డాబా స్టైల్ కాజు పన్నీర్ మసాలా ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది!
పన్నీర్ మంచి పౌష్టికాహారం (Nutrition). పన్నీర్ తో వివిధ రకాల వంటలను వండుకోవచ్చు. పన్నీర్ తో చేసుకునే కూరలు భలే రుచిగా ఉంటాయి.

ఈసారి మనం డాబా స్టైల్ కాజు పన్నీర్ మసాలాను ట్రై చేద్దాం. ఈ మసాలా కూర రోటీల్లోకి బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు మనం డాబా స్టైల్ కాజు పన్నీర్ మసాలా (Dhaba style kaju paneer masala) తయారీ విధానం గురించి తెలుసుకుందాం..
కావలసిన పదార్థాలు: 250 గ్రాముల పన్నీర్ (Paneer) ముక్కలు, పావు కప్పు జీడిపప్పు (Cashew), రెండు ఉల్లిపాయలు (Onions), రెండు పెద్ద టమోటాలు (Tomatoes), రెండు పచ్చిమిరపకాయలు (Chilies), ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ (Ginger garlic paste), ఒక స్పూన్ జీలకర్ర పొడి (Cumin powder), ఒక టేబుల్ స్పూన్ కారం పొడి (Chili powder), ఒక టీ స్పూన్ ధనియాల పొడి (Coriander powder).
సగం స్పూన్ గరం మసాలా (Garam masala), సగం స్పూన్ పసుపు (Turmeric), రుచికి సరిపడా ఉప్పు (Salt), ఒక స్పూన్ జీలకర్ర (Cumin), రెండు టేబుల్ స్పూన్ ల చిలికిన పెరుగు (Yogurt), రెండు టేబుల్ స్పూన్ ల ఫ్రెష్ క్రీమ్ (Fresh cream), కొద్దిగా కొత్తిమీర (Coriander) తరుగు, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి (Ghee), పావు కప్పు నూనె (Oil).
తయారీ విధానం: స్టవ్ మీద కడాయి పెట్టి రెండు టేబుల్ స్పూన్ ల నూనె (Oil) వేసి నూనె వేగిన తరువాత జీడిపప్పు (Cashew) పలుకులు వేసి ఎర్రగా వేపుకుని ప్రక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో రెండు టేబుల్ స్పూన్ ల నూనె వేసి నూనె వేడెక్కిన తరువాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ తరుగును వేసి మంచి కలర్ వచ్చేంత వరకూ వేయించుకోవాలి.
ఉల్లిపాయలు వేగిన తరువాత పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. తరువాత అందులో జీలకర్ర పొడి, రుచికి సరిపడా ఉప్పు, ధనియాల పొడి, కారం, గరం మసాలా, పసుపు వేసి బాగా కలుపుకోవాలి (Mix well). మసాలాలన్నీ బాగా మగ్గిన తరువాత టమోటా పేస్ట్ (Tomato paste) వేసి టమోటాలో నుంచి నూనె పైకి తేలే వరకు వేపుకోవాలి.
టమోటాలు బాగా మగ్గిన తరువాత ఒక కప్పు నీళ్లు వేసి కూర చిక్కబడేంత వరకూ ఉడికించుకోవాలి. తరువాత ఇందులో బాగా చిలికిన పెరుగు (Whipped yogurt) వేసి తక్కువ మంట (Low flame) మీద బాగా కలుపుకోవాలి. కూరలో పెరుగు బాగా కలిసిపోయాక అప్పుడు ఇందులో పన్నీర్ ముక్కలు, ముందుగా ఫ్రై చేసుకున్న కాజులను వేసి బాగా కలుపుకోవాలి.
ఐదు నిమిషాల తరువాత ఇందులో ఫ్రెష్ క్రీమ్ (Fresh cream), నెయ్యి, కొత్తిమీర తరుగు వేసి బాగా కలుపుకొని కూర నుంచి నూనె పైకి తేలేవరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన (Delicious) డాబా స్టైల్ కాజు పనీర్ మసాలా రెడీ. ఈ కూరను రోటీలతో తీసుకుంటే భలే రుచిగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి.