MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • Health Tips : మగవారిలో ఈ లక్షణాలు కనిపిస్తే అశ్రద్ధ చేయకండి.. క్యాన్సర్ కి తొలి అడుగుని గుర్తించండి!

Health Tips : మగవారిలో ఈ లక్షణాలు కనిపిస్తే అశ్రద్ధ చేయకండి.. క్యాన్సర్ కి తొలి అడుగుని గుర్తించండి!

Health Tips: క్యాన్సర్ అనేది వినటానికి కూడా భయపడే ఒక భయంకరమైన వ్యాధి. అయితే ఈ క్యాన్సర్ వచ్చేముందు మగవారిలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వీటిని అశ్రద్ధ చేస్తే చేజేతులా క్యాన్సర్ ని ఆహ్వానించినట్లే. అందుకే ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. 

1 Min read
Author : Navya G
Published : Oct 02 2023, 10:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

క్యాన్సర్ ప్రపంచంలో చనిపోవటానికి రెండవ అతిపెద్ద కారణం. క్యాన్సర్ వచ్చే ముందు మగవారి శరీరంలో కొన్ని మార్పులు కనిపిస్తాయి. వాటిని ఏమాత్రం అశ్రద్ధ చేయటం మంచిది కాదు.సాధారణంగా మగవారి మూత్రవిసర్జన సమయంలో నొప్పి, అసౌకర్యం, అంగస్తంభనలో రక్తాన్ని అనుభవిస్తే అది ప్రోస్టేట్ క్యాన్సర్ కి సంకేతం కావచ్చు. అందుకే ఇలాంటి విషయాలలో అస్సలు అశ్రద్ధ చేయకండి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

అలాగే దీర్ఘకాలిక నిరంతర దగ్గు అనేక విషయాలను సూచిస్తుంది. అలాగే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గొంతు బొంగురు పోవడం లేదా దగ్గినప్పుడు రక్తం పడటం, ఎలాంటి కారణమూ లేకుండా రెండుమూడు వారాలు అంతకంటే ఎక్కువ దగ్గు కొనసాగినట్లయితే ఇది అస్సలు నిర్లక్ష్యం చేయకూడని లక్షణం.
 

36

 కచ్చితంగా మీరు వైద్యుడిని సంప్రదించవలసిన సమయం. అలాగే పురుషుల స్పర్మ్ పరిమాణము, ఆకృతిలో ఏమైనా మార్పులు ఉన్నాయేమో క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి. స్త్రీలు తమ రొమ్ములను ఎలా అయితే స్వీయ పరీక్ష చేసుకోవాలో అలాగే పురుషులు కూడా తమ వృషణాలను స్వయంగా పరీక్షించుకోవాలి.
 

46

వృషణాలు గడ్డలుగా కనిపించినా లేదంటే కొంచెం పెద్దవిగా కనిపించినా కూడా అసలు నిర్లక్ష్యం వహించకండి. ఇది వృషణ క్యాన్సర్ కి సంకేతం కావచ్చు. అలాగే మలంలో రక్తం పడటం, సుదీర్ఘమైన పొత్తికడుపు నొప్పి ఉంటే అది పెద్ద ప్రేగు క్యాన్సర్ కు సంకేతం కావచ్చు.
 

56

 కాబట్టి ఎలాంటి చిన్న అనుమానం వచ్చినా కూడా అశ్రద్ధ వహించకండి. అలాగే క్యాన్సర్ వైరస్ వ్యాప్తి చెందుతున్న సమయంలో గొంతు నొప్పిగా అనిపిస్తుంది. ఈ నొప్పి కొన్ని వారాలపాటు కొనసాగితే ఆహారాన్ని మింగడం కష్టమవుతుంది ఇది ఊపిరితిత్తుల క్యాన్సర్ కావచ్చు.

66

 కాబట్టి వెంటనే వైద్యుడిని సంప్రదించండి. అలాగే చర్మం పొలుసులు లేదా పుండ్లు లేదా మొటిమలు అలాగే పుట్టుమచ్చలు మొదలైనవి ఆకస్మాత్తుగా కనిపిస్తే అది చర్మ కాన్సర్ కి సంకేతం. కాబట్టి ఏ చిన్న విషయాన్ని అశ్రద్ధ చేయకండి. వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Fertility Crisis: ప్రమాదంలో మానవ జాతి? భవిష్యత్తులో పిల్లలు పుట్టడం కష్టమే.. ఏం జరుగుతోంది?
Recommended image2
AC : ఎండలోంచి నేరుగా ఏసీ రూమ్‌ లోకి వెళ్తున్నారా..? ఆ చల్లదనం ఎంత డేంజరో తెలుసా..?
Recommended image3
Thyroid Cancer: ఇవి తెలుసుకుంటే థైరాయిడ్ క్యాన్సర్‍కు చెక్ పెట్టొచ్చు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved