Cracked Heels: రాత్రిపూట ఇవి రాసుకుంటే చాలు.. పాదాల పగుళ్లు మాయం!
పాదాల పగుళ్లు చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య. ముఖ్యంగా నడిచేటప్పుడు పాదాల పగుళ్ల కారణంగా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అయితే ఇంట్లో దొరికే కొన్ని పదార్థాలతో ఈ సమస్యకు ఈజీగా చెక్ పెట్టవచ్చు. అవెంటో ఒకసారి చూసేయండి.

పాదాలు పగలడం సాధారణ సమస్య. ఇది అన్ని కాలాల్లోనూ వస్తుంది. దీనికి ప్రధాన కారణం శరీరంలో పోషకాల లోపం, చర్మ వ్యాధులు, థైరాయిడ్, కీళ్ల నొప్పులు. సరిగ్గా చూసుకోకపోతే ఇది తీవ్రమవుతుంది. తీవ్రమైన నొప్పి, రక్తస్రావం కూడా ఉండొచ్చు. ఈ సమస్యకు కొన్ని ఇంటి చిట్కాలు ఉన్నాయి. అవెంటో ఇక్కడ చూద్దాం.
నిమ్మతో ఇలా చేస్తే?
ఒక బకెట్లో సగం వెచ్చని నీళ్లు పోసి, ఒక నిమ్మకాయ రసం, ఒక చెంచా గ్లిజరిన్, రోజ్ వాటర్ కలిపాలి. వాటిలో కాళ్లను 20 నిమిషాలు ఉంచాలి. స్క్రబ్బర్ తో రుద్ది, మళ్ళీ ఈ మిశ్రమాన్ని పాదాలకు రాసి సాక్స్ వేసుకోవాలి. ఉదయం కడిగేయాలి. కొన్ని రోజుల్లోనే పాదాలు మృదువుగా మారుతాయి.
తేనె
ఒక బకెట్ వెచ్చని నీళ్లలో తేనె కలిపి, కాళ్లను 20 నిమిషాలు ఉంచాలి. స్క్రబ్ చేసి, వెచ్చని నీటితో కడగాలి. మార్పు కనిపించే వరకూ ప్రతిరోజూ చేయాలి.
కొబ్బరి నూనె
పాదాల పగుళ్లకు కొబ్బరి నూనెతో మసాజ్ చేసి, సాక్స్ వేసుకోవాలి. ఉదయం వెచ్చని నీటితో కడగాలి. ఇది చాలా సులభమైన, ప్రభావవంతమైన పద్ధతి.
కలబంద
వెచ్చని నీళ్లలో కాళ్లను 10 నిమిషాలు ఉంచి, స్క్రబ్ చేసి, కలబంద గుజ్జు రాసి, సాక్స్ వేసుకుని, ఉదయం కడిగేయాలి.