చైనీస్ స్టైల్ వెజ్ మోమోస్.. ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి.. రుచి అదిరిపోతుంది!
కూరగాయల తరుగుతో నూనెలో ఢీ ఫ్రై చెయ్యకుండా ఆవిరి (Steam) మీద ఉడికించుకుని తయారుచేసుకునే ఈ వెజ్ మోమోస్ చాలా రుచిగా ఉంటాయి.

తక్కువ పదార్థాలతో సులభంగా వీటిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ స్నాక్ ఐటం మీ కుటుంబ సభ్యులకు తప్పక నచ్చుతుంది. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు మనం చైనీస్ స్టైల్ వెజ్ మోమోస్ (Chinese style veg momos) తయారీ విధానం గురించి తెలుసుకుందాం..
కావలసిన పదార్థాలు: సగం కప్పు మైదా (Maida), సగం కప్పు క్యాబేజీ (Cabbage) తురుము, రెండు టేబుల్ స్పూన్ ల సన్నని క్యాప్సికం (Capsicum) తరుగు, రెండు టేబుల్ స్పూన్ ల క్యారెట్ (Carrot) తురుము, రుచికి సరిపడా ఉప్పు (Salt), పావు స్పూన్ మిరియాల పొడి (Pepper powder).
చిటికెడు తెల్ల మిరియాల పొడి (White pepper powder), సగం స్పూన్ అల్లం (Ginger) తరుగు, సగం స్పూన్ సోయాసాస్ (Soy sauce), సగం స్పూన్ సన్నని వెల్లుల్లి (Garlic) తరుగు, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ (Oil).
తయారీ విధానం: ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో మైదా, కొద్దిగా ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి చాలా మెత్తగా చపాతీపిండిలా కలుపుకోవాలి (Mix well). ఇలా బాగా మెత్తగా కలుపుకున్న పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని తడిగుడ్డను (Dump Cloth) కప్పి ఇరవై నిమిషాల పాటు నానబెట్టుకోవాలి.
ఇప్పుడు స్టఫింగ్ కోసం (For stuffing) ఒక కాటన్ క్లాత్ ను తీసుకొని అందులో సన్నగా తరిగిన పచ్చి క్యాబేజీ తురుము, క్యాప్సికమ్ తరుగు, క్యారెట్ తురుమును వేసి ఎంత సాధ్యం అయితే అంతమేరకు నీటిని గట్టిగా పిండేయాలి. ఇలా కూరగాయలలోని నీటిని మొత్తం పిండేస్తే మోమోస్ పచ్చివాసన రాకుండా ఎక్కువసేపు తాజాగా (Fresh) ఉంటాయి.
ఇలా నీటిని పిండిన మిశ్రమాన్ని ఒక గిన్నెలో తీసుకుని రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి, తెల్ల మిరియాల పొడి, సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి తరుగు, సోయా సాస్ (Soya sauce) వేసి బాగా కలుపుకోని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న పిండిని (Soaked dough) తీసుకొని చిన్న పూరీల్లా ఒత్తుకోవాలి.
ఇలా చేసుకున్న పూరీలలో క్యాబేజీ స్టఫింగ్ ను పెట్టి మోమోస్ ఆకారంలో (Momos shape) చుట్టుకోవాలి. ఇలా మొత్తం పిండిని తయారు చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో నీళ్లు పోసి నూనె రాసుకున్న మోమోస్ స్టీమింగ్ ప్లేట్ ను పెట్టి అందులో చేసుకున్న మోమోస్ లను పెట్టుకుని పదిహేను నిముషాల పాటు తక్కువ మంట (Low flame) మీద ఉడికించుకోవాలి.
అంతే ఎంతో రుచికరమైన (Delicious) వేడివేడి నోరూరించే చైనీస్ వెజ్ మోమోస్ రెడీ. వీటిని మోమోస్ చట్నీతో కానీ, కిచప్ తో కానీ సర్వ్ (Serve) చేస్తే భలే రుచిగా ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి.