Health Tips: మధుమేహ వ్యాధిగ్రస్తులు గర్భం దాల్చితే ప్రమాదమా.. షుగర్ గురించి డాక్టర్లు ఏమంటున్నారు!
Health Tips: సాధారణంగా షుగర్ తో బాధపడే ఆడవాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తే వారు ఎన్నో ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటారు అయితే ఇందులో నిజం ఎంత అసలు మధుమేహం గురించి డాక్టర్లు ఏమంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
డయాబెటిస్ అనేది చక్కెర ఎక్కువగా తినటం వల్ల వస్తుందని, షుగర్ ఉంటే స్వీట్లు తినకూడదు అని చాలామందికి అపోహలు ఉన్నాయి. అయితే అపోహలు మాని నిజానిజాలు తెలుసుకోండి. నిజానికి అన్ని రకాల మధుమేహం అంత ప్రమాదకరమైనది కాదు. కాకపోతే సరి అయిన జాగ్రత్తలు తీసుకోవాలి.
చాలామంది అన్ని రకాల మధుమేహం ఒకటే అనుకుంటారు. అయితే టైప్ వన్ మధుమేహం, టైప్ టు మరియు గర్భధారణ మధుమేహం రెండు వేరు వేరు, రెండు డయాబెటిస్ కి విభిన్నమైన మెడిసిన్ అవసరం అవుతుంది. గర్భధారణ సమయంలో వచ్చే మధుమేహానికి రోజువారి చికిత్స అవసరం లేదు.
గర్భధారణ తర్వాత ఆ మధుమేహం పోతుంది. అలా కాకుండా ఉన్న మధుమేహానికి రోజు వారి నిర్వహణ అవసరం. గర్భధారణ సమయంలో వచ్చే మధుమేహం కాకుండా వచ్చే ఏ మధుమేహం అయినా కొంచెం సంక్లిష్టమైనది. మధుమేహం ఉన్న స్త్రీలు గర్భం దాల్చిన సమయంలో ఇబ్బందులకి గురవుతారు అని అపోహ ఉంది.
అయితే అది కూడా నిజం కాదు కాకపోతే సరియైన జాగ్రత్తలు తీసుకుంటూ డాక్టర్ల పర్యవేక్షణలో ఉంటే ఆ సమస్యను కూడా అధిగమించవచ్చు. కానీ అశ్రద్ధ చేస్తే మాత్రం ప్రభావం కడుపులో బిడ్డ మీద పడుతుంది. అలాగే టైప్ వన్ డయాబెటిస్ వారికి ఇన్సులిన్ మార్పుల మీద ఆధారపడి ఉంటారు కాబట్టి వాళ్లకి ఇన్సులిన్ అవసరం.
అదే టైప్ డయాబెటిస్ వారికి 6 నుంచి 10 సంవత్సరాల తర్వాత ఇన్సులిన్ అవసరం అవుతుంది. అలాగే తీపి పదార్థాలు తినడం మానేస్తే షుగర్ తగ్గుతుంది అనుకోవటం అపోహ. షుగర్ అదుపులో ఉండాలంటే ముఖ్యమైనది వ్యాయామం చేయటం.
అలాగే అధిక బరువు లేదా ఊబకాయం టైప్ టు డయాబెటిస్ కి ప్రమాదకారకం కానీ ప్రత్యక్ష కారణం కాదు. అధిక బరువు ఉన్న వ్యక్తులు టైప్ టు డయాబెటిస్ ని అభివృద్ధి చేయకపోవచ్చు. కాబట్టి సరైన అవగాహనతో జాగ్రత్తలు తీసుకుంటే డయాబెటిస్ ని అదుపులో ఉంచుకోవచ్చు.