MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • Health Tips: స్లిమ్ గా అవ్వాలనుకుంటే.. ఈ వాటర్ కచ్చితంగా తాగాల్సిందే!

Health Tips: స్లిమ్ గా అవ్వాలనుకుంటే.. ఈ వాటర్ కచ్చితంగా తాగాల్సిందే!

Health Tips: లావుగా ఉన్నవాళ్లు సన్నబడటం కోసం చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే పొద్దున్నే ఖాళీ కడుపుతో ధనియాల నీరు తాగితే త్వరగా సన్నబడవచ్చు అంటున్నారు నిపుణులు అది ఎలాగో చూద్దాం.
 

Navya G | Updated : Oct 16 2023, 02:32 PM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Asianet Image

 ధనియాలలో పొటాషియం, కాల్షియం, విటమిన్ సి, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు వ్యాధులను దూరంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇందులో ఉండే ఆంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ను తగ్గించడంలో సహాయపడతాయి.
 

26
Asianet Image

 అంతేకాకుండా అనేక రకాలు వ్యాధులతో పోరాటంలో సహాయపడుతుంది. ఖాళీ కడుపుతో ధనియాలు వాటర్ తీసుకోవడం వలన జీర్ణవ్యవస్థకు చాలా మేలు చేస్తుంది. ఇది గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యల నుంచి ఉపశమనం  కలిగిస్తుంది.

36
Asianet Image

 అలాగే ధనియాల వాటర్ ని రెగ్యులర్ గా తీసుకోవడం వలన గుండె ఆరోగ్యంగా ఉంటుంది. దీనిని వాడకం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. తద్వారా గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా బరువుని నియంత్రిస్తుంది. ఖాళీ కడుపుతో ధనియాల నీరు తాగటం వలన మలబద్ధకం, గ్యాస్ తొలగిస్తుంది.

46
Asianet Image

 దీనితో పొట్ట బాగా శుభ్రపడుతుంది. ఇది పొట్టలోని కొవ్వుని తొలగించడంలో సహాయపడుతుంది తద్వారా ఊబకాయం నుంచి ఉపశమనం పొందవచ్చు. అంతేకాకుండా ధనియాలు నీరు ని రోజూ తీసుకుంటే ధనియాలలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు..
 

56
Asianet Image

 చర్మాన్ని శుభ్రంగా, ఆరోగ్యంగా ఉండేలాగా చేస్తుంది. ధనియాల లో ఉండే అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అంతేకాకుండా ఇందులో ఉండే విటమిన్ ఏ, విటమిన్ సి తో పాటు ఇంకా ఇతర పోషకాలు అనేకం ఉంటాయి. తద్వారా జలుబు, దగ్గు, జ్వరం నుంచి ఉపశమనం పొందవచ్చు.
 

66
Asianet Image

 అంతేకాకుండా ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగడం మధుమేహ రోగులకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ధనియాల వాటర్ ని ఎలా తయారు చేస్తారంటే రాత్రి పడుకునే ముందు నీటిలో కాసిన్ని ధనియాలు వేసి నానబెట్టండి. పొద్దున్నే వాటిని మరిగించండి చల్లారిన తర్వాత ఖాళీ కడుపుతో ఆ ద్రవాన్ని  సేవించండి. త్వరగా సన్నబడటమే కాకుండా ఇంకా అనేక రకాల ప్రయోజనాలని పొందండి.

Navya G
About the Author
Navya G
 
Recommended Stories
Top Stories