిగతా 99 శాతం ఆడవారికి నెయిల్ పాలిష్ అంటే పిచ్చి. చాలా మంది వేసుకున్న బట్టలకు మ్యాచ్ అయ్యే నెయిల్ పాలిష్ నే పెట్టుకుంటుంటారు. పెద్దలే కాకుండా చిన్న చిన్న పిల్లలకు కూడా వీటిని పెడుతుంటారు. ఈ నెయిల్ పాలిష్ లు ఆడవారి అందాన్ని పెంచుతాయి. అందుకే కదా ఆడవారు వీటిని అంతగా ఇష్టపడేది. కొంతమంది అమ్మాయిలైతే ప్రతిరోజూ నెయిల్ పాలిష్ ను మారుస్తుంటారు. ఎంతైనా ఆడవారు అందంగా కనిపించడంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కారు కదా.
Image: Getty
కానీ నెయిల్ పాలిష్ గురించి మనకు తెలియని విషయాలెన్నో ఉన్నాయి. ఇవి పెట్టుకుంటే అందంగా కనిపిస్తారు. ఇది నిజమే. కానీ ఇది మీ ఆరోగ్యానికి చేసే చెడు అంతా ఇంతా కాదు. అవును నెయిల్ పాలిష్ మనల్ని ఎన్నో ప్రమాదకరమైన రోగాల బారిన పడేస్తుంది. నెయిల్ పాలిష్ ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల గోళ్లు బలహీనపడతాయి. గోర్ల రంగు మారుతుంది. అవి సహజంగా కాంతివంతంగా ఇకపై కనిపించవు.
Image: Getty
నెయిల్ పాలిష్ మన ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?
నెయిల్ పాలిష్ లో ఎన్నో రకాల కెమికల్స్ ఉంటాయి. ఇది మన చర్మానికి, కళ్లకు అంటకున్నా, లేదా ఫుడ్ తో పాటుగా నోట్లోకి వెళ్లినా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇది మీ ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. నెయిల్ పాలిష్, ఇతర రంగురంగుల బ్యూటీ ప్రొడక్ట్స్ లో ఫార్మాల్డిహైడ్ అనే కెమికల్ ఉంటుంది. ఇది ఉత్పత్తులను జిగురులా చేస్తుంది. అయితే ఈ కెమికల్ చర్మానికి అంటుకుంటే దురద పెడుతుంది. మంట వంటి సమస్యలు కూడా వాస్తాయి. ఈ అలెర్జీ పెరిగితే మీరెన్నో ప్రమాదకరమైన సమస్యలను ఫేస్ చేసే అవకాశముంది.
నెయిల్ పాలిష్ దుష్ప్రభావాలు
నెయిల్ పాలిష్ లో ఉండే కెమికల్స్ మీ శరీరంలోకి వెళ్లి మానవ వ్యవస్థపై ఎంతో ప్రమాదకరమైన ప్రభావాలను చూపుతాయి. వీటిలో ఉండే కెమికిల్స్ జీర్ణ వ్యవస్థపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. అలాగే హార్మోన్ల వ్యవస్థల్లో అవాంతరాలను కలిగిస్తాయి.
నెయిల్ పాలిష్ ఉపయోగించే ఆడవారిలో ప్రమాదకరమైన ట్రైఫెనైల్ ఫాస్ఫేట్ వంటి విష పదార్ధం ఉన్నట్టు కనుగొన్నారు.
మీరు వాడే నెయిల్ పాలిష్ లో ఉండే కెమికల్స్ మీ మెదడు, నాడీ వ్యవస్థలో మార్పులకు కారణమవుతాయని పరిశోధకులు చెబుతున్నారు.
nail polish
నెయిల్ పాలిష్ లో ఉండే టోల్యూన్ అనే మూలకం పాలిచ్చే తల్లుల నుంచి పిల్లల శరీరంలోకి వెళుతుంది. అయితే ఇది పిల్లల ఎదుగుదలపై ప్రభావం చూపుతుందట.
నెయిల్ పాలిష్ ను పెట్టుకున్న 10 గంటల తర్వాత దీని ప్రభావం బాగా పెరుగుతుందట.
ఇకపోతే వీటిలో ఉండే టోల్యూన్ రసాయనం మీ శరీరంలోకి ఎక్కువగా వెళితే మీ కాలేయం, మూత్రపిండాలు దెబ్బతింటాయి.
నెయిల్ పాలిష్ ను ఉపయోగిస్తే మీ గోర్లు దెబ్బతింటాయి.
అంతేకాదు దీన్ని ఎక్కువగా యూజ్ చేయడం వల్ల మీ గోర్లు బలహీనపడతాయి. అలాగే గోర్లలో పగుళ్లు వస్తాయి. ముఖ్యంగా వీటిని ఎక్కువగా ఉపయోగించడం వల్ల మీ గోర్లు మునపటిలా సహజంగా కాంతివంతంగా కనిపించవు.
నెయిల్ పాలిష్ ను తయారుచేయడానికి యాక్రిలేట్స్ అనే కెమికల్స్ ను వాడుతారు. ఇది మీ శరీరంలోకి వెళితే కొలెరెక్టల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.